Nellore

News February 9, 2026

CM సమీక్షకు నెల్లూరు కలెక్టర్ హాజరు

image

అమరావతి సచివాలయం నుంచి మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా.అజితా వెజండ్ల, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. GDP వృద్ధిరేటు, RTGS, ప్రాజెక్టుల పురోగతి.. సంక్షేమ కార్యక్రమాల అమలు, స్వర్ణాంధ్ర విజన్‌ 2047, లా అండ్‌ ఆర్డర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.

News February 8, 2026

నెల్లూరు: శివరాత్రికి భక్తుల సందడి ఎక్కడంటే..?

image

మహాశివరాత్రి వచ్చిందంటే జిల్లాలోని శివభక్తులు పుణ్యక్షేత్రాల వైపు అడుగులు వేస్తారు. ముఖ్యంగా కృష్ణపట్నం సిద్ధేశ్వర స్వామి, సముద్ర తీరాన వెలసిన కాటేపల్లి శివాలయాలకు భక్తులు భారీగా తరలివెళ్తారు. ప్రకృతి ప్రేమికులు వెంకటాచలం అడవిలోని శివాలయంలో ఏకాంతంగా స్వామిని దర్శించుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇక మైపాడు తీరాన సముద్ర స్నానాలు ఆచరించి శివయ్యను దర్శించుకోవడం ఇక్కడి భక్తుల ఆనవాయితీ.

News February 8, 2026

నెల్లూరు: మురుగుతున్న MP LADS

image

నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న ఎంపీలైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావులకు భారత ప్రభుత్వం MP LADS ను కేటాయిస్తుంది. వేమిరెడ్డికి రూ. 9.80 కోట్లను కేటాయించగా.. రూ. 5.06 కోట్ల నిధులు మిగిలి ఉన్నాయని సమాచారం. బీద మస్తాన్ రావుకు రూ.12.22 కోట్లు ఇవ్వగా రూ.3.37 కోట్లకు పనులు చేపట్టారు. కనీసం కొన్ని పనులు కూడా మొదలెట్టలేదంటే ఎలా ఖర్చు చేస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

News February 7, 2026

నెల్లూరు: రైలు ఢీకొని మహిళ స్పాట్ డెడ్

image

మనుబోలు రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు ఫ్లాట్ ఫామ్ చివరన చెన్నై నుంచి విజయవాడ వెళ్లే లైన్‌లో గుర్తుతెలియని మహిళ పట్టాలు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని శనివారం సాయంత్రం మృతి చెందింది. వయస్సు సుమారు 50-55 ఏళ్లు ఉండొచ్చని, 5.0అడుగుల ఎత్తు కలిగి చాయా రంగు కలిగి ఉందని రైల్వే ఎస్సై హరి చందన తెలిపారు. మృతురాలు సిమెంట్ రంగుపై బులుగు రంగు సిల్క్ చీర, ఆకుపచ్చ పావడాను ధరించి ఉందని అన్నారు.

News February 7, 2026

సోమిరెడ్డికి కాకాణి సవాల్

image

నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మారిందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రైతులను అడ్డం పెట్టుకుని పనులు చేయకుండానే కోట్ల రూపాయల బిల్లులు దోచుకున్నారన్నారు. ఈ అక్రమాలపై సీఎంకు లేఖ రాసినా స్పందన లేదని మండిపడ్డారు. అవినీతి ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులు చేస్తున్నారని, విజిలెన్స్ విచారణకు సిద్ధమా అని సోమిరెడ్డికి సవాల్ విసిరారు.

News February 7, 2026

నెల్లూరు: అయినోళ్లే ప్రాణాలు తీస్తున్నారు..!

image

నెల్లూరు జిల్లాలో చాలామందికి చట్టం అంటే భయం లేకుండా పోయింది. కావలిలో ఆస్తి కోసం సొంత వారే రైల్వే ఉద్యోగి <<19066737>>నాగరాజును <<>>హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. నవాబుపేటలో మహిళ <<19072747>>హత్య<<>>, సైదాపురంలో అన్నదమ్ముల మధ్య రక్తపాతం జిల్లాను ఉలిక్కిపడేలా చేశాయి. పోలీసులు రాత్రి వేళ గస్తీ, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినా.. వరుస హత్యలు ఆగడం లేదు. నేరస్థులపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News February 7, 2026

నెల్లూరు: ఆ ఊరిలో అలా చేస్తే రూ.10వేల ఫైన్

image

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం యాచవరం గ్రామస్థుల నిర్ణయం వైరల్ అవుతోంది. గ్రామంలో అన్యమత ప్రచారం చేస్తే రూ.10వేల జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. ‘గ్రామంలో ఉండేది అంతా హిందువులే. గ్రామంలో అన్య మత ప్రచారం చట్ట విరుద్ధం. ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు. ఎవరైనా మతం మీద అభిమానం ఉంటే బయటకు వెళ్లి చేసుకోండి’ అంటూ ఓ బోర్డు ఏర్పాటు చేశారు.

News February 7, 2026

నెల్లూరు జిల్లాలో విషాదం

image

కోవూరులో ఇటీవల అపహరణకు గురైన బాలిక చెన్నైలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అంగడికి వెళ్తున్న బాలికను ఇద్దరు మైనర్లు బైకుపై ఎక్కించుకుని మామిడి తోటలోకి తీసుకెళ్లారు. గుర్తు తెలియని ద్రవం తాగించడంతో బాలిక కోమాలోకి వెళ్లింది. అక్కడి నుంచి ఆ ఇద్దరు యువకులు పారిపోయారు. బాలికను తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయింది. మైనర్లను జువెనైల్ హోంకు తరలించారు.

News February 7, 2026

నెల్లూరు జిల్లాలో విషాదం

image

కోవూరులో ఇటీవల అపహరణకు గురైన బాలిక చెన్నైలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అంగడికి వెళ్తున్న బాలికను ఇద్దరు మైనర్లు బైకుపై ఎక్కించుకుని మామిడి తోటలోకి తీసుకెళ్లారు. గుర్తు తెలియని ద్రవం తాగించడంతో బాలిక కోమాలోకి వెళ్లిపోంది. అక్కడి నుంచి ఆ ఇద్దరు యువకులు పారిపోయారు. బాలికను తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయింది. మైనర్లను జువెలైన్ హోంకు తరలించారు.

News February 6, 2026

నెల్లూరు జిల్లాలో రైతులకు లోన్లు రావడం లేదు..!

image

నెల్లూరు జిల్లాలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూములను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ప్రస్తుత ప్రభుత్వంలో మళ్లీ వాటిని చుక్కల భూములుగా చూపారని పలువురు రైతులు వాపోతున్నారు. పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్లిన రైతులను అధికారులు 1బి అడంగల్ తీసుకు రావాలని కోరుతున్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చుక్కల భూములకు 1బి అడంగల్ ఇవ్వడం లేదు. దీంతో రైతులకు రుణాలు అందక అవస్థలు పడుతున్నారు.