India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా జరిగేందుకు కమిటీ సభ్యులు సహకరించాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు. అల్లర్లు, ఘర్షణలకు తావు లేకుండా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాలు ఏర్పాటు చేస్తున్న సభ్యులు https://ganeshutsav.netలో అనుమతులు పొందాలని సూచించారు.
గార(M) అంపోలులో దంపతుల <<17502057>>ఆత్మహత్య<<>> ఘటనపై జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు ఖండించారు. పెన్షన్ నిలిచిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం ఆర్డీవో, గార తహశీల్దార్ విచారణలో ఈ విషయం బయటపడిందన్నారు. గ్రామస్థుల వాంగ్మూలం ప్రకారం.. కుటుంబ అంతర్గత ఆస్తి, ఇంటికి సంబంధిత వివాదాలే వారి మృతికి ప్రధాన కారణమని నిర్ధారించారు.
ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.
నరసన్నపేట మండల కేంద్రంలో ఉన్న పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ జిల్లా జేడీ త్రినాథ స్వామి తమ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆదివారం జరిగిన ఈ సోదాల్లో ఏడీ వెంకట మధు, ఏవో సూర్య కుమారిలు ఉన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌లోకి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జేడీ దుకాణదారులకు హెచ్చరించారు. రైతులకు అందుబాటులో ఎల్లవేళలా ఎరువులు ఉంచాలన్నారు.
పింఛన్ రద్దై మనస్థాపం చెందిన కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన గార (M) అంపోలులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..గ్రామస్థుడు అప్పారావు(అంధుడు)కు వస్తున్న దివ్యాంగ పెన్షన్ రద్దైనట్లు ఇటీవల నోటీసులొచ్చాయి. ఆర్థికంగా సతమతమైన అప్పారావు భార్య లలిత, కుమార్తె దివ్య(17)లతో కలిసి శనివారం రాత్రి భోజనంలో ఎలుకల మందు కలుపుకొని సూసైడ్ చేసుకున్నారు. భార్యాభర్తలు మృతి చెందగా కుమార్తె చికిత్స పొందుతోంది.
దక్షిణ కాశీగా శ్రీ ముఖలింగేశ్వర ఆలయం పేరుగాంచింది. ఈ దేవాలయంలోని శిల్ప సంపదను కాపాడాలని అర్చకుడు రాజశేఖర్ మాన్యుమెంట్ అథారిటీ ఛైర్మన్‌ను శనివారం ఢిల్లీలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంలోని పురాతన శాసనాలు, కట్టడాలు పెచ్చులూడి శిథిలమవుతున్నాయని వివరించారు. అభివృద్ధికి చేసేందుకు అడుగులు వేయాలని ఆయను కోరారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని రాజశేఖర్ తెలిపారు.
ఇటీవల విడుదలైన 2025 డీఎస్సీ ఫలితాల్లో బూర్జ మండలం అన్నంపేట గ్రామానికి చెందిన మీసాల గోవిందరావు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ విభాగంలో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఈ విజయం పట్ల తల్లిదండ్రులు గ్రామస్థులు , స్నేహితులు గోవిందరావును అభినందించారు.
తీర ప్రాంత మహిళలకు ఆర్థిక స్వావలంబన, ఉపాధి భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. సోంపేట మండలం మూలపొలం గ్రామంలో, సముద్రపు నాచుసాగు పైలట్ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో శనివారం కలెక్టర్, స్థానిక మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ పద్ధతి ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చునని సీఎం చెప్పారు. కలెక్టర్, మహిళలు ఇక్కడి పరిస్థితులను సీఎంకు వివరించారు.
మెగా డీఎస్సీ – 2025 ఫలితాలలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బాలి అప్పలరాజుకు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్‌గా స్టేట్ 12వ ర్యాంకు సాధించారు. తాను ప్రస్తుతం జి. సిగడాం జెడ్పీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నానని తెలిపారు. అయితే విడుదలైన ఫలితాలలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ స్టేట్ 12వ ర్యాంకుతో పాటు పీజీటీగా స్టేట్ ఏడవ ర్యాంకు కూడా వచ్చిందన్నారు.
నరసన్నపేట మండలం మడపాం వంశధార పేపర్ మిల్లులో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం మిల్లులో నిల్వ చేసిన టన్నుల ఊక ఒక్కసారిగా కార్మికుడు వాసు(45)పై పడిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఇదే గ్రామానికి చెందిన వాడిని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
Sorry, no posts matched your criteria.