Prakasam

News January 27, 2026

కనిగిరి మీదుగా రైలు.. 30న ట్రయల్ రన్.!

image

కనిగిరి ప్రాంత వాసుల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరనుంది. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కనిగిరి రైల్వే స్టేషన్‌కు పలుమార్లు గూడ్స్ రైళ్లు రైల్వే సామాగ్రీ తీసుకొచ్చాయి. 30న ట్రయల్ రన్ వేయనున్నారు. కనిగిరి- శంకవరం క్వారీల మధ ట్రాక్‌ ఏర్పాటుకు కొన్ని ఇబ్బందులు రాగా చివరికి గ్రీన్ సిగ్నల్ పడింది. స్టేషన్‌‌కు 300 మీటర్ల దూరంలో హైవే ఏర్పాటు కావడం గమనార్హం.

News January 26, 2026

ప్రకాశం జిల్లాలో 104 పోస్టులకు 5వేలమంది పోటీ

image

ప్రకాశం జిల్లాలోని KGVBల్లో 104 నాన్ టీచింగ్ పోస్టులకు 5,018 దరఖాస్తులు వచ్చాయి. పీజీ చదివిన వాళ్లు సైతం వీటికి అప్లై చేశారు. అటెండర్ పోస్టుకు 511 మంది, వాచ్‌మెన్ పోస్టుకు 246మంది, 12 వార్డెన్ పోస్టులకు 589 మంది, 9 పార్ట్‌టైం టీచర్ పోస్టులకు 234మంది దరఖాస్తు చేసుకున్నారు. 12 కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు 1,124మంది, 11 హెడ్ కుక్ ఉద్యోగాలకు 356మంది అప్లై చేయడం విశేషం.

News January 26, 2026

ప్రకాశం: వీడియోలు తీసి పోలీసులకు పంపండి!

image

ప్రకాశం జిల్లాలో ఓపెన్ ప్లేస్‌లో మద్యం తాగడాన్ని నిషేధించారు. ఎవరైనా మద్యం తాగుతూ పోలీసులకు దొరికితే ఆ ఏరియాలోని మందు బాటిళ్లను క్లీన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వారిపై కేసులు సైతం నమోదు చేస్తారు. పోలీసులు ఎక్కడో ఉండి డ్రోన్ కెమెరాతో మద్యం తాగేవారిని పట్టేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం తాగుతూ మీకు కనిపిస్తే వీడియో తీసి 9121102266 నంబర్‌కు వాట్సప్‌లో పంపితే వారిపై చర్యలు తీసుకుంటారు.

News January 25, 2026

బెస్ట్ ఎలక్టోరల్ అవార్డు అందుకున్న ప్రకాశం కలెక్టర్

image

బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును ప్రకాశం జి్లా కలెక్టర్ రాజాబాబు ఆదివారం అందుకున్నారు. ప్రకాశం జిల్లా తరపున విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వివేక్ యాదవ్, చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతులమీదుగా ఉత్తమ అవార్డును జిల్లా కలెక్టర్ రాజాబాబు అందుకోగా పలువురు కలెక్టర్‌లు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ప్రకాశం కలెక్టర్‌గా తన పాలన ద్వారా స్పెషల్ మార్క్‌ను కలెక్టర్ చూపారు.

News January 25, 2026

ప్రకాశం: విద్యుత్ వినియోగదారులకు గమనిక

image

ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు ఆదివారం విద్యుత్ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు కీలక సూచన చేశారు. ఒంగోలులోని విద్యుత్ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. నేడు, రేపు సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులను చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని విద్యుత్ బిల్లుల కేంద్రాలు అందరికీ అందుబాటులో ఉంటాయని, విద్యుత్ బిల్లులను చెల్లించాలని సూచించారు.

News January 25, 2026

ప్రకాశం: వీటి విషయంలో జాగ్రత్త.!

image

ఏ ఉత్సవానికైనా పటాకుల పేలుళ్లు కచ్చితంగా మారాయి. అయితే వాటి విషయంలో కొంతమంది వహిస్తున్న నిర్లక్ష్యంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల కడపలో జరిగిన శోభాయాత్రలో సెక్యూరిటీ గార్డ్ <<18946125>>హరి శంకర ప్రసాద్(52)<<>> పటాకులు తన శరీరంపై పేలడంతో చనిపోయారు. అయితే పటాకులు పేలుస్తున్న వారి నిర్లక్ష్యం వల్ల వాటికి దూరంగా ఉన్న హరి దగ్గరకు అవి వచ్చి పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. అందుకే ‘సోదరా పటాకుతో జాగ్రత్త’గా ఉండండి.

News January 24, 2026

పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ సహకారం: కలెక్టర్

image

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. శనివారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో ప్రకాశం, మార్కాపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలతో కలెక్టర్ మాట్లాడారు. చీమకుర్తి, దర్శి, పొదిలి ప్రాంతాలలో సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News January 24, 2026

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ‘ఎస్పీ మీకోసం’ కార్యక్రమం రద్దు: SP

image

జనవరి 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు, ఆయా జిల్లాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News January 24, 2026

ప్రకాశం: స్కూల్ బస్సు ఢీ.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఉల్లగల్లుకి చెందిన తప్పెట చిన్ని ఒంగోలులో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. భార్య రాజ్యంతో కలిసి స్కూటీపై ఉల్లగల్లులోని బ్యాంకు పని చూసుకోని వెళ్తున్నారు. శంకరాపురం- తిమ్మాయపాలెం మధ్యలో స్కూల్ బస్ స్కూటీని ఢీకొంది. ఈ ఘటనలో చిన్ని అక్కడికక్కడే చనిపోయాడు. రాజ్యానికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

News January 24, 2026

మార్కాపురం: రెండు బస్సులు ఢీ.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు

image

మార్కాపురం జిల్లా పెద్దారికట్ల జంక్షన్ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొద్దుటూరు నుంచి విజయవాడ వెళ్తున్న వాసవి ట్రావెల్స్ బస్సు, విజయవాడ నుంచి కనిగిరి వస్తున్న ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, సుమారు 10 మంది గాయపడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.