India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం జిల్లాలో శనివారం 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపనుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సరుబుజ్జిలి , సారవకోట, ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, ఎల్. ఎన్.పేట, పాతపట్నం మండలాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాదుకి కొత్తగా ఫ్లై 91 విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ సర్వీసును శుక్రవారం ప్రారంభించారు. ఈ కొత్త సర్వీసు వలన విజయవాడ, హైదరాబాదు నగరాల మధ్య ప్రయాణించే వారికి టైమింగ్స్ విషయంలో మరింత వెసులుబాటు కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.

ఎచ్చెర్ల మండలం కుశాలపురం పంచాయతీ నవభారత్‌కు చెందిన మొదలవలస సంతోశ్(35) ప్రమాదవశాత్తు శుక్రవారం ఉదయం మృతి చెందారు. నవభారత్‌లో తను విధులు నిర్వహిస్తున్న కంపెనీలో ప్రమాదం జరగడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. సంతోశ్‌కి భార్య, కుమారుడు ఉండగా ప్రస్తుతం ఆమె గర్భవతి.

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ మహానాడు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్థల పరిశీలనకు సిద్ధమయ్యారు. రణస్థలంతో పాటు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో కూడా స్థల పరిశీలన చేయనున్నారు. శుక్రవారం ఉదయం పల్లా బృందం భోగాపురం మండలంలో పర్యటించనుంది. వచ్చేనెల 27 నుంచి మహానాడు జరగనుంది.

శ్రీకాకుళం మండలం రాగోలులో చనిపోయిన వారి పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి భూమి కాజేయాలనుకున్న కేసులో 8 మందిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ధర్మాన పద్మావతికి చెందిన సుమారు 0.96 ఎకరాల భూమిపై మోసం చేయడానికి నిందితులు నకిలీ భూ రికార్డులు తయారు చేసి అమ్మకాని ప్రయత్నించారని సీఐ పైడపు నాయుడు తెలిపారు. పద్మావతి భర్త చిన్నవాడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు.

YS రాజశేఖర్ రెడ్డి మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో ఉత్తరాంధ్రలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. YSR మృతి వెనుక జగన్ హస్తం ఉందని బొత్స గతంలో అనుమానం వ్యక్తం చేశారని అనడంతో దుమారం రేగింది. అచ్చెన్న వ్యాఖ్యలను బొత్స కండిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. మావిగాన్ నిర్ణయంతో జగన్ జోకర్‌గా మిగిలారని షర్మిలా చేసిన వ్యాఖ్యలకు YCP MLC వరుదు కళ్యాణి స్పందిస్తూ ఆమె TDPకి అమ్ముడుపోయారని విమర్శించారు.

ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించనున్న ‘పోషణ్ పక్వాడ’ కార్యక్రమం పోస్టర్‌ను కలెక్టరేట్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం ఆవిష్కరించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శాసన సభ్యులు గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sorry, no posts matched your criteria.