Prakasam

News December 26, 2024

REWIND: ‘ప్రకాశం జలప్రళయానికి 35 మంది బలి

image

సునామీ ఈ పేరు వింటేనే ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న ప్రకాశం జిల్లాలో సునామీ పంజా విసిరింది. ఈ ధాటికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 35 మంది మృతి చెందారు. కళ్లెదుటే కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న పరిస్థితులను ఇప్పుడు తలచుకుంటే.. ఆ భయం అలానే ఉందని జిల్లా వాసులు పేర్కొంటున్నారు.

News December 25, 2024

ఎందుకింత కక్ష…? చంద్రబాబు: ఎమ్మెల్యే తాటిపర్తి

image

ఎందుకింత కక్ష చంద్రబాబు అంటూ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ‘కేవలం వైఎస్ జగన్ హయాంలో నియమితులైనవారని సచివాలయ వ్యవస్థపైన కక్ష గట్టి వారి జీతానికి బయోమెట్రిక్ అటెండెన్స్ లింక్ చేశారు. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ రంగంలోని అన్ని శాఖల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయగలరా?, ఈ వయసులో కడుపు మంట ఎందుకు?’ అంటూ Xలో పోస్ట్ చేశారు.

News December 25, 2024

ప్రకాశంలో మొదటి సారి భూ ప్రకంపనలు ఎప్పుడు వచ్చాయంటే?

image

ప్రకాశం జిల్లాలోని తాళ్ళూరు, ముండ్లమూరు మండలాల్లో గత మూడు రోజులుగా 7 సార్లు భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మన జిల్లాలో 1800వ సంవత్సరం నుంచి తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా 1905, 2016, 2021, 2023లో ఒంగోలు, బల్లికురవలో భూమి కంపించింది. మైనింగ్, భూగర్భజలాలు తోడేయడం భూప్రకంపనలకు కారణం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది

News December 25, 2024

తైక్వాండోలో సింగరాయకొండ విద్యార్థినికి గోల్డ్ మెడల్

image

ఢిల్లీలో జరిగిన నేషనల్ తైక్వాండో ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన  ఇంటర్ విద్యార్థిని లీలామైత్రిని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మంగళవారం సింగరాయకొండలో  అభినందించారు. లీలామైత్రి సింగరాయకొండలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలా లీలామైత్రి చక్కని ప్రతిభ చూపడం గర్వనీయమని అభినందించారు

News December 24, 2024

ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం ఎస్పీ  

image

జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ క్రిస్మస్ పండుగ  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచానికి శాంతిని ప్రబోధించిన ఏసుక్రీస్తు మార్గం ఆచరణీయమైనదనీ, ప్రజలందరూ శాంతి, సంతోషాలతో, ప్రశాంత వాతావరణంలో  జరుపుకోవాలని కోరారు.

News December 24, 2024

టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి.. 33 మందిపై కేసులు

image

కొమరోలు మండలంలోని ముత్తరాసు పల్లె గ్రామంలో ఇరువర్గాల పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్న సంఘటనపై కేసులు నమోదు చేసినట్లుగా కొమరోలు ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం రాజకీయ కక్ష్యల నేపథ్యంలో ఇరువర్గాలు రాళ్లతో దాడులు చేసుకోగా ఇరువర్గాల ఫిర్యాదు మేరకు టీడీపీకి చెందిన 14 మందిపై, వైసీపీకి చెందిన 19 మందిపై కేసులు నమోదు చేసినట్లుగా వెల్లడించారు.

News December 24, 2024

వినియోగదారుల హక్కులపై అవగాహన ఉండాలి: బాపట్ల జేసీ

image

వినియోగదారుల హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. మంగళవారం బాపట్ల కార్యాలయంలోని గ్రీవెన్స్ హాల్ ప్రాంగణంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు.  వినియోగదారులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. వినియోగదారులు అమ్మకాలు, కొనుగోలులో ఇబ్బందులు కలిగితే వినియోగదారుల ఫారం ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News December 24, 2024

ప్రకాశం: ఆ ప్రాంతంలోనే వరుస భూ ప్రకంపనలు

image

ప్రకాశం జిల్లాలో గత 3రోజులుగా వరుస భూ ప్రకంపనలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ దర్శి నియోజకవర్గంలోనే ఈ ప్రకంపనలు సంభవించడం గమనార్హం. 21వ తేదీన మొదటిగా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో, 22న సింగన్నపాలెం, మారెళ్లలో, 23న తాళ్లూరు, విఠలాపురం, కొత్తపాలెం, ముండ్లమూరు, పసుపుగల్లు గ్రామాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇలా గత 3 రోజులుగా 7సార్లు భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

News December 24, 2024

బాధితులకు న్యాయం అందించేలా చూడాలి: ప్రకాశం ఎస్పీ

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 68 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజలు సమస్యలను చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.

News December 23, 2024

తాళ్లూరులో మళ్లీ కంపించిన భూమి

image

తాళ్లూరు మండలంలో సోమవారం‌ రాత్రి 8 గంటల సమయంలో పది నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. తాళ్లూరు, విఠలాపురం, కొత్తపాలెం, ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామాలలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇలా ఒకే రోజు మూడు సార్లు భూకంపం‌ రావడం, మూడు రోజుల నుంచి రోజూ భూమి కంపించడం గమనార్హం.