India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు లబ్ధిదారులకు అందేలా దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. శుక్రవారం ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా పరిషత్, గ్రామ సచివాలయాలు, నైపుణ్యాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
గిద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన సిబ్బంది వెంటనే 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పుల్లలచెవు మండలంలోని మానేపల్లికి చెందిన టి.ఆదిలక్ష్మి 108 వాహనంలో శుక్రవారం సుఖ ప్రసవం అయ్యింది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పు కోసం 108 వాహనంలో యర్రగొండపాలెం ఆసుపత్రికి వస్తున్న సమయంలో రామసముద్రం సమీపంలో నొప్పులతో బాధపడుతుండగా సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది వెన్నా గాలిరెడ్డి, దుపాటి శ్రీను తెలిపారు.
108 వాహనాలలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) వాహనాల్లో డ్రైవర్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మేనేజర్ బాలకృష్ణ ప్రకటన విడుదల చేశారు. EMT పోస్టులకు BSC లైఫ్ సైన్స్, నర్సింగ్. బి.ఫార్మసీ, GNM ఉత్తీర్ణత సాధించిన వాళ్లు అర్హులవుతారు. 10th పాసై, హెవీ వెహికల్ లైసెన్స్ కలిగి ఉన్నవారు డ్రైవర్ పోస్టులకు అర్హులని తెలిపారు. ఈనెల 27 తుది గడువని ఆయన ప్రకటించారు.
రాచర్ల మండలం జెపి చెరువు గ్రామ సమీపంలో ఉన్న శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం ఎంతో పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. ప్రతి శనివారం ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. ఆలయానికి వచ్చే భక్తులు శుద్ధిగా లేకపోతే ఆలయ సమీపంలో ఉండే తేనెటీగలు వారిని కుట్టి ఆలయ ప్రాంగణం నుంచి తరిమేస్తాయని ఇక్కడి వారి నమ్మకం. అందుకే భక్తులు శుద్ధిగా వచ్చి దైవదర్శనం చేసుకుంటారు.
ఒంగోలులోని రూడ్ సెట్ సంస్థలో ఆగస్టు 2వ తేదీ నుంచి పురుషులకు కంప్యూటర్ శిక్షణ ఉచితంగా ఇవ్వబడునని సంస్థ డైరెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఈ శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ పురుషులు అర్హులన్నారు. అలాగే 18 -45 సంవత్సరాలు వయసు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండవలెను, ఈ శిక్షణ కాలంలో శిక్షణతో పాటు భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పించబడతాయన్నారు.
డీఈఐఈడీ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి మొదటిసారి ఫెయిలైన విద్యార్థులు(2018-20) ఆగస్టు 4వ తేదీలోగా ఫీజు చెల్లించాలని డీఈఓ సుభద్ర తెలిపారు. నాలుగు సబ్జెక్టులకు రూ.150, మూడు సెబ్జెక్టులకు 140, రెండు సబ్జెక్టులకు రూ.120. ఒక సబ్జెక్టుకు రూ.100 అపరాధ రుసుం లేకుండా ఆగస్టు 4వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు. అపరాధ రుసుం రూ.50తో ఆగస్టు 19వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.
జిల్లాలో ఈ ఏడాది మార్చి 3వ తేదీన నిర్వహించిన ప్రొఫెషనల్ అడ్వాన్స్ మెంట్ టెస్ట్ (పీఏటీ) పరీక్షా ఫలితాలు బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డీ. సుభద్ర తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ పరీక్షా ఫలితాలను చూసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని విద్యార్థులందరూ గమనించాలని సూచించారు.
మార్కాపురంలో అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. స్థానిక గడియారస్థంభం వద్ద ఉన్న హాల్ సేల్ పూల దుకాణంలో దొంగలు చోరీకి తెగబడ్డారు. దుకాణం షట్టర్ తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.1.50 లక్ష నగదు అపహరించినట్లు దుకాణ యజమాని ఖాజాహుస్సేన్ పోలీసులకు పిర్యాదు చేశాడు. దొంగతనం జరిగిన షాప్ ఎదురుగానే పోలీసు స్టేషన్ ఉండడం గమనార్హం. అయితే బాగా తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్లను మరొక జిల్లాకు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఆ మేరకు బదిలీపై ప్రకాశం జిల్లా వచ్చిన 34 మంది తహశీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ తమిమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన తహశీల్దారులు వారి బాధ్యతలను కార్యాలయంలోని ఉప-తహసీల్దారులకు అప్పగించాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.