Prakasam

News April 19, 2026

వీడియో కాల్‌తో అరెస్ట్ అసాధ్యం: ప్రకాశం SP

image

ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు ప్రజలకు శనివారం కీలక సూచనలు జారీ చేశారు. వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరని స్పష్టం చేశారు. కొంతమంది మోసగాళ్లు పోలీసుల వేషంలో వీడియో కాల్స్ చేసి భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి కాల్స్‌ను నమ్మకూడదని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు. అనుమానం ఉంటే వెంటనే 1930కి కాల్ చేసి, లేదా సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

News April 18, 2026

ప్రకాశం: సూసైడ్‌‌కు యత్నం.. అడ్డుకున్న పోలీసులు

image

ప్రకాశం జిల్లాలో బీటెక్ చదువుతున్న విద్యార్థి శనివారం ఆత్మహత్యకు యత్నించాడు. వివరాల్లోకి వెళితే.. పొదిలి(M) గోగినేనివారిపాలెంకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి మందు తమ్ముడికి ఫోన్‌చేసి ‘నేను చనిపోతున్నాను’ అని చెప్పాడు. అనుమానంతో తమ్ముడు చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చీమకుర్తి CI ప్రసాద్, SI కృష్ణయ్య వెంటనే స్పందించి విద్యార్థి ఆచూకీ కనుగొని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

News April 18, 2026

ప్రకాశం: రూ.1.20 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ అందజేత

image

ఒంగోలులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ కింద రూ.1.20కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ వేగంగా పరిష్కరించింది. ప్రమాదంలో మరణించిన ఏపీ సచివాలయం ఉద్యోగి పోధిలి భార్గవనాథ్ కుటుంబానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే పథకమని తెలిపారు.

ఒంగోలు: రూ.1.20 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ అందజేత

image

ఒంగోలులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ కింద రూ.1.20కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ వేగంగా పరిష్కరించింది. ప్రమాదంలో మరణించిన ఏపీ సచివాలయం ఉద్యోగి పోధిలి భార్గవనాథ్ కుటుంబానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే పథకమని తెలిపారు.

News April 18, 2026

పొదిలిలో భర్త ఇంటి ముందు భార్య ధర్నా

image

పొదిలికి చెందిన కొదమల నాగరాజు అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహం జరిగి 12 సంవత్సరాలు అయింది. వారికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఇటీవల భర్త మరొక యువతితో సంబంధం పెట్టుకుని తనని వేధిస్తున్నాడని దీంతో పుట్టింటికి వెళ్లానని భార్య తెలిపింది. భర్తలో మార్పు రాకపోతుందా అని తాను ఇంటికి రాగా.. మామ అసభ్యంగా మాట్లాడి ఇంట్లోకి రానివ్వలేదని ఆరోపించింది. దీంతో ఆమె పిల్లలతో ఇంటి ముందు కూర్చుని ధర్నా చేసింది.

News April 18, 2026

ఒంగోలు: మూడు జిల్లాల దొంగ అరెస్ట్

image

ప్రకాశం, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో పగటిపూట తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న మల్లి రెడ్డి నరేంద్రరెడ్డి(27)ని ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. సీఐ విజయ్ కృష్ణ, ఎస్ఐ హరిబాబు బృందం నిందితుడిని పట్టుకుని అతని నుంచి 110 గ్రాముల బంగారం, 60 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకుంది. నరసరావుపేటలో తాకట్టు పెట్టిన బంగారం స్లిప్పులు కూడా స్వాధీనం చేసుకున్నారు.

News April 18, 2026

ప్రకాశం: రైతుల కోసం బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశాలు

image

ప్రకాశం జిల్లాలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు కలెక్టర్ పి.రాజాబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి చిన్న ఆక్వా రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) ద్వారా రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు. రుణాల మంజూరులో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ, నాబార్డ్ అధికారులు, ఆక్వా రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.