Andhra Pradesh

News March 17, 2024

తిరుపతి: పరీక్షా ఫలితాల విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది డిసెంబర్‌లో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ(MBA) 6వ సెమిస్టర్, 2, 4 సప్లమెంటరీ పరీక్షలు జరిగాయి. నవంబర్‌లో బీఫార్మసీ 4, 6 సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News March 17, 2024

రాజోలులో మరోసారి జనసేన జెండా ఎగరేసేనా..?

image

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఇది రాష్ట్రంలో 2వ అత్యల్ప మెజారిటీ. కొద్ది రోజులకే రాపాక YCPలో చేరగా.. తాజాగా MP సీటు దక్కించుకున్నారు. దీంతో రాజోలులో జనసేన నుంచి దేవా వరప్రసాద్‌ MLA బరిలో ఉన్నారు. YCP నుంచి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు బరిలో ఉన్నారు. మరి జనసేన మరోసారి జెండా ఎగరేసేనా..?

News March 17, 2024

బాపట్ల: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

image

యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల మండల పరిధిలోని కొత్తపాలెంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 17, 2024

సువిధ యాప్ ద్వారా అనుమతులు: సీపీ

image

విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఆరు చెక్ పోస్ట్‌ల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆదేశించారు. రాజకీయ సభలు, సమావేశాలకు సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 478 పోలింగ్ కేంద్రాలను స్వల్ప సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ప్రతి నియోజకవర్గానికి రెండు స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News March 17, 2024

విజయనగరం: ఏడు చోట్ల ప్రత్యర్థులు ఫిక్స్..!

image

విజయనగరం: అదితి గజపతిరాజు(TDP), కోలగట్ల వీరభద్రస్వామి (YCP)
నెల్లిమర్ల: లోకం మాధవి(జనసేన), బడ్డుకొండ అప్పలనాయుడు(YCP)
గజపతినగరం: కొండపల్లి శ్రీనివాస్(TDP), బొత్స అప్పలనరసయ్య(YCP)
బొబ్బిలి: బేబి నాయన(TDP), శంబంగి చిన అప్పలనాయుడు(YCP)
పార్వతీపురం: బోనెల విజయచంద్ర(TDP), అలజంగి జోగారావు(YCP)
సాలూరు: గుమ్మడి సంధ్యారాణి(TDP), పీడిక రాజన్నదొర(YCP)
కురుపాం: తోయక జగదీశ్వరి(TDP), పాముల పుష్ప శ్రీవాణి(YCP)

News March 17, 2024

ANU: డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సులకు నిర్వహించిన మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను శనివారం ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్ విడుదల చేశారు. ఫలితాలను విశ్వ విద్యాలయ వెబ్ సైట్ నుంచి పొందవచ్చని తెలియజేశారు. మొత్తం 9679 మంది పరీక్షలు రాయగా 6494 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. సందేహాలుంటే రీవాల్యుయేషన్‌కు ఈనెల 30వ తేదీలోగా ఒక్కో పేపర్‌కు రూ. 1240లను చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.

News March 17, 2024

ప్రకాశం: పోటీకి సిద్ధం.. గెలుపెవరది?

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల ఖరారుతో ఎన్నికల సమరానికి పార్టీలు సిద్ధమయ్యాయి. టీడీపీ 10 స్థానాలను ఇప్పటికే ప్రకటించగా, వైసీపీ శనివారం అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా పూర్తి స్పష్టత వచ్చింది. ఇక ఎన్నికల ప్రచారమే తరువాయి. చీరాల, దర్శి స్థానాలను టీడీపీ ఇంకా ప్రకటించనప్పటికీ అక్కడ పొత్తులోభాగంగా ఎవరికి సీట్లు వస్తాయో చూడాలి. ఏది ఏమైనా జిల్లాలో పూర్తి స్పష్టతతో పార్టీలు దూసుకుపోతున్నాయి.

News March 17, 2024

మాజీ ఎమ్మెల్యే ముద్ర బోయిన ప్రయాణం ఎటు?

image

ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ముద్ర బోయిన వెంకటేశ్వరరావు ప్రయాణమెటని నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. రాజ్యసభ సభ్యులు వై. వి. సుబ్బారెడ్డిని కలిసిన ముద్రబోయిన, నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సీటు వస్తుందని నియోజకవర్గంలోని ముద్ర బోయిన ఆత్మీయులు భావించారు. కానీ శనివారం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పారావు పేరును ప్రకటించారు.

News March 17, 2024

కర్నూలు జిల్లా YCPలోనే అత్యధిక మార్పులు

image

కర్నూలు జిల్లా YCPలో భారీగా MLA, MP అభ్యర్థుల మార్పులు చోటు చేసుకున్నాయి. నంద్యాల జిల్లాలో నందికొట్కూరు MLA అభ్యర్థిని మాత్రమే CM జగన్ మార్చారు. కాగా కర్నూలు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు గాను నలుగురు MLA, MP అభ్యర్థిని మార్చడం చర్చనీయాంశంగా మారింది. MP అభ్యర్థి బీవై రామయ్యతో పాటు, ఇంతియాజ్, బుట్టా రేణుక, డా.సతీష్, విరూపాక్షి MLA అభ్యర్థిత్వానికి కొత్తవారు కావడం గమనార్హం.

News March 17, 2024

హిందూపురం ఎంపీ అభ్యర్థి బయోడేటా

image

హిందూపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా జోలదరాశి శాంతను ప్రకటించింది. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఆమె ఇంటర్ మీడియట్ వరకు చదువుకుంది. 2009 నుంచి 2014 వరకు బీజేపీ తరపున బళ్లారి పార్లమెంట్ సభ్యురాలిగా పని చేశారు. ఆమె సోదరుడు శ్రీరాములుకు కూడా గతంలో కర్ణాటక మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. రాజకీయ సమీకరణాలలో వైసీపీ ఆమెకు టికెట్ కేటాయించింది.