Prakasam

News November 15, 2024

తిరుమల శ్రీవారికి 15 బైకుల అందజేత

image

తిరుమల శ్రీవారికి ఒంగోలు వాసులు ఎలక్ట్రిక్ స్కూటర్లను వితరణగా ఇచ్చారు. పియరల్ మినరల్ అండ్ మైన్స్ కంపెనీ ఎండీ వెంకట నాగరాజ దాదాపు రూ.25 లక్షల విలువైన 15 బైకులను అందజేశారు. ఈ సందర్భంగా వాటికి ఆలయం ముందు పూజలు చేశారు. దాతలకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు.

News November 15, 2024

పొన్నలూరు క్రీడాకారిణి మైథిలి మరణం.. కేసు 

image

పొన్నలూరు మండలానికి చెందిన క్రీడాకారిణి మైథిలి గత నెల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే బాలిక మృతికి జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ వనజ, పీఈటి బన్నీ, కృపాకర్ కారణం అంటూ కొద్దిరోజులుగా తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారు. పోటీలు జరిగిన తర్వాత తమ బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చలేదని పవన్ కళ్యాణ్‌ని కలసి వివరించారు. దీంతో గురువారం ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 

News November 15, 2024

ప్రకాశం ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

image

సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన, అనైతిక, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో గురువారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, టెలిగ్రాం, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), ఇతర సోషల్‌ మీడియాలో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దన్నారు.

News November 14, 2024

ప్రకాశం జిల్లాలో 12 మంది ఏఎస్ఐలు బదిలీ

image

ప్రకాశం జిల్లాలో 12 మంది ఏఎస్ఐలు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ దామోదర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమలులోకి వస్తాయని అన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్సైలు, సీఐలు బదిలీ అయినా ఏఎస్ఐలకు రిలీవింగ్ ఆర్డర్లను ఇవ్వాలని, బదిలీ అయినా పోలీస్ స్టేషన్ వివరాలను వారికి తెలపాలని ఎస్పీ అధికారులకు సూచించారు.

News November 14, 2024

ప్రకాశం జిల్లాలో పోసానిపై మరో ఫిర్యాదు

image

సినీ నటుడు, వైసీపీ మద్ధతుదారుడైన<<14606978>> పోసాని కృష్ణమురళిపై<<>> ప్రకాశం జిల్లాలో మరొకొందరు ఫిర్యాదు చేశారు. టీటీడీ ఛైర్మన్ BR నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యర్రగొండపాలెం పోలీసులను టీడీపీ నేతలు ఆశ్రయించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కనిగిరిలో సైతం కొందరు నాయకులు పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News November 14, 2024

ఒంగోలులో ప్రారంభమైన బంగారు బాలోత్సవాలు

image

ఒంగోలులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తమిమ్ అన్సారియా ఆధ్వర్యంలో గురువారం బంగారు బాలోత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలల స్వేచ్ఛకు ప్రతీకతగా గాలిలోకి బెలూన్స్ వదిలారు. బాలల హక్కులు, వారికున్న రక్షణ చట్టాలు, ప్రభుత్వ పథకాలపై వారం రోజులు గ్రామ స్థాయిలో ప్రత్యేక అవగాహనను కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 14, 2024

ఒంగోలులో DLDO సస్పెండ్

image

ప్రకాశం జిల్లాలో ఓ కీలక అధికారిణి సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం ఒంగోలు డీఎల్డీవోగా ఉన్న ఉషారాణి గతంలో డీపీవోగా పనిచేశారు. ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఇందులో ఆమె అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణకు ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా ఆమెను ప్రభుత్వానికి సరెండ్ చేయగా.. తాజాగా ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

News November 13, 2024

అల్పపీడనం.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు

image

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో బాపట్ల, ప్రకాశం జిల్లాల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉందని ఇప్పటికే ప్రజల ఫోన్‌లకు మెసేజ్‌లు పంపిస్తోంది. ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో చెట్లు, సెల్ టవర్స్, విద్యుత్ స్తంభాల సమీపంలో, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది.

News November 13, 2024

ప్రకాశం: ‘పోలీసు శాఖ ప్రతిష్ఠ పెంచేలా ఉండాలి’

image

పోలీస్ ప్రతిష్ఠ మరింత పెంచేందుకు సాయుధ బలగాల పనితీరు బాగుండాలని ఎస్పీ దామోదర్ చెప్పారు. ఏఆర్ సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో మంగళవారం దర్బార్ కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాజువల్ లీవు, ట్రాన్స్ఫర్స్, టిఏలు, అలవెన్సులు, ఏఆర్, స్పెషల్ పార్టీ పోలీసుల బందోబస్తులు, జీపీఎఫ్ లోన్, మెడికల్ బిల్లులు, సీనియారిటీ లిస్టు తదితర సమస్యల గురించి చర్చించారు.

News November 13, 2024

ఒంగోలు: యువతిని గర్భవతిని చేసిన మామ

image

తండ్రిలేని యువతిని ఒంగోలుకు చెందిన మేనమామ గర్భవతిని చేసిన ఘటన ఇది. పోలీసుల వివరాల ప్రకారం.. భట్టిప్రోలుకి చెందిన 18ఏళ్ల యువతి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ యువతి ఆదిలాబాద్‌లో ఉంటున్న పెద్ద మేనమామ వద్ద ఉంటోంది. ఒంగోలులో ఉంటున్న చిన్న మేనమామ ఇటీవల ఆదిలాబాద్ వెళ్లాడు. ఈ క్రమంలో కోడలిని లొంగదీసుకొని గర్భిణిని చేశాడు. ఈ విషయంపై తెనాలి పోలీసులకు సమాచారం ఇచ్చారు.