India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పదో తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు DEO వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. సమీపంలో జిరాక్స్ సెంటర్లు నిర్వహించకూడనని అన్నారు. జిల్లాలో ఈ పరీక్షలకు 29,243మంది విద్యార్థులు హాజరుకానున్నారని, 127 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9 గంటలకల్లా విద్యార్థులు చేరుకోవాలన్నారు.

వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం జగన్ ఆదేశాల మేరకు వైసీపీ రాష్ట్ర ఎస్టీ విభాగ ప్రధానకార్యదర్శిగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మానుపాటి నవీన్‌ను నియమిస్తూ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. నవీన్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గిరిజన సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన జగన్‌కు కృత్ఞలు తెలిపారు.

ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న గ్రూప్-1 పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జీలాని సమూన్ స్థానిక శ్రీ చైతన్య స్కూల్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు.

2024 ఎన్నికల నగారా మోగింది. అటు కూటమి, ఇటు YCP అభ్యర్థుల ప్రకటలను చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ఈ సారి రాష్ట్రంలో చాలా మార్పులు చేశారు. కానీ.. వైఎస్‌ఆర్ జిల్లాలోనే ఎటువంటి మార్పులు లేవు. 2019 ఎన్నికల్లో నిలబడ్డ వారే ఇప్పుడు కూడా నిలబడుతున్నారు. TDP ఇప్పటి వరకు ప్రకటించిన వారిలో మాధవిరెడ్డి, బీటెక్ రవి, పుత్తా చైతన్య రెడ్డి కొత్తగా బరిలో నిలబడుతున్నారు. వీరిలో ఎంతమంది విజయం సాధిస్తారో చూడాలి.

నెల్లూరు జిల్లా సంగం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీరాపేరు సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగార్జున రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం, యువజన విభాగం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం మచిలీపట్నంలో నిర్వహించారు. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని ఫోటో బ్యానర్‌పై కనిపించగా అదే వేదికపై పేర్ని నాని రాజకీయ ప్రత్యర్థి కొల్లు రవీంద్ర పాల్గొని ప్రసంగించారు. బ్యానర్‌లో ఒకరు, వేదికపై ఒకరిని చూసిన అక్కడున్న వారు పొలిటికల్ కామెంట్స్ చేసుకున్నారు.

విశాఖపట్నంలో జరిగిన మూడవ రాష్ట్ర సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో విజయనగరం క్రీడాకారుడు బి. సచిన్ బంగారు పతాకం సాధించాడు. మార్చి 18 నుంచి 25 వరకు ఉత్తర ప్రదేశ్‌లో జరగబోయే జాతీయస్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరుఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ మేరకు ఆదివారం అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డోల మన్మథకుమార్ ఆయనకు అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాక్షించారు.

వైసీపీ MLA అభ్యర్థుల జాబితాలో ఉమ్మడి తూ.గో జిల్లాలో నలుగురు సిట్టింగులకు టికెట్ దక్కలేదు.
☞ జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబుకు ప్రత్యామ్నాయంగా తోట నరసింహం,
☞ పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు కాకుండా వంగా గీత,
☞ ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్‌కు ప్రత్యామ్నాయంగా వరుపుల సుబ్బారావు,
☞ పి.గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబును పక్కనబెట్టి విప్పర్తికి టికెట్లు ఇచ్చారు.

కర్నూలు పార్లమెంటు సీపీఐ అభ్యర్థిగా రామచంద్రయ్యను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆదివారం కర్నూలులో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అభ్యర్థిగా రామచంద్రయ్యను అధికారికంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఆస్పరి మండల కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.

మరికొద్దిసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధానమంత్రి మోదీ చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆయన చిలకలూరిపేట మండలం బొప్పూడి సభకు చేరుకుంటారు. సభా ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలోనే హెలీ ప్యాడ్ ఉంది. మోదీ సభ వద్దకు సులభతరంగా వచ్చే విధంగా ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.