Prakasam

News September 27, 2024

‘దేవర’ అభిమానుల సందడి.. కటౌట్‌కి పాలాభిషేకం

image

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని మానేపల్లిలో ‘దేవర’ అభిమానుల సందడి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్స్‌కు ఆయన ఫ్యాన్స్ గజమాలలు వేసి, పాలాభిషేకం చేశారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో ప్రారంభం కానుండగా.. అన్ని థియేటర్లలో రేపు రిలీజ్ కానుంది. అనంతరం టపాసులు పేల్చుతూ ‘జై ఎన్టీఆర్.. జై జై ఎన్టీఆర్..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ మూవీలోని పాటలకు డాన్సులు వేశారు.

News September 26, 2024

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా సురేశ్

image

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పలు జిల్లాలకు పూర్తి అధ్యక్షులు, పార్టీ కన్వీనర్లను గురువారం ప్రకటించారు. మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేశ్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 26, 2024

రేపు కనిగిరిలో ‘మెగా జాబ్ మేళా’

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ- ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడప్ ఆధ్వర్యంలో శుక్రవారం కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ‘మెగా జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారులు భరద్వాజ్, రవితేజ తెలిపారు. 10వ తరగతి నుంచి ఏదైనా పీజీ పూర్తి చేసి, 18-35 ఏళ్లలోపు యువతీ, యువకులు అర్హులన్నారు. 20 కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News September 26, 2024

బాలినేని జనసేనలో చేరకముందే జిల్లాలో హీటెక్కిన రాజకీయం

image

బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరకముందే జిల్లాలో రాజకీయం హీటెక్కింది. <<14200095>>బాలినేని<<>>ని.. పవన్ ఎందుకు చేర్చుకుంటున్నారని దామచర్ల జనార్ధన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది. బాలినేని ఇవాళ జనసేనలో చేరితే, రానున్న రోజుల్లో.. వీరిద్దరూ కూటమి ప్రభుత్వంలో పనిచేయాల్సి ఉంటుంది. దీంతో మున్ముందు జిల్లా రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అని చర్చ జరుగుతోంది. దామచర్ల వ్యాఖ్యలపై మీ COMMENT.

News September 26, 2024

ప్రకాశం: కేజీబీవీల్లో సిబ్బంది నియామకానికి దరఖాస్తులు

image

జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బందిని ఒప్పంద, అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపడుతున్నట్లు డీఈవో డి. సుభద్ర పేర్కొన్నారు. బోధనా సిబ్బందిని ఒప్పంద విధానంలో, బోధనేతర సిబ్బందిని అవుట్ సోర్సింగ్ కింద 2024-25 సంవత్సర కాలానికి భర్తీ చేస్తామన్నారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో రూ.250లు చెల్లించి దరఖాస్తు చేయాలన్నారు.

News September 26, 2024

నేడు జనసేనలోకి బాలినేని

image

మాజీ మంత్రి బాలినేని ఇవాళ జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారీ బహిరంగ సభ పెట్టి తనతో పాటు తన అనుచరవర్గంతో కలిసి జనసేనలో చేరుతానన్నారు. అయితే ప్రస్తుతం ఒంగోలులో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా ఒక్కరే వచ్చి పార్టీలో చేరాలని జనసేన పెద్దలు ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది.

News September 26, 2024

ఒంగోలు: ‘బాలినేని అక్రమాలను డిప్యూటీ సీఎం పవన్ గుర్తించాలి’

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అవినీతి గురించి తెలుసుకోవాలని టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి కోరారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు సంవత్సరాల్లో బాలినేని చేసిన అవినీతికి సాక్ష్యాలు చూపిస్తామని తెలిపారు. బాలినేనిని జనసేనలోకి చేర్చుకోవడం వల్ల జనసేన పార్టీ విలువలకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.

News September 26, 2024

MP మాగుంటను ఫోన్‌ ద్వారా పరామర్శించిన చంద్రబాబు

image

మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి, మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట పార్వతమ్మ మరణించిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న CM నారా చంద్రబాబు నాయుడు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఫోన్ చేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం తరఫున మంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో పార్వతమ్మకి అంత్యక్రియలు ఏర్పాటు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారు.

News September 25, 2024

కనిగిరి మండలంలో బాలుడు ఆత్మహత్య

image

కనిగిరి మండలం మాచవరంలో ఉరి వేసుకుని బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతుడి పెదనాన్న ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్న మధుసూదన్ (14) మాచవరంలోని అమ్మమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News September 25, 2024

మాగుంట పార్వతమ్మ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

image

ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. మాజీ ఎంపీ పార్వతమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందడం బాధాకరమన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా విశేషసేవలందించారని కొనియాడారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాల రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. దశాబ్దాలుగా ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ స్థానిక ప్రజలతో మాగుంట కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు.