Prakasam

News January 29, 2026

కంభం: గ్రూప్-2 ఉద్యోగం సాధించిన దంపతులు

image

కంభం పట్టణానికి చెందిన ఓరుగంటి హేమచంద్ర, వినత దంపతులు గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో హేమచంద్ర ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్‌గా ఎంపిక కాగా.. ఆయన భార్య వినత సబ్ రిజిస్ట్రార్‌గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని వారి కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు.

News January 28, 2026

అర్థవీడులో అధికారుల దాడులు

image

అర్థవీడులో మల్లికార్జునరావు ట్రేడర్స్‌లో ఒంగోలు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా లైసెన్స్‌లను, స్టాక్ రిజిస్టర్ బిల్ బుక్స్‌ను పరిశీలించారు. ఈ తనిఖీలు స్టాక్ రిజిస్టర్ నందు, ఈపాస్ మెషిన్ నందు స్టాకు వ్యత్యాసం ఉన్నందున రూ.4,31108 ఎరువులను అమ్మకపు నిలుపుదల చేయడం జరిగిందన్నారు.

News January 28, 2026

ప్రకాశం: మూడు బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో 2025-28 మధ్య కాలానికి గాను బార్ల లైసెన్సుల మంజూరుకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి షేక్. ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడారు. ఒంగోలు మున్సిపల్ పరిధిలో ఒకటి, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 4 సాయంత్రం 6 లోగా దరఖాస్తు చేయాలన్నారు.

News January 28, 2026

గ్రూప్ – 2 ఫలితాల్లో సత్తా చాటిన ప్రకాశం పోలీసులు

image

తాజాగా విడుదలైన గ్రూప్ – 2 ఫలితాలలో ప్రకాశం పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుళ్లు తమ సత్తా చాటారు. 2018 సివిల్ పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైన కే. అశోక్ రెడ్డి, కే .వెంకటేశ్వర్లు, సూర్య తేజలు గ్రూప్ – 2 ఫలితాలలో పలు ఉద్యోగాలను సాధించారు. అశోక్ రెడ్డి డిప్యూటీ తహశీల్దారుగా, ఎక్సైజ్ ఎస్సైలుగా వెంకటేశ్వర్లు, సూర్య తేజలు ఎంపికయ్యారు. వీరికి తోటి సిబ్బందితో పాటు అధికారులు అభినందనలు తెలిపారు.

News January 28, 2026

గ్రూప్ -2లో ప్రకాశం వాసుల ప్రతిభ

image

గ్రూప్ -2 ఫలితాలలో ప్రకాశం జిల్లా వాసులు సత్తా చాటారు. CS పురానికి చెందిన నవీన్ యాదవ్ వెలిగండ్లలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పని చేస్తూ గ్రూప్-2 పరీక్షలు రాసి డిప్యూటీ తహశీల్దార్‌గా ఎన్నికయ్యారు. అలాగే కనిగిరికి చెందిన మహమ్మద్ సమీర్ టీచర్ పని చేస్తూ.. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. వీరి విజయం కుటుంబంలో సంతోషాన్ని నింపుతోంది.

News January 28, 2026

ప్రకాశం: రైలొచ్చిందంటే..అన్నీ అవుతాయ్.!

image

నడికుడి-శ్రీకాళహస్తి కొత్త రైల్వే‌లైన్ ప్రాజెక్ట్‌తో ఎన్నో దశాబ్దాల కల నెరవేరనుంది. దీంతో ఎన్నో గ్రామాల ఆశ ఇప్పుడు పట్టాల మీద పరుగులు తీస్తోందని BJP ‘X’ వేదికగా ట్వీట్ చేసింది. ఇప్పటికే 88.65 KM పూర్తైన రైల్వే లైన్‌తో దర్శి, పొదిలి, కనిగిరి, ఆత్మకూరు, రాపూరులు భారత రైల్వే మ్యాప్‌పై గర్వంగా నిలుస్తున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం పట్టాలు వేసింది రైలుకే కాదు.. బంగారు భవిష్యత్తుకి అని ‘X’లో కొనియాడారు.

News January 28, 2026

ప్రకాశంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

image

జిల్లాలో వినూత్నమైన కార్యక్రమానికి కలెక్టర్ రాజాబాబు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని హాస్టల్, పాఠశాలల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపేలా వన్ ఆఫీసర్ – వన్ ఇన్స్టిట్యూట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంగళవారం కలెక్టర్ పిలుపునిచ్చారు. దీనితో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు ముగింపు పడేలా కార్యక్రమం దోహదపడుతుందన్నారు. అలాగే 10th విద్యార్థులను వందరోజుల ప్రణాళికతో చదివించాలన్నారు.