India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఫిబ్రవరి రెండవ తేదీన ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించే అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలికంగా కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లికి చెందిన కసుకుర్తి కార్తిక్(23) ఒంగోలు IIIT క్యాంపస్‌లో B.Tech పూర్తిచేశాడు. అనంతరం గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతూ.. ఇటీవల విడుదల చేసిన గ్రూప్-2 తుది ఫలితాల్లో మొదటి ప్రయత్నంలోనే ASO (GAD)గా ఉద్యోగం పొందాడు. దీంతో ఉపాధ్యాయులు, తోటి స్నేహితులు, తల్లిదండ్రులు అభినందించారు. కార్తిక్ తండ్రి ట్రాక్టర్ డ్రైవర్ కాగా, తల్లి కూలీ పనులకు వెళ్తుంటారు.

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ పోలీస్ విధుల నిర్వహణకు సంబంధించిన డైరీని ఆవిష్కరించారు. రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తయారుచేసిన డైరీని, పోలీస్ సంక్షేమ సమాచార దీపికను ఎస్పీ ఆవిష్కరించి సిబ్బందికి అందజేశారు. డైరీలో పోలీసు అధికారులకు, సిబ్బందికి అవసరమయ్యే అన్ని రకాల సమాచారాన్ని పొందుపరచడంపై ఎస్పీ అభినందనలు తెలిపారు.

ప్రకాశం జిల్లా జేసీగా కల్పనా కుమారి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబును జేసీ కల్పనకుమారి మర్యాదపూర్వకంగా కలిశారు.

అక్రమ మద్యం కేసులో బెయిల్ పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇన్‌ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేడు ఒంగోలుకు రానున్నట్లు జిల్లా వైసీపీ కార్యాలయం ప్రకటించింది. నాలుగు గంటలకు జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి ఏం మాట్లాడతారన్న చర్చ జోరుగా సాగుతోంది.

ప్రకాశం జిల్లాలో పొడి చెత్త నిర్వహణను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రవేశ పెట్టిన స్వచ్చ రథం ఆపరేటర్ల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీపీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 7 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. మొత్తం 22 మండలాల పరిధిలో కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు, ఆపరేటర్లు మూడు సంవత్సరాల స్క్రాప్ నిర్వహణ అనుభవం, ట్రేడ్ లైసెన్స్ సైతం కలిగి ఉండాలని సూచించారు.

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, పదివేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు గురువారం తీర్పునిచ్చింది. సింగరాయకొండకు చెందిన హరి అనే వ్యక్తి, ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 2019 జనవరి 14న కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరు పరచగా శిక్ష ఖరారు చేశారు. సంబంధిత పోలీసులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.

జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేసేందుకు పైప్ లైన్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ పి.రాజబాబు అధికారులను ఆదేశించారు. గురువారం ప్రకాశం భవనంలో ఆయన అధ్యక్షతన జిల్లా వాటర్ – శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ పనుల్లో పురోగతిని ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. నాగేశ్వరరావు ఈ సందర్భంగా వివరించారు. అనంతరం జలజీవన్ మిషన్ గురించి కలెక్టర్ చర్చించారు.

Sorry, no posts matched your criteria.