Nellore

News February 10, 2026

ఉదయగిరి: ఆధార్ కార్డుపై కీలక అప్డేట్ ?

image

దేశంలో ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోని వారి కార్డులు నిలిపివేసినట్లు ఉదయగిరి ఆధార్ నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ కార్డులో ఎటువంటి అప్డేట్ చేయాలనుకున్న ముందుగా వాటి చెల్లుబాటు స్థితి తప్పనిసరిగా తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. రద్దు చేయబడిన, నిలిపివేయబడిన, చెల్లుబాటు కోల్పోయిన వారు ప్రాథమిక ఆధార్ కేంద్రాలను లేదా 1947 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.

News February 10, 2026

నెల్లూరులో గీత దాటితే ఫైన్.. జాగ్రత్త!

image

నెల్లూరులో నూతన సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. DKW కళాశాల, KVR పెట్రోల్ జంక్షన్, VRC, కనకమహల్, రామలింగాపురం సహా ఏడు ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ పెట్టారు. వీటి పనితీరును కార్పొరేషన్ కమిషనర్ వై.ఓ నందన్ పరిశీలించారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే సిగ్నల్ వద్ద ఉన్న కెమెరాల్లో రికార్డు అవుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆ వాహనానికి ఫైన్ వేస్తారు. ఇదంతా మీకు తెలియకుండా జరుగుతుంది.

News February 10, 2026

ఆత్మకూరు: పెళ్లి చేసుకొని బంగారంతో మహిళ పరార్!

image

ఓ మహిళ పెళ్లి చేసుకొని నగలతో పరారైన ఘటన ఇది. బాధితుడి వివరాల మేరకు.. ఆత్మకూరుకు చెందిన మహాలక్ష్మి వివాహమైంది. అతనికి విడాకులు ఇవ్వకుండానే శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన సుబ్బారావును రెండో పెళ్లి చేసుకుంది. ఆయన వద్ద ఉన్న 30 తులాల బంగారం, పత్రాలు తీసుకుని పరారైంది. ఆత్మకూరులో ఆరా తీయగా ఆమె నిత్యం పెళ్లిళ్లతో ఇలా పలువురిని మోసగిస్తున్నట్లు తెలిసిందన్నారు.

News February 10, 2026

నెల్లూరులో ఎవరి దారి వారిదే..!

image

TDP లో సమిష్టి నాయకత్వం మసక బారుతోంది. ఇటీవల ఓ సీనియర్ నేత విషయంలో ఇదే నిజమవుతుందని తెలుస్తోంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి MLA సోమిరెడ్డిని పదే పదే టార్గెట్ చేస్తూ తిట్ల పురాణం చేస్తున్నా తోటి TDP నేతలకు అది పట్టడం లేదు. సోమిరెడ్డికి సపోర్ట్ చేసేందుకు, కాకాణిపై ఎదురుదాడికి ఎవరూ మొగ్గు చూపడం లేదు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అని పలువురు చర్చించుకుంటున్నారు.

News February 10, 2026

నెల్లూరు: ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీగా చదువు..!

image

విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వీటికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతిలో ప్రవేశాలకు తల్లిదండ్రులు ఈనెల 20వ తేదీ నుంచి మార్చి 10వ తేదీలోగా గ్రామ సచివాలయం, MRCలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News February 10, 2026

ఆ వాట్సాప్ గ్రూపుల్లో చేరవద్దు: నెల్లూరు SP

image

వాట్సాప్ మెసేజ్‌లు నమ్మి పెట్టుబడులు పెట్టరాదని నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్. అజితా వెజెండ్ల ఓ ప్రకటనలో హెచ్చరించారు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తెలియని వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ కావద్దన్నారు. ఈజీ మనీ ఆశతో ఎలాంటి లింకులను ఓపెన్ చేయొద్దని సూచించారు. వాట్సాప్‌లో వచ్చే APK ఫైల్ డౌన్లోడ్ చేయవద్దని కోరారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలన్నారు.

News February 9, 2026

నెల్లూరులో ఎవరి దారి వారిదే..!

image

TDP లో సమిష్టి న్యాయకత్వం మసక బారుతోంది. ఇటీవల ఓ సీనియర్ నేత విషయంలో ఇదే నిజమవుతుందని తెలుస్తోంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి MLA సోమిరెడ్డిని పదే పదే టార్గెట్ చేస్తూ తిట్ల పురాణం చేస్తున్నా తోటి TDP నేతలకు అది పట్టడం లేదు. సోమిరెడ్డికి సపోర్ట్ చేసేందుకు, కాకాణిపై ఎదురుదాడికి ఎవరూ మొగ్గు చూపడం లేదు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అని పలువురు చర్చించుకుంటున్నారు.

News February 9, 2026

175 నియోజకవర్గాల ర్యాంకింగ్.. కావలి లాస్ట్.!

image

ఏపీలో వివిధ అంశాల్లో 175 నియోజకవర్గాల్లో వివిధ ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించింది. A+ గ్రేడ్లో 21, A గ్రేడ్లో 153, B గ్రేడ్లో ఒక నియోజకవర్గం ఉన్నాయి. అలాగే, 90 % కంటే ఎక్కువ మార్కులు సాధించి A+ ప్లస్ గ్రేడ్ దక్కించుకున్నవి 21 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కావలి(78) చివరి నుంచి మూడోస్థానం, కందుకూరు(78) మార్కులతో రాష్ట్రంలో చివరి నుంచి నాలుగో స్థానానికి పడిపోయాయి.

News February 9, 2026

వెట్టి చాకిరి నిర్మూలన పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్, ఎస్పీ

image

వెట్టి చాకిరి నిర్మూలన చట్టానికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా అజిత వేజెండ్ల ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. వెట్టి చాకిరి వంటి అమానుషమైన ఆచారాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు రూపొందించిన వెట్టి చాకిరి నిర్మూలన చట్టము- 1976 అమల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 09 తేదీని వెట్టి చాకిరి నిర్మూలన దినంగా పాటించబడిందన్నారు.

News February 9, 2026

నెల్లూరు: CIపై ఆరోపణలు.. కానిస్టేబుల్ సస్పెండ్

image

తనను ఉదయగిరి సీఐ N.వెంకట్రావు <<19088594>>వేధిస్తున్నారని <<>>సీతారామపురం మహిళా కానిస్టేబుల్ జ్యోతి ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమెకు నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆమెను సస్పెండ్ చేశారు. ‘ఉన్నతాధికారి పర్మిషన్ లేకుండా ప్రెస్‌మీట్ నిర్వహించడం రూల్స్‌కు విరుద్ధం. సీఐపై నిరాధార ఆరోపణలు చేశారు. క్రమశిక్షణ చర్యల కింద ఆమెను సస్పెండ్ చేశాం’ అని SP పేర్కొన్నారు.