India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచిలో మంగళవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడియం ఆదిలక్ష్మి(42), మల్లవరపు సుబ్బారెడ్డి (55) బర్రెలను మేపడానికి పొలం వెళ్లారు. బర్రెలు నీటిలోకి వెళ్లాయని మూసీ నది దాటుతుండగా నీటి ప్రవాహానికి ఇద్దరు కొట్టుకుపోయారు. ఆదిలక్ష్మి మృతదేహం బుధవారం లభించగా.. గల్లంతైన సుబ్బారెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తాజాగా అధికారులు ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 18,19,566 చేరింది. ఇందులో పురుషుల సంఖ్య 9,06,234 కాగా, మహిళా ఓటర్లు 9,13,218 మంది ఉన్నారు. వీరిలో థర్డ్ జండర్ 114 మంది ఉన్నారు. జిల్లాలో పురుషులకంటే 6,984 మహిళా ఓటర్లే అధికం. జనవరి 6న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.
వెలుగొండ ప్రాజెక్టు వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు అధికారులు కూటమి మంత్రులు, MLAలు ఇన్ఛార్జులు వచ్చారు. ఈ సందర్భంగా.. మంత్రులు నిమ్మల రామానాయుడు, స్వామి, గొట్టిపాటి, MP మాగుంట, MLAలు ఉగ్రా, దామచర్ల, కందుల, ఇన్ఛార్జులు గొట్టిపాటి లక్మీ, ఎరిక్షన్ బాబు ద్విచక్ర వాహనాలపై వెలుగొండ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన ఫోటో వైరల్ అవుతుంది.
MRP కంటే అధిక రేట్లకు మద్యం అమ్మితే చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక రేట్లకు మద్యం అమ్మితే షాపులను సీజ్ చేసి కేసుల నమోదు చేయాలన్నారు. జిల్లాలో బెల్ట్ షాపులపై ప్రత్యేక నిఘా పెట్టాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం కట్టడి చేయాలని అధికారులకు సూచించారు.
పొన్నలూరు మండలంలోని నాగిరెడ్డిపాలెం జంక్షన్ వద్ద ఎస్ఐ అనూక్ మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. కనిగిరి నుంచి వస్తున్న ఓ కారుని ఆపి తనిఖీ చేశారు. కారులోని మహిళ వద్ద ఏడాది బాబు ఉండటంతో పాటు ఆమె మాటలకు అనుమానం వచ్చి విచారించినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా ఆ బాలుడుని కావలిలో కిడ్నాప్ చేసినట్లు మహిళ అంగీకరించిందని ఆయన వెల్లడించారు.
నవంబర్ నెలలో జిల్లాలో పంపిణీ చేయనున్న పెన్షన్ల పంపిణీపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష నిర్వహించారు. పెన్షన్స్ పంపిణీ గురించి మాట్లాడుతూ.. 31వ తేదీన దీపావళి పండుగ నేపథ్యంలో ఈనెల 30వ తేదీనే ముందస్తుగానే బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకోవాలన్నారు. 1వ తేదీన ఉదయం 5గంటలకి లబ్ధిదారులకు సచివాలయాల సిబ్బంది పెన్షన్లు పంపిణీ ప్రారంభించాలన్నారు.
ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈనెల 30న జిల్లా పర్యటన నిమిత్తం ఒంగోలు నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా నగరంలోని టీడీపీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఈ విషయాన్ని టూరిజం డెవలప్మెంట్ ఛైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ ఛైర్మన్లు, కూటమి నాయకులు హాజరవుతారు.
మార్కాపురం మండలం రాయవరం రైల్వే స్టేషన్ వద్ద ఓ ఇంట్లో వ్యక్తి మృతి చెందాడు. నాయుడుపల్లి వెళ్లే రహదారిలో ఉన్న రైస్ మిల్లు యజమాని గుంటక సత్యనారాయణ (75) ఐదు రోజుల క్రితం ఇంట్లో మృతి చెంది ఉన్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని తల భాగంలో బలమైన గాయమైనట్లు పోలీసులు గుర్తించారు. హత్యా లేక మరేదైనా కారణమా అన్న వివరాలు తెలియాల్సిఉంది.
నవంబర్ నెలలో జిల్లాలో పంపిణీ చేయనున్న పెన్షన్ల పంపిణీపై జిల్లా అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష నిర్వహించారు. పెన్షన్స్ పంపిణీ గురించి సమీక్షిస్తూ.. 31వ తేదీన దీపావళి పండుగ నేపథ్యంలో ఈనెల 30వ తేదీనే ముందస్తుగానే బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకోవాలన్నారు. 1వ తేదీన ఉదయం 5గంటలకి లబ్ధిదారులకు సచివాలయాల సిబ్బంది పెన్షన్లు పంపిణీ ప్రారంభించాలన్నారు.
ఒంగోలు స్వార్వత్రిక ఎన్నికలలో వాడిన EVMలలో అవకతవకలు జరిగాయని బాలినేని వేసిన పిటీషన్ను కోర్టు కొట్టేసింది. EVMలలో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ ట్యాంపరింగ్కు గురైందా అన్న విషయాన్ని పరిశీలించేందుకే మాక్ పోలీంగ్ నిర్వహిస్తారని కోర్టు తెలిపింది. దీనికి VV ప్యాట్ల తెక్కింపు అవసరం లేదని EC చేసిన వాదనకు న్యాయస్థానం ఏకీభవించింది. హైకోర్ట్ న్యాయమూర్తి సోమవారం తీర్పును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.