India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పలాసలోని మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా యువకుడు పెళ్లయిన 50 రోజులకు మృతి చెందినట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. మండలంలోని గొల్లమాకన్నపల్లికి చెందిన మధు(28) సింగుపురానికి చెందిన ఓ యువతని ప్రేమించి ఫిబ్రవరి 9న పెళ్లి చేసుకున్నాడు. మంగళవారం రాత్రి కోసంగిపురం ప్లై ఓవర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టెక్కలి మండలం చల్లపేట గ్రామానికి చెందిన హనుమంతు కృష్ణారావు(62) అనే వ్యక్తి మంగళవారం రాత్రి పురుగులమందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. తొలుత టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. మృతునికి భార్య భానమ్మ ఉన్నారు.
ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా సంత్రాగచ్చి(SRC), యశ్వంత్‌పూర్(YPR) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 3 నుంచి 24 వరకు ప్రతి గురువారం SRC- YPR(నెం.02863), ఏప్రిల్ 5 -26 వరకు ప్రతి శనివారం YPR- SRC(నెం.02864) మధ్య ఈ ట్రైన్లు నడపనున్నారు. ఈ రైళ్లు ఏపీలోని శ్రీకాకుళం, పలాస, విజయనగరం, దువ్వాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగనున్నాయి.
ఎచ్చెర్ల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బడివానిపేట వీఆర్వో రాజారావు కార్యాలయంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. బుధవారం ఉదయం కార్యాలయానికి ఆయన వచ్చారు. సాయంత్రం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. తక్షణం సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో కెమికల్ ఇంజినీర్లకు విపరీతమైన డిమాండు ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఫార్మా రంగంలో జిల్లా వేగంగా అభివృద్ది చెందుతోందని చెప్పారు. అమరావతిలో బుధవారం సీఎం సమక్షంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన తన జిల్లా ప్రగతి గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో ఫార్మా సంస్థల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో బుధవారం 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఆమదాలవలస-38.1 ఉష్ణోగ్రత, బూర్జ-39, హిరమండలం-39.2, ఇచ్ఛాపురం-37.5, జలుమూరు-38-2, కంచిలి-37.4, కోటబొమ్మాళి-37.5, కొత్తూరు-39.7, ఎల్‌ఎన్ పేట-39 నరసన్నపేట-37.4, పాతపట్నం-38.9, పొందూరు-37.7, సారవకోట-38.4, సరుబుజ్జిలి-38.5, టెక్కలి-37.6 మండలాలకు అలర్ట్ జారీ చేసింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంది.
అమరావతిలో మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించిన అంశాలపై నివేదికలు సమర్పించారు. అలాగే జిల్లాకు అవసరమైన అభివృద్ధి పథకాల గురించి వివరించారు.
శ్రీకాకుళం జడ్పీ కార్యాలయం వెనుక ఉన్న గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం అటెండర్ మల్లారెడ్డి ఆనందరావు (46) మంగళవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కార్యాలయం ఆవరణలో మోటారు వేసేందుకు వెళ్లిన ఆయన షార్ట్ సర్క్యూట్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు.
వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం ఉద్దానం గ్రామంలో ఒక పనసచెట్టుకు కాచిన పనసకాయ LOVE ఆకారంలో ఉండటం చూపరులను ఆకట్టుకుంటుంది. గ్రామానికి చెందిన ఒక రైతుకు చెందిన చెట్టుకు ఈ అరుదైన కాయ కాసింది. కాగా ప్రస్తుతం ఈ ఫొటోను గ్రామస్థులు, యువత సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానంలో ప్రేమ పనస అంటూ ఫొటోను SHARE చేస్తున్నారు.
నందిగాం మండలం కొత్త వీధికి చెందిన పిల్లా శివకుమార్ తూ.గో జిల్లా హుకుంపేటలో ఆదివారం తల్లి కూతుళ్లను హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు సానియా, శివకుమార్‌కు ఓ ఈవెంట్లో పరిచయం ఏర్పడింది. నిందితుడు ఆమె ఫోన్‌లో మరొకరితో చాటింగ్ చేయడాన్ని చూసి సహించని శివకుమార్.. పథకం ప్రకారం ఆ యువతితో పాటు తల్లిని కూడా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది.
Sorry, no posts matched your criteria.