India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నరసన్నపేట మండలం సత్యవరంలో విషాదం నెలకొంది. వై.కృష్ణప్రసాద్(25) క్రికెట్ ఆడుతూ మృతిచెందాడు. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఇతను ఈ నెల 27న స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఆడుతూ అలసట ఉందని తన గదికి వచ్చేశాడు. గుండెపోటు రావడంతో స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మంగళవారం సత్యవరంలో అంత్యక్రియలు చేపట్టారు.
సీఎం చంద్రబాబు ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో నవంబర్ 1న పర్యటించనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. జిల్లా పర్యటనకు సీఎం రానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆ గ్రామానికి చేరుకొని టెక్కలి ఆర్డీవోతో కలిసి, పలు వీధుల్లో పర్యటించారు. సభాస్థలి ప్రదేశాన్ని, గ్రామ పరిసరాలను మరోసారి పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
సీఎం చంద్రబాబు ఇచ్చాపురం మండలం ఈదుపురంలో నవంబర్ ఒకటో తేదీన పర్యటించనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఈదుపురం పర్యటనకు సీఎం రానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆ గ్రామానికి చేరుకొని టెక్కలి ఆర్డిఓతో కలిసి, పలు వీధుల్లో పర్యటించారు. సభాస్థలి ప్రదేశాన్ని, గ్రామ పరిసరాలను మరోసారి పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల అయింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లాలో 16,185 మంది అభ్యర్థులు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థులు ఫైనల్ కీ కోసం https://cse.ap.gov.in/ వెబ్సైట్లో సందర్శించాలి. నవంబర్ 2వ తేదీన ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయనుంది.
సీఎం చంద్రబాబు ఇచ్చాపురం మండలం ఈదుపురంలో నవంబర్ ఒకటో తేదీన పర్యటించనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఈదుపురం పర్యటనకు సీఎం రానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆ గ్రామానికి చేరుకొని టెక్కలి ఆర్డిఓతో కలిసి, పలు వీధుల్లో పర్యటించారు. సభాస్థలి ప్రదేశాన్ని, గ్రామ పరిసరాలను మరోసారి పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లాలో సుమారు 50 వేల ఎకరాలలో సాగు చేస్తున్న జీడి, మామిడి రైతులకు ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందని జిల్లా ఉద్యానాధికారి రత్నాల వరప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం వాటిల్లిన పంటలకు భీమా పరిహారం పథకం అందుబాటులోకి వచ్చిందన్నారు. సంబంధిత మీ సేవా వద్ద వివరాలు జమచేసి ఇన్సురెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా చేపట్టిన ఓటర్ల నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతుందని DRO ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. వచ్చే నెల 23వ తేదీన ఉపాధ్యాయ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేస్తామని అన్నారు. ఆ తర్వాత కూడా దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 8వ తేదీ ఆఖరని తెలిపారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు.
జిల్లావ్యాప్తంగా ఓటర్ల జాబితా-2025 ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశామని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం కలెక్టర్ మందిరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటిపై నవంబరు 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునెందుకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్ష ఫీజు నవంబర్ 11 లోపు చెల్లించాలి. ఈ సందర్భంగా ఇప్పటికీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ అవకాశం కల్పించింది. జిల్లాలో ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా రెగ్యులర్ విద్యార్థులు రూ.125 పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. నవంబర్ 12 నుంచి 18 వరకు రూ.50 అపరాధ రుసుముతో చెల్లించవచ్చు.19- 25తేదీ వరకు రూ.200 రుసుముతో చెల్లించవచ్చు.
నెల్లూరులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన గిన్ని కృష్ణారావు(48) మృతిచెందాడు. గత కొన్నేళ్లుగా నెల్లూరులో రైస్ మిల్లులో పనిచేస్తున్న ఈయన రహదారి దాటుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందాడు. మృతదేహానికి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం సోమవారం రాత్రికి గ్రామానికి తీసుకొచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.