Prakasam

News April 19, 2026

అక్షయ తృతీయ.. ప్రకాశంలో బంగారం ధరలు ఇలా..?

image

అక్షయ తృతీయ కావడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బంగారు దుకాణాలు కళకళలాడుతున్నాయి. పసిడి ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నా.. కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం 24 క్యారెట్ల తులం(10 గ్రాములు) బంగారం ధర రూ.1,54,100గా ఉంది. 22 క్యారెట్ల తులం రూ.1,42,500 పలుకుతోంది.

News April 19, 2026

పరిష్కార వేదిక సమయంలో మార్పులు: DRO

image

ఒంగోలులో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తామని DRO ఓబులేసు ప్రకటించారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు అర్జీలు సమర్పించేవారు ఈ సమయంలోనే ఇచ్చి 12.30 గంటలకల్లా తిరిగి నివాసగృహాలకు చేరుకోవాలని సూచించారు.

News April 19, 2026

ప్రకాశం ఎస్పీ హెచ్చరికలు ఇవే..!

image

మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయం నుంచి ఆదివారం ఓ ప్రకటన విడుదలైంది. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమనే విషయాన్ని పిల్లల తల్లిదండ్రులు గమనించాలన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. రహదారి భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.

News April 19, 2026

ప్రకాశం జిల్లాలో ఈ గుడికి వెళ్లారా..?

image

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి పోలేరమ్మ తల్లి చాలా పవర్ ఫుల్. జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ అమ్మవారి గర్భాలయం వెనుక వైపు రూపాయి కాయిన్ నిలెట్టి ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఆది, మంగళవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇవాళ వెండి కిరీటం, బంతి, మల్లె, గులాబీ పూలతో అమ్మవారిని(పైఫొటో) అలంకరించారు. మీరు ఈ గుడికి వెళ్లారా?

News April 19, 2026

ఒంగోలు పోలీసులను బెదిరించడానికే సెల్ఫీ వీడియో!

image

తన తల్లిని పోలీసులు దూషించారంటూ ఒంగోలులో హరీశ్ అనే యువకుడు విడుదల చేసిన <<19679794>>సెల్ఫీ వీడియో <<>>వైరల్ అవుతోంది. దీనిపై పోలీసులు స్పందించారు. ‘హరీశ్‌పై రౌడీషీట్ ఉంది. దొంగతనం, దోపిడీ, దౌర్జన్యాలు, కొట్లాట కేసులు నమోదయ్యాయి. వాళ్ల తల్లిని స్టేషన్‌కు పిలిపించి కేసులు ఉన్నాయని మాత్రమే చెప్పాం. ఈనెల 16న జరిగిన ఘర్షణ కేసులో అతను పరారీలో ఉన్నాడు. పోలీసులను బెదిరించడానికే వీడియో చేశాడు’ అని పోలీసులు తెలిపారు.

వీడియో కాల్‌తో అరెస్ట్ అసాధ్యం: ప్రకాశం SP

image

ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు ప్రజలకు శనివారం కీలక సూచనలు జారీ చేశారు. వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరని స్పష్టం చేశారు. కొంతమంది మోసగాళ్లు పోలీసుల వేషంలో వీడియో కాల్స్ చేసి భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి కాల్స్‌ను నమ్మకూడదని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు. అనుమానం ఉంటే వెంటనే 1930కి కాల్ చేసి, లేదా సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.