India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉదయగిరి మండలం గండిపాలెం జడ్పీ స్కూల్లో తెలుగు టీచర్ కేసీ మాలకొండయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 10వ తరగతి విద్యార్థి కంచర్ల వెంకట కిరణ్ సిద్ధార్థ్ వెంటనే గమనించి టీచర్‌కు CPR చేయడంతో ప్రాణాలు నిలిచాయి. తర్వాత ఆయనను నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. సకాలంలో స్పందించి టీచర్ ప్రాణాలు నిలిపిన విద్యార్థికి పలువురు అభినందనలు తెలిపారు.

నెల్లూరు జిల్లాలో వరి కోతకు వస్తోంది. చాలా చోట్ల వడ్ల గింజలను పిట్టలను తినేస్తున్నాయి. రైతులకు నష్టం జరుగుతోంది. ఈక్రమంలో సంగం మండలం అనసూయ నగర్‌కు చెందిన ఓ రైతు వినూత్నంగా ఆలోచించారు. ఛార్జింగ్‌తో పనిచేసే మైక్ సెట్ పొలాల్లో ఏర్పాటు చేశారు. అందులో నుంచి శబ్దాలు రావడంతో పక్షులు అటు వైపు రావడం లేదు. ఓసారి ఛార్జింగ్ పెట్టి పొలాల్లో పెడితే సాయంత్రం వరకు పనిచేస్తోంది.

CM చంద్రబాబుపై YCP నేత అంబటి రాంబాబు చేసిన ఘాటు విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీనిపై స్పందించేందుకు నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎంపీలు వేమిరెడ్డి, బీదలు, మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి కనీసం స్పందించక పోవడం గమనార్హం. కనీసం ప్రెస్‌మీట్‌లలోనూ అంబటి వ్యాఖ్యలపై స్పందించ లేదనేది తెలుస్తోంది. నెల్లూరులో రాజకీయాలు ఎప్పుడు..? ఎలా..? రూటు మారుతాయో తెలియడం లేదు.

గంజాయి పేరు వింటేనే నెల్లూరు జిల్లా ఉలిక్కిపడుతుంది. ఇందుకు నెల్లూరు కల్లూరు పల్లిలో ఉద్యమకారుడి దారుణ హత్య, కోవూరులో మైనర్ బాలికపై హత్యాయత్నం వంటి ఘటనలే ఉదాహరణ. జిల్లాలో ఏదో ఒకచోట నిత్యం గంజాయి పట్టుబడుతూనే ఉంది. రోడ్లపై కత్తులతో హల్‌చల్ వంటి ఘటనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పోలీసులు నామమాత్రంగా తనిఖీలు చేపడుతున్నారని విమర్శలు ఉన్నాయి. వీటి మూలాలను పూర్తిగా నాశనం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజును చెల్లించేందుకు ఈ నెల 12 వరకు గడువుందని డీఈఓ బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. తత్కాల్ ఫీజు కింద రూ.వెయ్యి అపరాధ రుసుమును చెల్లించాలని కోరారు. అదే తేదీలోపు అన్ని డాక్యుమెంట్లతో నామినల్ రోల్స్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. వివరాలకు bse.ap.gov.in లేదా దర్గామిట్ట జడ్పీ స్కూల్లో గల జిల్లా పరీక్షల విభాగాన్ని సంప్రదించాలని కోరారు.

తండ్రి స్థానంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ అన్న తన తమ్ముడి భార్య పైనే కన్నేశాడు. ప్రశ్నించిన తమ్ముడిని చితకబాదాడు. చివరకు తల్లి ఫిర్యాదుతో జైలు పాలయ్యాడు. నెల్లూరు రూరల్ సీఐ గుంజి వేణు వివరాల మేరకు.. పెనుబర్తి ఎస్టీ కాలనీలో నివాసముండే శ్రీనివాసులు తన తమ్ముడి భార్యపై మోజులోపడి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. దీంతో శ్రీనివాసులును గురువారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

మనుబోలు మండలం కుడితిపల్లి పొలాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం ఓఎన్జీసీ గురువారం రీ సర్వే చేసింది. ఆ సంస్థ పీఆర్వో సుధీర్ మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి శాటిలైట్ ద్వారా వచ్చిన 2డీ ఫొటోల ఆధారంగా ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మైపాడు నుంచి చెన్నూరు వరకు సర్వే చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి విడత సర్వే పూర్తి చేశామన్నారు.

నెల్లూరు జిల్లాలో 39,590 ఎకరాల్లో ఆక్వా సాగు ఉంది. నేలల సాంద్రత, నీటి PH విలువను బట్టి రొయ్యల సాగు చేయాల్సి ఉంటుంది. చెరువు వద్ద నమూనాలు సేకరించి కావలి, నెల్లూరులోని ల్యాబ్లలో రూ.100లకే అధికారులు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈనెలలో 840 శాంపిల్స్ సేకరించాల్సి ఉండగా ఆ ఊసే లేదు. రైతులు రూ.వేలు ఖర్చు చేసి ప్రైవేట్ లాబ్స్‌లో టెస్టులు చేయించుకుంటున్నారు. అధికారుల వద్ద ఒకే ఒక మొబైల్ కిట్ ఉండడం కొసమెరుపు.

Sorry, no posts matched your criteria.