Nellore

News June 7, 2024

నెల్లూరు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గుండెపోటుతో మృతి

image

బీజేపీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జి రెడ్డి శుక్రవారం మరణించారు. ఆయనకు గుండెపోటు రావడంతో హఠాత్తుగా మరణించారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులతో పాటు పలువురు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు.

News June 7, 2024

వెంకటగిరి చరిత్రతో ఒకే ఒక్కరు..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ గెలిచిన విషయం తెలిసిందే. వెంకటగిరిలో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వాళ్లలో కురుగొండ్ల ఒక్కరే వెంకటగిరి నియోజవర్గ చరిత్రలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా నిలిచారు. నేదురమల్లి రాజ్యలక్ష్మి రెండు సార్లు విజయం సాధించగా.. మిగిలిన ఎవరూ తిరిగి ఇక్కడి నుంచి రెండోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు.

News June 7, 2024

నెల్లూరు జిల్లాలో ఎన్నికల కోడ్ తొలగింపు

image

ఎన్నికల కౌంటింగ్ విజయవంతగా పూర్తవడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ గురువారం సాయంత్రంతో ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. పూర్తి చిత్తశుద్ధితో పని చేసిన ఎన్నికల సిబ్బందికి, పోలీస్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, విద్యుత్ సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎస్పీ సమక్షంలో నిర్వహించిన పటిష్ఠ బందోబస్తు వలన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని అన్నారు.

News June 7, 2024

జగన్‌తో తిరుపతి ఎంపీ భేటీ

image

వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తిరుపతి ఎంపీగా గెలిచిన మద్దిల గురుమూర్తి గురువారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ ఓటమికి గల కారణాలను ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని జగన్, గురుమూర్తికి చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

News June 7, 2024

నెల్లూరులో మంత్రి పదవి ఎవరికో..?

image

నెల్లూరు జిల్లాలో మంత్రి పదవులు ఎవరికి వస్తాయనేది ఉత్కంఠగా మారింది. సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశిస్తున్నారు. అదే సమయంలో మరో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు మంత్రివర్గంలో చోటిస్తే సంతోషిస్తానన్నారు. మరి మీ జిల్లా నుంచి ఎవరు మంత్రి అవుతారనుకుంటున్నారు..?

News June 7, 2024

నెల్లూరు జిల్లాలో NOTAకి పడిన ఓట్లు ఇవే..!

image

➤ నెల్లూరు సిటీ: 967
➤ కోవూరు: 2,377
➤ కావలి: 2,030
➤ ఆత్మకూరు: 2,347
➤ నెల్లూరు రూరల్: 2,016
➤ ఉదయగిరి: 2,072
➤ వెంకటగిరి: 3,037 ➤ గూడూరు: 3,129
➤ సూళ్లూరుపేట: 3,423 ➤ సర్వేపల్లి: 2,057
➤ మొత్తం: 23,455

News June 7, 2024

మార్కెట్లో విచ్చలవిడిగా ఎక్స్‌పైర్ డేట్ శీతల పానీయాలు

image

చేజర్ల మండలంలోని పలు దుకాణాల్లో ఓ కంపెనీకి చెందిన ఎక్స్‌పైర్ డేట్ శీతల పానీయాలు తరచూ కనిపిస్తున్నాయి. గురువారం మండలంలోని చిత్తలూరు గ్రామంలో ఓ దుకాణంలో ఓ వ్యక్తి కొనుగోలు చేసిన మాజా ఎక్స్‌పైర్ డేట్ అయిపోయిందని గమనించారు. ఇటీవల పొదలకూరులో కూడా వెలుగు చూశాయి. దీంతో అమ్మకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

News June 6, 2024

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి.?

image

నెల్లూరు TDP ఎంపీగా భారీ మెజార్టీ (2,45,902)తో గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న వేమిరెడ్డి కేంద్ర మంత్రి అయితే, రాష్ట్రానికి కంపెనీలు తీసుకుని వస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ అన్నీ స్థానాలు గెలవడానికి కూడా ఆయన కృషి ఉంది.

News June 6, 2024

నెల్లూరు: రికార్డు తిరగరాసిన ఎమ్మెల్యే

image

సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా గెలిచిన నెలవల విజయశ్రీ రికార్డు సృష్టించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఓ మహిళ ఎమ్మెల్యేగా గెలిచింది లేదు. ఈ ఎన్నికల్లో కిలివేటి సంజీవయ్యపై 29115 ఓట్ల మెజారిటీతో గెలిచి ఆ రికార్డును నెలవల విజయశ్రీ తిరగరాశారు. అయితే సూళ్లూరుపేటలో 1962 నుంచి 2024 వరకు ఎన్నికలు జరిగగా..1983లో మైలరీ లక్ష్మీకాంతమ్మ, 2009లో విన్నమాల సరస్వతి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడి పోయారు.

News June 6, 2024

నెల్లూరు: మంత్రి పదవి ఎవరికి.. జోరుగా ప్రచారం

image

నెల్లూరు జిల్లాలో టీడీపీ పదికి పది స్థానాలు దక్కించుకుంది. అయితే మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో పలువురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. విద్యాశాఖ మంత్రిగా నారాయణ, ఇరిగేషన్ మంత్రిగా ఆనం, వ్యవసాయ మంత్రిగా సోమిరెడ్డి పేర్లు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. అయితే మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..!