India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. ఒడిశా సరిహద్దు వెంబడి దాదాపు 112 కి.మీ మేర శ్రీకాకుళం జిల్లా ఉందని, ఇరు రాష్ట్రాల మధ్య జిల్లా వెంబడి 52 రహదారుల ద్వారా రాకపోకలు జరుగుతున్నాయని వీటిలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇవి కాకుండా నిరంతరం పెట్రోలింగ్ బృందాలు తిరుగుతున్నాయని అన్నారు.
వైసీపీ పుంగనూరు MLA అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఖరారు చేశారు. 1989, 99, 2004లో పీలేరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 14, 19లో పుంగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్, జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1978లో జనతా పార్టీ, 1985, 1994లో కాంగ్రెస్ పార్టీ నుంచి పీలేరులో పోటీ చేయగా ఓడిపోయారు. తాజాగా పదోసారి ఆయన ఎన్నికల బరిలో నిలవనున్నారు.
అన్ని ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం అనకాపల్లి సీటును మాత్రం పెండింగ్‌లో ఉంచింది. బీసీకి కేటాయించినట్లు చెప్పారు కానీ..అభ్యర్థి పేరు మాత్రం చెప్పలేదు. దీంతో ఎంపీ అభ్యర్థి పేరు ఎవరనేదానిపై సస్పెన్స్ నెలకొంది.
ముత్తుకూరు మండలం తాళ్లపూడికి చెందిన వేణుంబాక విజయసాయి రెడ్డి వైసీపీలో కీలక నేత. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడిన తర్వాత అనూహ్య పరిణామాల మధ్య నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన విజయసాయి రెడ్డి అభ్యర్థిత్వాన్ని వైసీపీ అధిష్ఠానం ఫైనల్ చేసింది. ఆయన ప్రత్యర్థిగా వేమిరెడ్డి ఉన్నారు.
అరకు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెట్టి తనూజారాణికి టిక్కెట్ కేటాయిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తనూజారాణికి అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కుమారుడు వినయ్‌తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. తనూజారాణి తండ్రి శ్యాం సుందర్ హుకుంపేట మండలం అడ్డుమండ సర్పంచ్. తనూజారాణికి ఎంపీ కేటాయింపుతో మూడు సామాజిక వర్గాలకు న్యాయం చేకూరిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ బెల్లాన చంద్రశేఖర్‌కే అవకాశం దక్కింది. బీఎల్ చదివిన ఆయన జెడ్పీటీసీగా, జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేసి అశోక్ గజపతి రాజుపై విజయం సాధించారు. డిగ్రీ చదివిన రోజుల్లో విద్యార్థి సంఘ నాయకుడిగా కూడా పనిచేశారు. ఆయన భార్య శ్రీదేవి చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా 10 ఏళ్లు పనిచేశారు.
నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ మొదటి సారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఆయనను నెల్లూరు సిటీ అభ్యర్థిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నెల్లూరు నగరంలోని అతి సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఖలీల్ అహ్మద్ అనూహ్య పరిణామాల మధ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇప్పటికే నెల్లూరులో ఖలీల్ అహ్మద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సిట్టింగ్ ఎంపీలకే వైసీపీ మరో అవకాశం ఇచ్చింది. తిరుపతి నుంచి గురుమూర్తి, చిత్తూరు నుంచి రెడ్డప్ప, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రెడ్డప్ప 2019లో, గురుమూర్తి ఉపఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఎంపీలుగా ఎన్నికయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి 2014, 19లో రాజంపేట MPగా ఎన్నికయ్యారు. ఆయన మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
రామభద్రపురం గ్రామంలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న దంపతులు రుద్రాక్షుల సత్యన్నారాయణ, అనురాధలపై కత్తితో దాడి చేసి.. అనురాధ చెయ్యిని విరిచి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంచుకెళ్ళారు. ఆ తర్వాత దంపతులు బిగ్గరగా అరవడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
ఈ నెల 18వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్ధానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో వివిధ శాఖల సిబ్బందితో పదో తరగతి పరీక్షలు నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.