Prakasam

News April 6, 2024

ప్రకాశం: ఈతకు వెళ్లి ఇద్దరి యువకులు మృతి

image

దొనకొండ మండలంలోని ఇండ్లచెరువులో శనివారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మన్నెం వెంకటేశ్వర్లు, పత్తి వెంకటేశ్వర్లు అనే ఇద్దరు యువకులు మల్లెల వాగు వద్ద భారీగా తీసిన నీటి గుంతలో ఈతకు వెళ్లి మృతి చెందారు. ఓకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు చేపట్టారు.

News April 6, 2024

అద్దంకి :17 మంది వాలంటీర్లు రాజీనామా

image

అద్దంకి మండలంలోని ధేనువకొండ గ్రామానికి చెందిన 17 మంది వాలంటీర్లు శనివారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అనంతరం అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్న హనిమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. స్వచ్ఛందంగా ప్రజా సేవలు చేస్తుంటే తమపై రాజకీయ బురదజల్లడంతో మనస్తాపం చెంది రాజీనామా చేసే వాలంటీర్లు పేర్కొన్నారు.

News April 6, 2024

పశ్చిమ ప్రకాశంలో తాండవం చేస్తున్న నీటి కొరత

image

వేసవి కాలం ఆరంభంలోనే పశ్చిమ ప్రకాశంలో నీటి కొరత తాండవం చేస్తోంది. యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం తదితర 8 మండలాల పరిధిలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులు భావించినప్పటికీ సాధ్యపడలేదు. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆందోళనలతో ప్రభుత్వం రోజుకు మనిషికి 40 లీటర్ల నీటిని సరఫరా చేస్తోంది. వీటిని 70 లీటర్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

News April 6, 2024

పర్చూరు నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యే లక్ష్మీపద్మావతి

image

పర్చూరు నియోజకవర్గంలో 1999 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి టీడీపీ తరపున పోటీచేసి విజయం సాధించారు. దీంతో ఆమె పర్చూరు నియోజకవర్గంలో తొలి మహిళా ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. దీంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తొలి మహిళా మంత్రిగా మరో గుర్తింపు పొందారు.

News April 6, 2024

నెహ్రూ మెచ్చిన పర్చూరు నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే కొల్లా రామయ్య

image

పర్చూరు మండల పరిధిలోని నాగుల పాలెంకు చెందిన కొల్లా రామయ్య 19 ఏళ్ల ప్రాయంలో భారత జాతీయ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కమ్యూనిస్టు యోధుడు కొల్లా వెంకయ్యను ఓడించారు. కమ్యూనిస్టు ప్రభావం ఉన్న తరుణంలో అంతటి ఉద్దండుని ఓడించిన కొల్లా రామయ్య దేశ రాజకీయాల్లో సంచలనంగా మారారు. అప్పటి ప్రధానిగా ఉన్న నెహ్రూ కొల్లా రామయ్యను ప్రత్యేకంగా అభినందించారు.

News April 6, 2024

గిద్దలూరులో వాడి వేడిగా మారిన రాజకీయాలు

image

గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. వైసీపీ నుంచి కుందూరు నాగార్జునరెడ్డి, టీడీపీ నుంచి ముత్తుముల అశోక్ రెడ్డి రేసులో ఉండగా ఇప్పుడు తాజాగా జనసేన రెబల్ అభ్యర్థిగా ఆమంచి స్వాములు బరిలో నిలుస్తున్నట్లు శుక్రవారం కంభంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమంచి వెల్లడించారు. దీంతో గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయ చర్చ వాడివేడిగా మారింది. దీంతో గిద్దలూరులో ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి.

News April 6, 2024

ప్రకాశం: మహిళపై గడ్డపారతో దాడి.. ఏడాది జైలు శిక్ష

image

ప్రహరీ వివాదంలో మహిళపై గడ్డపారతో దాడిచేసిన వ్యక్తికి న్యాయస్థానం ఏడాది పాటు జైలు శిక్ష రూ.200 జరిమానా విధించింది. గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో నరేంద్ర తన స్థలంలో ప్రహరీ నిర్మిస్తుండగా వెంకటసుబ్బయ్య గడ్డపారతో దాడి చేశాడు. పక్కనే ఉన్న నరేంద్ర భార్య రమణమ్మ తలకు తగిలి గాయమైంది‌. ఈ ఘటనపై గిద్దలూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ అనంతరం జడ్జి మేరీ నిందితునికి ఏడాదిపాటు పాటు శిక్ష విధించారు.

News April 6, 2024

ప్రకాశం: కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

image

ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ను నూతనంగా జిల్లాకు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుమిత్ సునీల్ ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఎస్పీ పూల బొకేను అందజేశారు. అనంతరం రాబోయే ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో గల పరిస్థితుల గురించి సుదీర్ఘంగా కలెక్టర్‌తో ఎస్పీ చర్చించారు.

News April 5, 2024

ప్రకాశం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఇలా! 

image

వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలోకి శనివారం ప్రవేశించనుంది. ఆ యాత్ర ఇలా సాగనుంది. ఉదయం 9 గంటలకు నెల్లూరు జిల్లా కావలిలో సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఏలూరుపాడు, ఉలవపాడు, సింగరాయకొండ, ఓగురు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బసకు చేరుకుంటారని సీఎం ప్రోగ్రాంల కోఆర్డినేటర్ తలశిల రఘురాం చెప్పారు.

News April 5, 2024

అద్దంకిలో 21 మంది వాలంటీర్లు రాజీనామా

image

అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామానికి చెందిన 14 మంది వాలంటీర్లు, కొరిశపాడు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన 7 మంది వాలంటీర్లు శుక్రవారం రాజీనామా చేశారు. అనంతరం వారు అద్దంకిలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి హనిమిరెడ్డిని కలిసి తమ మద్దతు తెలియజేశారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సేవలు కొనసాగిస్తామని పలువురు వాలంటీర్లు తెలియజేశారు.