Prakasam

News September 21, 2024

ప్రకాశం జిల్లాలో పోస్టింగ్ వచ్చిన ఎస్సైలు వీరే

image

▶ ఒంగోలు 1 టౌన్ – టి. త్యాగరాజు, పి. శివ నాగరాజు, జి. సుబ్రహ్మణ్యం
▶ ఒంగోలు 2 టౌన్ – అబ్దుల్ రెహమాన్, శివనాంచారయ్య
▶ ఒంగోలు 2 టౌన్ అటాచ్ DCRB – సుబ్బారావు
▶ ఒంగోలు తాలూకా – హరి బాబు, సందీప్
▶ ఒంగోలు తాలూకా అటాచ్ PCR – ఫిరోజ్, అనిత
▶ ఒంగోలు తాలూకా అటాచ్ DCRB – శ్రీనివాసరావు
▶ ఒంగోలు PCR – పి.రాజేశ్
▶ DCRB ఒంగోలు – వెంకటేశ్వరరావు
▶ పుల్లలచెరువు – సంపత్ కుమార్
▶ గిద్దలూరు – ప్రభాకర్ రెడ్డి

News September 21, 2024

ప్రకాశం జిల్లాలో 15 మంది ఎస్సైల బదిలీ

image

ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. డిస్ట్రిక్ట్ వీఆర్‌లో ఉన్న 14 మంది, పుల్లల చెరువు ఎస్సైను బదిలీ చేస్తూ ఎస్పీ దామోదర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వారందరినీ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల్లో పోస్టింగ్ ఇస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.

News September 21, 2024

కనిగిరి: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కనిగిరి మండలంలోని నేలటూరి గొల్లపల్లిలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి మాలకొండయ్య సచివాలయం సమీపంలో ఉన్న బోరు మోటర్ వద్ద విద్యుత్ వైరు తెగిపడి ఉండడంతో కటింగ్ బ్లేడుతో జాయింట్ చేసే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News September 21, 2024

హైకోర్టు జడ్జిని కలిసిన ఎస్పీ, కలెక్టర్

image

ఒంగోలుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు జడ్జి, ప్రకాశం జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి యన్ వెంకటేశ్వర్లును జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, కలెక్టర్ తమిమ్ అన్సారీయా, జిల్లా జడ్జీ భారతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం వారు జిల్లాలోని పలు విషయాల గురించి చర్చించారు.

News September 21, 2024

ప్రకాశం జిల్లా వాసికి కష్టం.. సాయం చేసిన లోకేశ్

image

ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన వేముల నాగరాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. నాగరాజు కుటుంబ సభ్యులు ట్విటర్ ద్వారా మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.7లక్షలు అందించారు. ఈ నేపథ్యంలో నాగరాజు కుటుంబ సభ్యులు ఉండవల్లి ప్రజాదర్బార్‌లో శనివారం మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

News September 21, 2024

ప్రకాశం: సీఎం చంద్రబాబుకు 53 వినతి పత్రాలు

image

నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం’జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న చంద్రబాబు ప్రజల నుంచి 53 వినతి పత్రాలు స్వీకరించారని సంబంధిత అధికారి శ్రీనివాసులు తెలియజేశారు. రెవిన్యూ సమస్యలపై 11, పెన్షన్ మంజూరుకు 8, వివిధ ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యసమస్యలపై 4, రోడ్లు అభివృద్ధి చేయాలని 12, ఇళ్ల మంజూరుకు 4, ఉద్యోగాల కోసం 11, విద్యుత్ సమస్యలపై 2 వినతులు వచ్చాయన్నారు.

News September 21, 2024

పర్చూరు: ‘జాగ్రత్తగా లేకుంటే మరో బుడమేరు ప్రమాదం’

image

ఉప్పుటూరు గ్రామానికి పక్కనే ఉన్న వాగు వెంబడి కట్టలు తెగి ఉండడం పట్ల గ్రామస్థులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. గతంలో వచ్చిన తుఫాను కారణంగా కట్టలు తెగాయని అవి బాగుచేయకుంటే మరో బుడమేరు ప్రమాదాన్ని పర్చూరులో చూడాలని గ్రామస్థులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి కట్టలను బాగుచేయాలని వాగువెంబడే అనుకొని ఉన్న ఉప్పుటూరు, వీరన్నపాలెం గ్రామవాసులు కోరుతున్నారు.

News September 21, 2024

బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కరణం వెంకటేష్?

image

బాపట్ల జిల్లా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతల సమావేశం అధినేత జగన్ సమక్షంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా చీరాల ఇన్ ఛార్జ్ కరణం వెంకటేష్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.

News September 20, 2024

ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బూచేపల్లి?

image

ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే డా.బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని శుక్రవారం వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇవాళ జిల్లాలోని నేతలు అందరితో సమావేశం నిర్వహించి చర్చించారు. అనంతరం జిల్లా నేతలు అందరూ బూచేపల్లిని సన్మానించారు. దీంతో ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఆయనకు ఇచ్చారని దర్శి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

News September 20, 2024

CM సభా ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి స్వామి

image

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో, మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పర్యటన ప్రదేశాలను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉన్నారు.