Andhra Pradesh

News March 17, 2024

అనుమతి లేని రాజకీయ ప్రకటనలను వెంటనే తొలగించండి: కలెక్టర్

image

ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న పోస్టర్లు, కటౌట్లను తక్షణమే తొలగించాలని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో సమీక్ష అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్ఠంగా అమలుపరచాలని కలెక్టర్ ఆదేశించారు.

News March 17, 2024

సభపై ప్రధాని మోదీ, చంద్రబాబు నవ్వులు

image

చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పక్కపక్కనే కూర్చున్నారు. తొలుత పవన్ కళ్యాణ్ ప్రసంగించగా.. ఆ సమయంలో మోదీ, చంద్రబాబు ముచ్చటించారు. వారిరువురి మధ్య నవ్వులు విరియడంతో సభకు వచ్చిన వారిలో జోష్ కనిపించింది.

News March 17, 2024

పల్నాడు: ‘144 సెక్షన్ అమల్లో ఉంటుంది’

image

పదో తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు DEO వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. సమీపంలో జిరాక్స్ సెంటర్లు నిర్వహించకూడనని అన్నారు. జిల్లాలో ఈ పరీక్షలకు 29,243మంది విద్యార్థులు హాజరుకానున్నారని, 127 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9 గంటలకల్లా విద్యార్థులు చేరుకోవాలన్నారు.

News March 17, 2024

వైసీపీ రాష్ట్ర ఎస్టీ విభాగ ప్రధాన కార్యదర్శిగా: మానుపాటి నవీన్

image

వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం జగన్ ఆదేశాల మేరకు వైసీపీ రాష్ట్ర ఎస్టీ విభాగ ప్రధానకార్యదర్శిగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మానుపాటి నవీన్‌ను నియమిస్తూ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. నవీన్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గిరిజన సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన జగన్‌కు కృత్ఞలు తెలిపారు.

News March 17, 2024

శ్రీకాకుళం:గ్రూప్ -1 పరీక్షలను పరిశీలించిన కలెక్టర్

image

ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న గ్రూప్-1 పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జీలాని సమూన్ స్థానిక శ్రీ చైతన్య స్కూల్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు.

News March 17, 2024

ఎలక్షన్ అప్డేట్స్: కడప జిల్లాలో అప్పుడు ఇప్పుడు వాళ్లే

image

2024 ఎన్నికల నగారా మోగింది. అటు కూటమి, ఇటు YCP అభ్యర్థుల ప్రకటలను చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ఈ సారి రాష్ట్రంలో చాలా మార్పులు చేశారు. కానీ.. వైఎస్‌ఆర్ జిల్లాలోనే ఎటువంటి మార్పులు లేవు. 2019 ఎన్నికల్లో నిలబడ్డ వారే ఇప్పుడు కూడా నిలబడుతున్నారు. TDP ఇప్పటి వరకు ప్రకటించిన వారిలో మాధవిరెడ్డి, బీటెక్ రవి, పుత్తా చైతన్య రెడ్డి కొత్తగా బరిలో నిలబడుతున్నారు. వీరిలో ఎంతమంది విజయం సాధిస్తారో చూడాలి.

News March 17, 2024

NLR: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

నెల్లూరు జిల్లా సంగం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీరాపేరు సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగార్జున రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2024

మచిలీపట్నం: బ్యానర్‌పై పేర్ని నాని.. స్టేజిపై కొల్లు రవి

image

కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం, యువజన విభాగం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం మచిలీపట్నంలో నిర్వహించారు. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని ఫోటో బ్యానర్‌పై కనిపించగా అదే వేదికపై పేర్ని నాని రాజకీయ ప్రత్యర్థి కొల్లు రవీంద్ర పాల్గొని ప్రసంగించారు. బ్యానర్‌లో ఒకరు, వేదికపై ఒకరిని చూసిన అక్కడున్న వారు పొలిటికల్ కామెంట్స్ చేసుకున్నారు.

News March 17, 2024

VZM: బాక్సింగ్‌లో బంగారు పథకం సాధించిన సచిన్

image

విశాఖపట్నంలో జరిగిన మూడవ రాష్ట్ర సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో విజయనగరం క్రీడాకారుడు బి. సచిన్‌ బంగారు పతాకం సాధించాడు. మార్చి 18 నుంచి 25 వరకు ఉత్తర ప్రదేశ్‌లో జరగబోయే జాతీయస్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరుఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ మేరకు ఆదివారం అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డోల మన్మథకుమార్ ఆయనకు అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాక్షించారు.

News March 17, 2024

తూ.గో: ఎలక్షన్@2024.. 4 చోట్ల సిట్టింగులకు నో ఛాన్స్!

image

వైసీపీ MLA అభ్యర్థుల జాబితాలో ఉమ్మడి తూ.గో జిల్లాలో నలుగురు సిట్టింగులకు టికెట్ దక్కలేదు.
☞ జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబుకు ప్రత్యామ్నాయంగా తోట నరసింహం,
☞ పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు కాకుండా వంగా గీత,
☞ ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్‌కు ప్రత్యామ్నాయంగా వరుపుల సుబ్బారావు,
☞ పి.గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబును పక్కనబెట్టి విప్పర్తికి టికెట్లు ఇచ్చారు.