India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివ సాగర్ బీచ్‌ను ఆదివారం భారీగా పర్యాటకులు సందర్శించారు. ఈ క్రమంలో మెలియాపుట్టి మండలం తంగణి గ్రామానికి చెందిన సవర త్రివేణి తన సర్టిఫికేట్స్‌లు ఉన్న బ్యాగ్ మార్చిపోయింది. ఈ విషయాన్ని అక్కుపల్లి శ్రీ రామాసేవా సంఘం వారు గుర్తించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అది చూసి బాధితురాలికి ఆ బ్యాగ్ అప్పగించారు. అక్కడ ప్రజలు శ్రీ రామా సేవాసంఘం సభ్యులను అభినందించారు.
శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.8,15,000/- లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,08,740/-లు, ప్రసాదాల రూపంలో రూ.2,22,670/-లు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని ఈవో చెప్పారు.
జలుమూరు మండలం తిలారు రైల్వే గేటు ఈ నెల 17, 18, 20 తేదీల్లో మూసి వేస్తున్నట్లు రైల్వే సెక్షన్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పలాస నుంచి శ్రీకాకుళం వరకు రైలు మార్గంలో మరమ్మతులు చేపడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ దారిలో ప్రయాణించే వాహనాలు మళ్లింపు చేస్తున్నామని ప్రయాణికులు సహకరించాలని కోరారు.
టెక్కలి మండలం కిట్టాలపాడు గ్రామం సమీపంలో ఈనెల 12వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం మండలం నల్లబొంతు గ్రామానికి చెందిన మామిడిపల్లి సతీష్ (24) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కాగా అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకు వచ్చారు.. శనివారం యువకుడి నేత్రాలు, కాలేయం, మూత్రపిండాలు సేకరించి వివిధ ఆసుపత్రులకు తరలించారు.
శ్రీకాకుళం జిల్లాకు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం వస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రైతాంగానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయన అన్నారు. ఇది వరకూ ఈ కార్యాలయం బొబ్బిలిలో ఉండేదని చెప్పారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసేందుకు రాష్ర్ట మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి ఎంతో ఉందని అన్నారు. రైతాంగానికి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు.
శ్రీకాకుళం నగరంలోని ఏపీ.ఎస్.ఆర్టీసీ డిపో 1 లో శనివారం రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ. విజయకుమార్, డీఎస్పీ వివేకానంద పాల్గొని మాట్లాడారు. రోడ్డు భద్రతా ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. అనంతరం శ్రీకాకుళం,టెక్కలి, పలాస డిపోలో ఎక్కువ కాలం ప్రమాద రహిత డ్రైవర్స్‌గా ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.
తిరుపతి – పూరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ ఎస్కే షరీఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే 9440627567 నంబరుకు సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించామన్నారు.
రణస్థలం మండలం పైడి భీమవరం ఇసుక తనిఖీ కేంద్రం వద్ద 28 లారీలను జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. అందులో 12 లారీలు నకిలీ బిల్లులతో రవాణా అవుతున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆయా లారీలను సీజ్ చేయాలని జేసీ ఆదేశించారు. అనంతరం వాటిని మైన్స్ అండ్ విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. ఈ తనిఖీలో తహశీల్దార్ ఎన్ ప్రసాద్, ఎస్సై చిరంజీవి, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల జాతీయ రహదారిపై కుశాలపురం బైపాస్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సవర నవీన్ (21) మృతి చెందారు. బైక్‌పై శ్రీకాకుళం వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ వెనుక కూర్చున్న కళ్యాణి అనే యువతికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఎస్సై సందీప్ కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇచ్ఛాపురంలోని మండపల్లి సర్పంచ్ శశిరేఖ చెక్ పవర్ రద్దు చేసినట్లు ఎంపీడీవో రామారావు తెలిపారు. రూ. 85 లక్షల వరకు పంచాయతీ నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం డీఎల్ పీవో గోపిబాల, ఈవోఆర్డీ ఎస్. కృష్ణ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఆమె సరైన ఆధారాలు చూపకపోవడంతో చెక్ పవర్ రద్దు చేయాలని డీపీవో భారతి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.