India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఎక్కువ కేసులు డిస్పోజల్ అయ్యేలా కృషి చెయ్యాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీస్ అధికారులు తమ స్టేషన్ల పరిధిలోని కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, భూతగాదాలు, మోటార్ బైక్ యాక్సిడెంట్, చిట్ ఫండ్ వంటి కేసులు, ఇతర కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని గురువారం సూచించారు.
ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండల పరిధిలోని గోణసపూడి గ్రామవాసి, పారిశ్రామికవేత్త విక్రం నారాయణ కుటుంబం వరద బాధితులకు అండగా నిలిచింది. ఈ మేరకు గురువారం CM చంద్రబాబు నాయుడిని కలిసి రూ.1,55,55,555 భారీ చెక్కును విక్రం నారాయణ అందజేశారు. ఆపద సమయాల్లో వరద బాధితులకు అండగా నిలిచిన విక్రం నారాయణ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. మంత్రి అనగాని, ఎమ్మెల్యే విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, సంతనూతలపాడు ఇన్‌ఛార్జ్ పాలపర్తి విజేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌పై చర్చించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు షర్మిల సూచించారు.
➤ దోర్నాల మండలంలో పర్యటించిన ప్రకాశం జిల్లా కలెక్టర్
➤ ఆసుపత్రిలో తల్లి మృతి.. బిడ్డను అమ్మేసిన తండ్రి
➤ కనిగిరి: రూ.66 వేలు పలికిన లడ్డూ
➤ కురిచేడు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
➤ కొత్తపట్నం: నమ్మించి సహజీవనం.. మరో పెళ్లిక యత్నం
➤ గిద్దలూరు: గణేష్ లడ్డూ పాడిన ముస్లిం సోదరులు
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్‌కు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉద్యోగాలు కల్పించనుంది. ప్రకాశం జిల్లాలో ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే.. విజయవాడలో రోజూవారీ వేతనంపై పని కల్పిస్తామని జిల్లా అధికారి రవితేజ చెప్పారు. అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్స్‌తో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద ఉన్న NAC ట్రైనింగ్ సెంటర్‌ను సంప్రదించాలి.
ప్రకాశం జిల్లాలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్ వద్ద వినాయకుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా గణనాథుడి లడ్డూను వేలం వేశారు. ముస్లిం సోదరులు షరీఫ్, నజీర్ రూ.33800లకు లడ్డూను దక్కించుకున్నారు. మతసామరస్యానికి ఇది నిదర్శనమని పలువురు వారిని అభినందించారు.
ప్రకాశం జిల్లాలో ఉచిత ఇసుక తరలించేందుకు వాహనాల నంబర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మైనింగ్ జిల్లా శాఖ అధికారి జగన్నాథ రావు, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ సుశీల ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 11 నుంచి ఉచిత ఇసుక నూతన పాలసీ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ మేరకు వాహనదారులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ లేని వాహనాలు ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చిన్నగంజాం మండలానికి చెందిన ఓ మహిళ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ శిశువుకు జన్మనిచ్చి మరణించింది. అదే వార్డులో ప్రసవించిన అనంతరం శిశువుని పోగొట్టుకున్న మరో మహిళకు ఆ బిడ్డను శిశువు తండ్రి 1,90,000 అమ్మేశాడు. ఈ ఘటనపై కొత్తపేట పోలీసు స్టేషన్‌లో జీరో FIR నమోదు అయింది. తదుపరి విచారణ నిమిత్తం కొత్తపేట పోలీసులు చిన్నగంజాం పోలీసు స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు.
ప్రయాణిస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కురిచేడు మండలం పొట్లపాడు సమీపంలో చోటుచేసుకుంది. నంద్యాల నుంచి గుంటూరు వెళుతున్న రైలు నుంచి పడి చనిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మృతుడు వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామానికి చెందిన పులి నాగార్జున ఓ యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడేవాడు. 10ఏళ్ల తర్వాత ఇటీవల ఆమె వద్దకు వెళ్లి నమ్మించి సహజీవనం చేశాడు. కొద్ది రోజుల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు పూనుకున్నాడు. దీనిపై ఆమె ప్రశ్నిస్తే హంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడటంతో యువతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నాగార్జునతోపాటు, మరో అయిదుగురిపై కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.