Prakasam

News February 5, 2026

వాట్సప్ మెసేజ్‌లు నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు : ఎస్పీ

image

వాట్సాప్ మెసేజ్‌లు నమ్మి పెట్టుబడులు పెట్టరాదని మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తెలియని వాట్సప్ గ్రూపులలో జాయిన్ కావద్దన్నారు. ఈజీ మనీ ఆశతో ఎలాంటి లింకులను ఓపెన్ చేయొద్దు అన్నారు. వాట్సాప్‌లో వచ్చే APK ఫైల్ డౌన్లోడ్ చేయవద్దని సూచించారు. సైబర్ క్రైమ్ బాధితులైతే 1930కి కాల్ చేయాలని పేర్కొన్నారు.

News February 5, 2026

ప్రకాశం: బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆర్మీ జవాన్ మృతి

image

కంభం మండలంలోని తురిమెళ్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ యేలం వెంకటరమణ (45) అస్సోం రాష్ట్రంలోని దిబ్రూగడ్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించారు. విధుల్లో ఉండగా సోమవారం అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నెల రోజుల క్రితమే తండ్రి వేమయ్య మృతి చెందడంతో సొంత గ్రామానికి వచ్చి తండ్రి దశదినకర్మ నిర్వహించిన అనంతరం వెంకటరమణ విధుల్లో చేరారు.

News February 5, 2026

ప్రకాశం: నిండు గర్భిణిని కత్తితో పొడిచి భర్త పరార్..

image

నిండు గర్భిణి అయిన భార్యపై భర్త అనుమానం పెంచుకుని కత్తితో దాడి చేశాడు. ప్రకాశం జిల్లాకు చెందిన గుంజి వెంకటశేషారావు, కరుణ దంపతులు కొద్ది రోజులుగా నెల్లూరు(D) విశ్వనాథరావుపేటలో కాపురం ఉంటున్నారు. ఆయన బిట్రగుంటలో అసిస్టెంట్ లోకో పైలెట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భార్యపై అనుమానంతో రోజూ గొడవలు జరుగుతుండేవి. బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరగగా భార్యపై విచక్షణా రహితంగా కత్తితో పొడిచి పరారయ్యాడు.

News February 5, 2026

ప్రకాశం జిల్లాలో అధికారిపై సస్పెన్షన్ వేటు.!

image

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని K.Vపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటి పన్నుల వసూళ్లలో పురోగతి లేకపోవడం, మండలంలోని గాడిపర్తివారిపాలెం ఇన్‌ఛార్జ్ కార్యదర్శిగా ఉంటూ అధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవడం వంటి కారణాలతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు డిప్యూటీ MPDO శ్రీధర్ తెలిపారు.

News February 5, 2026

ప్రకాశం హైవేలపై స్పెషల్ టీమ్స్: ఎస్పీ

image

జిల్లాలో ప్రమాదాల నివారణకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోని జాతీయ రహదారులపై 34 రోడ్ సేఫ్టీ టీమ్లను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలను చేపడుతున్నట్లు ఎస్పీ ప్రకటించారు. అలాగే అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 5, 2026

ప్రకాశం హైవేలపై స్పెషల్ టీమ్స్: ఎస్పీ

image

జిల్లాలో ప్రమాదాల నివారణకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోని జాతీయ రహదారులపై 34 రోడ్ సేఫ్టీ టీమ్లను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలను చేపడుతున్నట్లు ఎస్పీ ప్రకటించారు. అలాగే అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 4, 2026

ప్రకాశం: చిట్టీల పేరుతో రూ.10 కోట్లు తీసుకొని పరార్..!

image

సింగరాయకొండలో <<19045967>>చిట్టీల పేరుతో<<>> K. శ్రీను అనే వ్యక్తి సుమారు రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసి పరారయ్యాడు. అధిక వడ్డీ ఆశచూపడంతో మహిళలు, రోజువారీ కూలీలు, విశ్రాంత ఉద్యోగులు తమ పొదుపు మొత్తాన్ని అతనికి అప్పగించారు. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో భారీ కుంభకోణం వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News February 4, 2026

హాస్టల్‌పై నుంచి పడి ఒంగోలు విద్యార్థి మృతి

image

తిరుపతి జిల్లా చంద్రగిరి(M) రంగంపేటలోని ఓ యూనివర్సిటీలో ఒంగోలుకు చెందిన యువకుడు బీ.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాల సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో నివాసముంటున్న బాలాజీ బుధవారం తెల్లవారుజామున తాను ఉంటున్న హాస్టల్ భవనం పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

News February 4, 2026

ఉమ్మడి ప్రకాశం: 10th విద్యార్థులకు అలర్ట్.!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు DEO రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News February 4, 2026

ప్రకాశం: 9 నుంచి 10వ విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు

image

జిల్లా వ్యాప్తంగా ఈనెల 9వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. 9న తెలుగు, 10-హిందీ, 11-ఇంగ్లిష్, 12-మ్యాథ్స్, 13-ఫిజికల్ సైన్స్, 16-బయోలాజికల్ సైన్స్, 17-సోషల్ స్టడీస్, 18-కాంపోజిట్ కోర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, 19-ఓఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.