India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంత్రి స్వామి డెహ్రాడూన్‌లో జరుగుతున్న చింతన్ శివిర్ రెండవ రోజు సమావేశంలో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో అమలు చేయనున్న పీ-4పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. రూ.143 కోట్లతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు.
ప్రకాశం జిల్లాలో పేదల గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సోమవారం ఆమె మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 31వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 8,839 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు.
కందుకూరు పట్టణంలో కనిగిరి యువకుడు ఉరేసుకున్నాడు. కల్లూరి శివ నాగరాజు(26) కందుకూరు పోస్టాఫీస్ సెంటర్‌కు సమీపంలోని వెంకటరమణ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కనిగిరిలో క్రికెట్ బెట్టింగ్ వేసి అప్పులపాలై కందుకూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఒంగోలు రైల్వే స్టేషన్ ఆగిన హౌరా జనరల్ కోచ్‌లో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ప్రయాణికులు స్థానిక రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పరిశీలించారు. మృతుని వయస్సు 35 – 40 ఏళ్లు ఉంటాయని, మృతుని వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని జీఆర్పీ ఎస్సై. కే మధుసూదన్ రావు సూచించారు.
టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర నలుగురు యువకులు అరెస్ట్ అయ్యారు. గుంటూరుకు చెందిన రాజు టంగుటూరు పరిధిలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. హాస్టల్లో ఉండే అతను వేరే చోటు నుంచి గంజాయి తీసుకు వచ్చి స్థానికంగా ఉన్న యువకులకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్ఐ నాగమల్లేశ్వరావు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 4.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో నలుగురు యువకులు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని సమాచారం ఆధారంగా సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్ఐ నాగమల్లేశ్వరావు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 4.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్ దెబ్బతింటుందన్నారు. యువత చెడు మార్గాలను వదిలేయాలని సూచించారు.
ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి 92 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల వివరాలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ భరోసా కల్పించారు.
ప్రకాశం జిల్లాలో శ్రీరామనవమి రోజున విషాదం నెలకొంది. త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి వద్ద ముగ్గురు యువకులు బైక్‌పై ప్రయాణిస్తూ.. అదుపు తప్పి కిందపడ్డారు. వీరిలో నాగిరెడ్డి అనే యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యంలో మృతి చెందాడు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే దొనకొండ మండలం గుట్టమీదపల్లికి చెందిన పిక్కిలి తరుణ్(13) నీటి కుంటలో పడి మృతి చెందాడు.
దొనకొండ మండలం గుట్టపల్లికి చెందిన తరుణ్ (13) బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు… బాలుడు తండ్రితో పాటు గొర్రెలు మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
ఒంగోలు నగరంలోని ఏకేవీకే జూనియర్ కళాశాలలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ముగిసింది. మార్కుల మొత్తం జాబితాను తయారు చేసి కంప్యూటరీకరణ కూడా పూర్తయినట్లుగా అధికారులు తెలిపారు. కాగా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అనేవి చూసి తప్పులు ఉంటే వాటిని సరిచేస్తున్నామని తెలిపారు. కాగా ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ నెల 12వ తేదీన విడుదలవుతాయని అధికారులు ఇప్పటికే తెలిపారు.
Sorry, no posts matched your criteria.