Prakasam

News April 12, 2026

మార్కాపురం జిల్లాలో 5వేల ఏళ్లనాటి రహస్యాలు..!

image

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో 2023న ఓ అద్భుతమైన చారిత్రక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. నవీన శిలాయుగం కాలంనాటి ఆదిమానవుల రాతి చిత్రాలు, హంప్డ్ ఎద్దుల బొమ్మలు, సమాధి గదులు పరిశోధకులు ఇక్కడ కనుగొన్నారు. 5వేల ఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో మానవ నాగరికత విరాజిల్లిందని, వారు పశువులను పూజించేవారని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు మరిన్ని ఆదారాలు తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు.

News April 11, 2026

మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు రూ.1.28కోట్లు

image

మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ఇటీవల ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1.28 కోట్లు విడుదల చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 14 మందికి రూ.5 లక్షలు, గాయపడిన 29 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు.. మొత్తం రూ.1.28 కోట్లు ఇవ్వనున్నారు.

News April 11, 2026

ప్రకాశం: ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

ఒంగోలులో ఒపెన్ ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధమైంది. స్థానిక D.R.R.M మున్సిపల్ హైస్కూల్‌లో ఈనెల 11 నుంచి 15 వరకు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ నిర్వహించనున్నట్లు DEO, క్యాంప్ ఆఫీసర్ P.V రేణుక తెలిపారు. అయితే త్వరలో వెలువడనున్న ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News April 11, 2026

ప్రకాశం: పెన్షన్ ఫ్రాడ్‌లపై SP హెచ్చరిక

image

పెన్షన్ ఫ్రాడ్‌లపై అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని.. బ్యాంకు అధికారులమని చెప్పి ఓటీపీలు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అడిగి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎవరూ వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

News April 10, 2026

నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌పై జాగ్రత్త: SP

image

ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా మోసాలు పెరుగుతున్నట్లు హెచ్చరించారు. Facebook, Instagram, Twitterలో తెలిసిన వారి పేర్లతో ఫేక్ అకౌంట్లు సృష్టించి డబ్బులు అడుగుతున్నారని అన్నారు. అలాంటి సందేశాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఫోన్ చేసి నిర్ధారించుకోవాలని సూచించారు. మోసానికి గురైతే 1930కు కాల్ చేయాలని, లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

News April 10, 2026

ప్రకాశం: ఐరన్ ఓర్ నిక్షేపాల గుర్తింపు

image

కందుకూరు నియోజకవర్గం VVపాలెం, లింగసముద్రం మండలాల్లో ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారణైంది. నాణ్యమైన మాగ్నటైట్ ఐరన్ ఓర్ ఉన్నట్లు గుర్తించారు. JSW గ్రూప్‌‌నకు కాంపోజిట్ లైసెన్స్ లభించగా తవ్వకాలకు సిద్ధమవుతోంది. భూముల సేకరణను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. 2187 చ.కి.మీ విస్తీర్ణంలో నిక్షేపాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక్కడ ప్రభుత్వ, అటవీ, ప్రైవేట్ భూములు ఉన్నాయి.

News April 10, 2026

మార్కాపురంలో ఏప్రిల్ 11న పూలే జయంతి: కలెక్టర్

image

మహాత్మా జ్యోతి బాపూలే జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 11వ తేదీన మార్కాపురంలోని తర్లుపాడు రోడ్డులోని విద్యుత్ కార్యాలయం వద్ద పూలే జయంతి వేడుకలు జరపనున్నట్లు తెలిపారు. అదే విధంగా కలెక్టరేట్‌లో కూడా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.