Srikakulam

News March 14, 2025

శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల సౌకర్యార్ధం శ్రీకాకుళం, పలాస మీదుగా షాలిమార్(SHM), విశాఖపట్నం(VSKP) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఈ నెల 16న VSKP- SHM(నం.08577), 17న SHM- VSKP(నం.08578) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు పలాస, శ్రీకాకుళం రోడ్‌తో పాటు విజయనగరం, కొత్తవలస, చీపురుపల్లితో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని ఓ ప్రకటన విడుదల చేశారు.

News March 14, 2025

SKLM: ఈనెల 20న తపాలా అదాలత్

image

శ్రీకాకుళం: పోస్టల్ సేవలకు సంబంధించి వ్యక్తిగత ఫిర్యాదుల కోసం ఈనెల 20న మధ్యాహ్నం 2 గంటలకు తపాలా అదాలత్ నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీ హరిబాబు శుక్రవారం తెలిపారు. ఫిర్యాదులను నేరుగా లేదా పోస్ట్ ద్వారా జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయానికి ఈనెల 20 లోపు అందే విధంగా పంపించాలన్నారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించబడవని వివరించారు. 

News March 14, 2025

జలుమూరు: విద్యుదాఘాతంతో యువకుడి మృతి

image

జలుమూరు మండలంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అబ్బాయిపేట గ్రామంలో ఎర్రన్నపేట గ్రామానికి చెందిన బలగ మణికంఠ ఓ వివాహ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ లైట్ల అలంకరణ చేపట్టాడు. ఈ క్రమంలో యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం నరసన్నపేట తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు వివరించారు.

News March 14, 2025

SKLM: పలాసలో 23న స్వాతంత్ర్య సమరయోధుల సంస్మరణ సభ

image

పలాస మండలం మా కన్నపల్లి గ్రామంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్‌ల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని అన్నారు. ప్రజలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.

News March 14, 2025

శ్రీకాకుళం: పాఠశాలలకు నేడు సెలవు.. రేపటినుంచి ఒంటి పూట బడులు

image

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు హోలీ పండుగ సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించారని డీఈఓ తిరుమల చైతన్య తెలిపారు. గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ శనివారం నుంచి ఒంటి పూట బడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఉదయం 7:45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు కొనసాగుతాయి.  అయితే మధ్యాహ్న భోజనం యథాతథంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

News March 14, 2025

టెక్కలి: ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

image

టెక్కలి మండలం పెద్దసాన ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. పాఠశాలలో విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో వారి ఫిర్యాదు మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ చేపట్టి ఆయనను సస్పెండ్ చేశారు. కాగా ఈ ఆరోపణలు ఉన్న ఉపాధ్యాయుడు గతంలో కూడా ఒకసారి సస్పెన్షన్‌కు గురయ్యారు.

News March 14, 2025

ఎచెర్ల: 6వ సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించుటకు గడువు పెంపు

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ ఆరవ సెమిస్టర్ internship పరీక్ష ఫీజులను చెల్లించుటకు మార్చి 25వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పొడిగించామని యూనివర్సిటీ డీన్ జి.పద్మారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఇంటర్నషిప్ వైవ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 4 వ తేదీ వరకు ఉంటాయని తెలియజేశారు.

News March 13, 2025

పలాస: రేపు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం రద్దు

image

ప్రతి శుక్రవారం కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదులు స్వీకరణ  హోలీ పండగ నేపథ్యంలో రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాశీబుగ్గ పరిసర ప్రాంత ప్రజలు పై విషయాన్ని గమనించి ప్రజా ఫిర్యాదులు స్వీకరణ కార్యక్రమానికి రావద్దని కోరారు.

News March 13, 2025

SKLM: మహిళల భద్రత కోసం శక్తి యాప్- ఎస్పీ

image

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళలు, బాలికలు భద్రత కోసం శక్తి యాప్ (SHAKTI APP)ను ప్రవేశపెట్టిందని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, ఇతర హింసాత్మక ఘటనలను నివారించటానికి ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ప్రతీ మహిళ శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

News March 13, 2025

SKLM: ఆత్మహత్యాయత్నం.. రక్షించిన ఆసుపత్రి సిబ్బంది

image

శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. గురువారం ఆసుపత్రి పైఫ్లోర్ నుంచి కిందకు దూకేందుకు యత్నించగా అక్కడి స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన స్పందించి రక్షించారు. సదరు వ్యక్తి సరుబుజ్జిలి మండలం నక్కలపేట వాసిగా స్థానికులు చెబుతున్నారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.