Srikakulam

News March 2, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ 4వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ నాలుగో సెమిస్టర్ షెడ్యూల్‌ను యూనివర్సిటీ డీన్ జి.పద్మారావు శనివారం విడుదల చేశారు. 2020, 2021, 2022, 2023 ఎడ్మిట్ విద్యార్థులు మార్చి 3వ తేదీ నుంచి 14వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజును చెల్లించవచ్చని తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్ మొదటి వారంలో ఉంటాయని తెలిపారు.

News March 2, 2025

SKLM: పెండింగ్ కేసులపై దర్యాప్తు వేగవంతం చేయాలి

image

శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి పోలీసు స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులు దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని ఏఎస్పీలు కెవి రమణ, పి. శ్రీనివాసరావు సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పెండింగ్లో ఉన్న కేసులు, మహిళా సంబంధిత నేరాలు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర కేసులపై నేర సమీక్ష నిర్వహించారు. వీటిపై త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు కోర్టులో చేయాలన్నారు.

News March 1, 2025

శ్రీకాకుళం : ఒక్క నిమిషం .. వారి కోసం..!

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.

News February 28, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ 6 వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల:

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 6 వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఇంటర్న్ షిప్ షెడ్యూల్‌ను యూనివర్సిటీ డీన్ జి.పద్మారావు శుక్రవారం విడుదల చేశారు. వీటి ఫీజుకు ఎటువంటి అపరాధరుసుం లేకుండా మార్చి 13వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలియజేశారు. ఈ ఇంటర్న్‌షిప్ వైవా మార్చి 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉంటాయని చెప్పారు.

News February 28, 2025

SKLM: ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి: DM&HO

image

ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని DM &HO డాక్టర్ టీవీ బాలమురళీకృష్ణ అన్నారు. శుక్రవారం తన పర్యటనలో భాగంగా శ్రీకాకుళంలోని ఆదివారంపేట పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగిన ఎఫ్.ఎం.ఎం కిట్లు పంపిణీలో పాల్గొన్నారు. ఫైలేరియా ( బోదకాలు) రోగులకు పలు సూచనలు చేశారు. రోగులకు ఫైలేరియా మార్బులిటి మేనేజ్మెంట్ కిట్లతో కలిగే ఉపయోగాలను ఆయన వివరించారు.

News February 28, 2025

శ్రీకాకుళం: వీర జవాన్‌కు ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు

image

సంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్ర గ్రామానికి చెందిన డొక్కరి రాజేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డ్ ప్రకటించింది. గతేడాది జులై 15న జమ్మూకశ్మీర్ దొడా జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో డొక్కరి రాజేశ్ గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి రూ.5 లక్షలు రివార్డును ప్రకటిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

News February 28, 2025

శ్రీకాకుళం: నాగావళి వంతెన కింద వ్యక్తి మృతదేహం

image

నాగావళి నది వంతెన కింద వ్యక్తి మృతదేహన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించారు. స్థానికుల కథనం.. శ్రీకాకుళం మండలం తోట పాలెం జంక్షన్ వద్ద ఉన్న నీలమ్మ కాలనీకి చెందిన యాదవ రెడ్డి రాజు (40) గా గుర్తించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 28, 2025

శ్రీకాకుళం: కళ్లు తిరిగి రోడ్డుపై పడి వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం నగరంలోని పందుంపుళ్ల జంక్షన్లో కళ్లు తిరిగి రోడ్డుపై పడిపోయి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. శ్రీకాకుళం వన్ టౌన్ ఎస్సై హరిక్రిష్ణ తెలిపిన వివరాల మేరకు.. విశాఖకి చెందిన ఎం. కోదండరావు (35) శ్రీకాకుళంలోని ఓ పండ్ల షాపులో పని చేస్తుంటాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. షాపులో పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో రోడ్డుపై పడి మృతి చెందాడు.

News February 28, 2025

సోంపేట: భర్త చితికి భార్య దహన సంస్కారాలు

image

సోంపేట మండలం హుకుంపేటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దింటి జానకి రావు గురువారం గుండెపోటుతో మరణించారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో.. భర్త చితికి భార్య దహన సంస్కారాలు చేశారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. 

News February 28, 2025

శ్రీకాకుళంలో మార్చి 3న మెగా జాబ్ మేళా

image

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో మార్చి 3వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ వై పోలినాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కల్పిస్తున్నామన్నారు. ఈ మేళాలో 12 సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని స్పష్టం చేశారు.

error: Content is protected !!