Srikakulam

News July 30, 2024

గోవాలో సిక్కోలు మత్స్యకారుడి మృతి

image

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం హుకుంపేట గ్రామానికి చెందిన కొమర యర్రన్న గోవాలో వేటకు వెళ్లి బోటులో కాలు జారి కిందపడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఎర్రన్న మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.

News July 30, 2024

శ్రీకాకుళం: ఒక్కటే గది.. అంగన్‌‌వాడీలు మూడు

image

లావేరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఒకే గదిలో మూడు అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ముగ్గురు కార్యకర్తలు, ముగ్గురు ఆయాలు, పిల్లలకు వచ్చే సరకులు, ఆట వస్తువులు, సిలిండర్లు ఉన్నాయి. ఫలితంగా చిన్నారులకు అవస్థలు తప్పలేదు. అక్కడ సిలిండర్ల ఉండటంతో ఏదైనా ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కొత్త భవనం పనులు 90 శాతం పూర్తయ్యాయని సీడీపీవో ఝాన్సీబాయ్‌ తెలిపారు.

News July 30, 2024

శ్రీకాకుళం: విద్యార్థినులకు వాట్సాప్‌లో అసభ్య మెసేజ్‌లు

image

పొందూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా బినామీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిపై సోమవారం పోలీసులు విచారణ చేపట్టారు. పాఠశాలలో దివ్యాంగుల కోటాలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించిన మహిళకు బదులుగా ఈయన విధులు చేస్తున్నాడు. పాఠశాలలో కొంతమంది విద్యార్థినులకు వాట్సాప్‌లో అసభ్య మెసేజ్‌లు పెడుతున్నారని టీచర్లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేయాల్సిందిగా ఎస్‌ఐను SP ఆదేశించారు.

News July 30, 2024

శ్రీకాకుళం: ఆగస్టు 1న పలు రైళ్లు రీ షెడ్యూల్

image

పూండి-నౌపడ సెక్షన్లో పలు రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఆగస్టు 1న భువనేశ్వర్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12830) గంట ఆలస్యంగా మధ్యాహ్నం 1.10 గంటలకు, ఆగస్టు 3న పూరీ-గాంధీధాం (22974) గంటన్నర ఆలస్యంగా మ. 12.45 గంటకు, భువనేశ్వర్-తిరుపతి (22879) గంట ఆలస్యంగా మ.1.10 గంటకు బయలుదేరుతుంది. ఈ నెల 29, ఆగస్టు 1,3 తేదీల్లో విశాఖ-పలాస-విశాఖ మాత్రమే రాకపోకలు సాగిస్తుంది.

News July 30, 2024

ప్రజా సమస్యలను పరిష్కరించాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 200 అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News July 29, 2024

శ్రీకాకుళం జిల్లాలో TODAY TOP HEAD LINES

image

➤ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నంగా ఉంది: మంత్రి అచ్చెన్న➤ బడ్జెట్‌పై భయమెందుకు బాబు: ధర్మాన కృష్ణ దాస్➤ 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్➤ ఆగస్టు 3న రెండో విడత IIIT మెరిట్ జాబితా➤ APSRTCలో అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తు➤ ఎస్పీ ప్రజా ఫిర్యాదుకు 58 ఫిర్యాదులు➤ సోంపేట టీడీపీ సీనియర్ నాయకుడు మృతి➤ గారలో సాగునీటి కోసం తోపులాట.. వృద్ధుడు మృతి

News July 29, 2024

శ్రీకాకుళం: అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

APSRTCలో అప్రెంటిషిప్ కోసం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం ప్రజా రవాణా అధికారి సోమవారం తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రికల్, డ్రాఫ్ట్ మెన్ , సివిల్ ట్రేడుల్లో దరఖాస్తుకు అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. వివరాలకు www.apprenticeshipindia.gov.in వెబ్‌సైట్‌ను చూడాలన్నారు. దరఖాస్తుకు  చివరి తేదీ ఆగస్టు 16. 

News July 29, 2024

బడ్జెట్‌పై భయమెందుకు బాబూ: మాజీ మంత్రి ధర్మాన

image

మోసపూరిత హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. ఈ మేరకు సోమవారం ఆయన పోలాకిలో ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా మరో 3 నెలలు ఓటాన్ అకౌంట్‌కు వెళ్లిందన్నారు. సూపర్ సిక్స్‌ను అమలు చేయకుండా ఉండేందుకు ఆయన కొత్త ఎత్తుగడ వేశారన్నారు. 

News July 29, 2024

శ్రీకాకుళం: ఆగస్టు 3న రెండో విడత మెరిట్ జాబితా

image

ఆర్జీయూకేటి పరిధిలో శ్రీకాకుళంలో 863 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందిన విషయం తెలిసిందే. ఈ మేరకు రెండో విడత మెరిట్ జాబితా వివరాలను ఆగస్టు 3వ తేదీన ప్రకటించనున్నారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు క్యాంపస్ మార్పు కావాలంటే rgukt.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వెబ్‌సైట్‌ లింక్ ఈనెల 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ తెలిపారు.

News July 29, 2024

పింఛన్లు పంపిణీ 1వ తేదీ శతశాతం జరగాలి- కలెక్టర్

image

గతంలో ఎదురైన సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ 1వ తేదీ నాడే శతశాతం జరగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆగస్టు 1వ తేదీ ఉదయం 5.30కి పంపిణీ ప్రారంభించి మొదటి రోజునే శత శాతం పంపిణీ జరగాలన్నారు.