India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆమదాలవలస నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో వైసీపీ నుంచి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పదో సారి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షులు కూన రవికుమార్ మూడో సారి బరిలోకి దిగారు. రవికుమార్ అక్క వాణి తమ్మినేని భార్య కావడంతో.. బావ బామ్మర్దులు ఇద్దరూ పోటీ పడుతున్నారు.

ఉమ్మడి కృష్ణాలో సిట్టింగ్ MLAలు సింహాద్రి రమేష్ (అవనిగడ్డ), వల్లభనేని వంశీ (గన్నవరం), కొడాలి నాని (గుడివాడ), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), కైలే అనిల్ (పామర్రు), మొండితోక జగన్మోహనరావు (నందిగామ), మేకా ప్రతాప్ అప్పారావు (నూజివీడు), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట)లకు వారి స్థానాల్లో పోటీ చేస్తుండగా పెడన MLA జోగి రమేశ్ పెనమలూరు, విజయవాడ పశ్చిమ MLA వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్‌లో పోటీ చేస్తున్నారు.

నంద్యాల జిల్లాలోని నందికొట్కూర్ అభ్యర్థి డా.ధారా సుధీర్(SC) మినహా మిగిలిన వారందరూ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కావడం గమనర్హం. డోన్-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, BPL-కాటసాని రామిరెడ్డి, NDL-శిల్పా రవిరెడ్డి, PNM-కాటసాని రాంభూపాల్ రెడ్డి, ALG -గంగుల బ్రిజేంద్రారెడ్డి, SRLM-శిల్పా చక్రపాణి రెడ్డి MLA అభ్యర్థులుగా వైసీపీ ప్రకటించింది. నంద్యాల MP అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి ఆ సామాజికవర్గం వారే.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 142 కేంద్రాల్లో ఈ నెల 18 నుంచి జరగనున్న 10వ తరగతి జరగనున్న పరీక్షలకు 40,063 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ గౌతమీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ మనసును ప్రశాంతంగా ఉంచుకుని పరీక్షలు బాగా రాయాలని సూచిస్తూ.. ALL.THE.BEST. అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

తూ.గో జిల్లా వ్యాప్తంగా మార్చి 18వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోందని జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల అశోక తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్లకు తమ హాల్ టిక్కెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. విద్యార్థులు గమనించాలన్నారు.

రహదారి ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో యోగానంద స్విమ్మింగ్ పూల్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వీరిద్దరూ పోతవరం గ్రామానికి చెందిన వ్యక్తులుగా స్థానికులు గుర్తించారు. పని నిమిత్తం గిద్దలూరు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

కడప జిల్లాలో ఇద్దరు సీనియర్ నాయకులపై అందరి దృష్టి ఉంది. కారణం వారు 9వ సారి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. వారే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి. ఇద్దరికీ 40 ఏళ్ల పై చిలుకు రాజకీయ అనుభవం ఉంది. వరద 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 3 సార్లు ఓడారు. రఘురామిరెడ్డి 4 సార్లు గెలిచి, 4 ఓడారు. ఇప్పడు వీరిద్దరు 9వ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరోసారి వీరు గెలిచి చరిత్ర సృష్టిస్తారా?

బొబ్బిలి ఇందిరమ్మకాలనీ సమీపంలో రైలు ఢీకొని వృద్దుడు తామాడ అప్పలస్వామి(68) మృతి చెందినట్లు రైల్వే హెచ్‌సి బి.ఈస్వరరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బాడంగి మండలం అనవరం గ్రామానికి చెందిన అప్పలస్వామి గొల్లపల్లి పెళ్లికి వెళ్లాడు. తిరిగు ప్రయాణంలో ఇందిరమ్మకాలనీ వద్ద రైల్వే పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని ట్రైన్ ఢీకొని మృతి చెందారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

నెల్లూరు జిల్లా అభ్యర్థుల్లో పలువురు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. నేదురుమల్లి(వెంకటగిరి), సంజీవయ్య(సూళ్లూరుపేట), ఆదాల (నెల్లూరు రూరల్), రామిరెడ్డి(కావలి), కాకాణి(సర్వేపల్లి), విక్రం రెడ్డి(ఆత్మకూరు) ఇంజినీరింగ్ చదివారు. ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఛార్టెర్డ్ అకౌంటెంట్. ప్రసన్న(కోవూరు), రాజగోపాల్ రెడ్డి(ఉదయగిరి), మురళీధర్(గూడూరు) డిగ్రీ పూర్తి చేయగా, ఖలీల్(నెల్లూరు సిటీ) ఇంటర్ చదివారు.

ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ రూమ్ ఏర్పాటు చేశామని తక్షణమే దాని సేవలు అందుబాటులోకి వస్తాయని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం సమాయత్తంగా ఉందని పేర్కొన్నారు. ప్రక్రియను పర్యవేక్షించేందుకు క్షేత్ర స్థాయిలో ఎన్సీసీ బృందాలు ఉన్నాయని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.