Nellore

News February 6, 2026

నెల్లూరు: 39వేల ఎకరాలకు ఒక్కటే కిట్..!

image

నెల్లూరు జిల్లాలో 39,590 ఎకరాల్లో ఆక్వా సాగు ఉంది. నేలల సాంద్రత, నీటి PH విలువను బట్టి రొయ్యల సాగు చేయాల్సి ఉంటుంది. చెరువు వద్ద నమూనాలు సేకరించి కావలి, నెల్లూరులోని ల్యాబ్లలో రూ.100లకే అధికారులు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈనెలలో 840 శాంపిల్స్ సేకరించాల్సి ఉండగా ఆ ఊసే లేదు. రైతులు రూ.వేలు ఖర్చు చేసి ప్రైవేట్ లాబ్స్‌లో టెస్టులు చేయించుకుంటున్నారు. అధికారుల వద్ద ఒకే ఒక మొబైల్ కిట్ ఉండడం కొసమెరుపు.

News February 5, 2026

నెల్లూరులో పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఖాళీలు ఇవే

image

నెల్లూరు డివిజన్ పరిధిలోని అల్లీపురం, అనంతసాగరం, ఇందుకూరుపేట, కలిగిరితో పాటు 50 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గూడూరు డివిజన్ పరిధిలోని సర్వేపల్లి, మేనకూరు, విందూరు తదితర గ్రామాల్లో 31 పోస్టులను భర్తీ చేస్తారు. రూ.12వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 5, 2026

సమన్వయంతో పనిచేయండి: నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో GST ఆదాయాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో కమర్షియల్ టాక్స్ శాఖతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో TDS నిబంధనలు పాటించాలన్నారు.

News February 5, 2026

నెల్లూరు రొయ్యలకు గిరాకీ..!

image

నెల్లూరు జిల్లాలో 40వేల ఎకరాల్లో ఆక్వా సాగు ఉంది. సోమశిల, కండలేరుతో పాటు 276 చెరువుల్లో కలిపి ఏటా 5లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అవుతోంది. 2021-22లో 4.67లక్షలు, 2022-23లో 3.44లక్షలు, 2023-24లో 3.29లక్షలు, 2024-25లో 3.63లక్షలు, 2025-26లో 3.39లక్షల టన్నుల ఉత్పత్తి జరగ్గా.. 60శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. ఈయూ దేశాలతో ఇండియా ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకోవడంతో మన రొయ్యలకు అక్కడ డిమాండ్ పెరగనుంది.

News February 5, 2026

మహాశివరాత్రి ఆఫర్ పేరిట మోసాలు

image

మహాశివరాత్రి ఆఫర్ ఇప్పుడు లైవ్‌లో ఉందని, మొదట నమ్మకం లేకపోయినా కాస్ట్ రివార్డు లభించిందని పేర్కొంటూ స్కామర్లు వాట్సాప్ గ్రూపుల్లో లింకులు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. ప్రజలు ఇలాంటి ఆఫర్లను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News February 5, 2026

నెల్లూరు: భైరవరంలో 3 నెలల పసికందు మృతి

image

దుత్తలూరు (M) భైరవరం SC కాలనీలో 3 నెలల పసికందు మృతి చెందారు. విషయం తెలుసుకున్న PHC వైద్యులు ఆయూబ్ అప్సర్ సిబ్బందితో కలిసి వారి నివాసానికి వెళ్లి పరిశీలించారు. బుధవారం ఉదయం అంగన్వాడీ కేంద్రంలో ఆ పసికందుకు వ్యాక్సిన్ వేశారని, రాత్రి 10 గంటల తర్వాత మృతి చెందినట్లు తెలిపారు. వ్యాక్సిన్ వేయడం వల్ల మృతి చెందలేదని అన్నారు. కాగా వ్యాక్సిన్ వల్లే పసికందు చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

News February 5, 2026

హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కాకాణి

image

తిరుమల లడ్డూ వ్యవహారంతో పాటు సీఎం చంద్రబాబు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై రెండు కేసు నమోదు అయ్యాయి. ఈ రెండు కేసులను కొట్టేయాలంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, ఆ రెండింటినీ కొట్టేయాలని ఆయన పిటిషన్ వేశారు.

News February 5, 2026

నెల్లూరు: ప్లాట్లు కొన్నారా.. జాగ్రత్త!

image

NMC పరిధిలో 540 అక్రమ లే అవుట్లలో 5500 ప్లాట్స్‌కు 3500 LRSకు రాగా 2 వేలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. బుచ్చిలో 36 లే అవుట్లలో 30 అక్రమం కాగా, 6 మాత్రమే అనుమతి పొంది ఉన్నాయి. వీటిల్లో 800 ప్లాట్లకు నోటీసులు జారీ కాగా, 80 మాత్రమే LRS కు వచ్చాయి. గూడూరులో 70 వరకు అక్రమ లే అవుట్లు ఉండగా.. కావలిలో అక్రమ లే అవుట్లకు LRS లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. వీటిని కొనుగోలు చేసిన వారు లబోదిబోమంటున్నారు.

News February 5, 2026

నెల్లూరు: రైతులే స్వయంగా.. యాప్‌లో పంట నమోదు

image

APAIMS 2.0 యాప్‌ని ప్రభుత్వం తీసుకోచ్చింది. దీని ద్వారా రైతులే స్వయంగా తమ పంట వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ యాప్‌ను మొబైల్‌లోని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆధార్ నెంబర్‌తో రిజిస్టర్ అయి MPINను లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. రైతు తమ పొలం వద్దకు వెళ్లి ఫోటో దిగి నమోదు చేసుకోవచ్చని ఆశాఖ కోవూరు AD అనిత Way2Newsకి తెలిపారు. విడవలూరులో రైతుల ద్వారా ఈ ప్రయత్నాన్ని ఆత్మ PD శారద, AO లక్ష్మి చేపట్టారు.

News February 5, 2026

నెల్లూరు: ఆన్‌లైన్‌లో మహిళ పరిచయం.. రూ.30 లక్షలు స్వాహా!

image

నెల్లూరు వెంకటరెడ్డి నగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్, టెలిగ్రామ్‌లో శివాని అనే మహిళ పరిచయం ఏర్పడింది. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించడంతో ఆ ఉద్యోగి మహిళ సూచించిన బ్యాంక్ ఖాతాలకు రూ.29.8 లక్షలు నగదు జమచేశాడు. తన అవసరం నిమిత్తం పెట్టుబడులు ఉపసంహారించుకునేందుకు ప్రయత్నించగా నగదు రాలేదు. దీంతో బాధితుడు వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.