Prakasam

News July 6, 2024

తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి నిలపాలి: కలెక్టర్ అన్సారియా

image

తాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక దృష్టి నిలపాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శుక్రవారం ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్‌లో ఒంగోలు కార్పొరేషన్‌తో సహా అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలలో ఇళ్లకు సరఫరా చేస్తున్న తాగునీటి సరఫరా వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News July 5, 2024

ప్రకాశం: ఓకే మండలంలో ముగ్గురు ఆత్మహత్య

image

ముండ్లమూరు మండలంలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. పసుపుగల్లు, బొప్పిడి వారి పాలెం, నాయుడుపాలెంలలో ముగ్గురు వేరు వేరు కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మూడు మృతదేహాలు వేర్వేరు చోట్ల లభ్యం కావడంతో ముండ్లమూరు మండలంలో కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2024

యర్రగొండపాలెం ఎస్సై సుదర్శన్ సస్పెండ్

image

యర్రగొండపాలెం ఎస్సై సుదర్శన్ ను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ విచారణకు ఆదేశించారు. దీంతో మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు ఆధ్వర్యంలో విచారణ జరిపిన అనంతరం ఆ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు.

News July 5, 2024

చీమకుర్తి : నూడుల్స్ తింటూ వ్యక్తి మృతి

image

చీమకుర్తిలోని ఓ రెస్టారెంటులో గురువారం రాత్రి నాగశేషులు అనే వ్యక్తి మృతి చెందాడు. రాత్రి 9 గంటల సమయంలో నాగశేషులు పట్టణంలోని ఓ రెస్టారెంట్‌కి వచ్చి నూడుల్స్ ఆర్డర్ చేసి కొంత వరకు తిన్నాడు. తింటుండగానే కుర్చీలోనే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం ఆత్మకూరుగా స్థానికులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2024

పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా ఎంపీ మాగుంట

image

ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డిని పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా శుక్రవారం ప్రకటించారు. పార్లమెంటు సభా ప్రాంగణంలో ఒంగోలు ఎంపీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హౌస్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఎంపీ మాగంటకు సహచర ఎంపీలు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.

News July 5, 2024

ప్రకాశం: పెంపుడు కుక్కలు ఉంటే ఇలా చేయండి

image

రేబిస్ వ్యాధినుంచి నివారణకు పెంపుడు కుక్కల యజమానులు తప్పనిసరిగా తమ కుక్కలకు రాబిస్ వాక్సిన్ చేయించుకోవాలని జిల్లాపశు సంవర్ధక శాఖ అధికారి బేబిరాణి అన్నారు. జునోసిస్ డే సందర్భంగా స్థానిక సంతపేట పశువైద్యశాలలో 6వ తేదీన అన్ని పెంపుడు కుక్కలకు ఈ రేబిస్ టీకాను ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం వరకు ఉచితంగా అందజేస్తామని అన్నారు. కావున ఈ అవకాశాన్ని జిల్లాలోని అందరూ వినియోగించుకోవాలని కోరారు.

News July 5, 2024

మార్కాపురం: వ్యాపారి కిడ్నాప్.. వదిలేసిన రైతులు

image

మార్కాపురం మండలం బిరుదులనరవకు చెందిన వ్యాపారి వెంకట్ రెడ్డి గొట్టిపడియకు చెందిన రైతులనుంచి మిరపకాయ డబ్బులు రూ.1.30 కోట్లు ఎగ్గొట్టడంతో <<13561112>>బుధవారం రైతులు<<>> అతనిని కిడ్నాప్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి 8 గంటలకు గ్రామ శివారులో రైతులు అతనిని విడిచిపెట్టారు. అప్పు ఎవరు తీరుస్తారని రైతులు పోలీసులు వద్ద వాపోయారు.

News July 5, 2024

ఒంగోలు: స్పందన భవనం పేరు మార్పు

image

ఒంగోలులో స్పందన భవనం పేరు మారింది. YCP ప్రభుత్వంలో అప్పటి కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ప్రజల సమస్యలు పరిష్కారం చేసేందుకు గ్రీవెన్స్‌, తదితర కార్యక్రమాల కొరకు దాదాపుగా 500మందికి పైగా పట్టేలా నిర్మాణం చేపట్టి దానికి శ్రీ స్పందన భవనంగా నామకరణం చేశారు. కూటమి ఆ భవనం పేరును ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మార్పు చేస్తూ అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు.

News July 5, 2024

మంత్రి అచ్చెన్నాయుడిని కలిసిన ఎమ్మెల్యే ఉగ్ర

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గం అభివృద్ధికి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే ఉగ్ర తెలిపారు.

News July 5, 2024

ఒంగోలు: జిల్లా జైలులో ఖైదీలకు ఉపాధి శిక్షణ

image

ఖైదీలకు గ్రామీణ అభివృద్ధి స్వయం ఉపాధి సంస్థ ద్వారా పలు రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని జిల్లా జైల్ సూపరిండెంట్ వరుణ్ కుమార్ తెలిపారు. ఒంగోలు జిల్లా జైల్లో ఖైదీలకు ఏర్పాటు చేసిన సమావేశంలో రూట్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. రూట్స్ సంస్థ ద్వారా జైలులో ఉన్న ఖైదీలకు స్వయం ఉపాధి కోసం పలు రంగాల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు.