India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం మండలంలో అరసవల్లి గ్రామంలో ఉండే శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయానికి సినీ నటుడు సాయి కుమార్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. స్వామిని దర్శించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ యర్రంశెట్టి భద్రాజీ, శ్రీస్వామి వారి జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
వచ్చే నెల 4వ తేదీన అరసవల్లిలో జరగనున్న రథసప్తమి(సూర్య జయంతి) రోజున దాతలు దర్శనం చేసుకునే వారు డోనర్ పాసులకు పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో యర్రంశెట్టి భద్రాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల దేవాలయానికి రూ.లక్ష పైబడి విరాళం సమర్పించిన దాతలు ఈ నెల 20వ తేదీ లోగా డోనర్ రసీదుతో పాటుగా ఆధార్ కార్డుతో ఆలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో సూచించారు.
వచ్చే నెల 4వ తేదీన అరసవల్లిలో జరగనున్న రథసప్తమి(సూర్య జయంతి) రోజున దాతలు దర్శనం చేసుకునే వారు డోనర్ పాసులకు పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో యర్రంశెట్టి భద్రాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల దేవాలయానికి రూ.లక్ష పైబడి విరాళం సమర్పించిన దాతలు ఈ నెల 20వ తేదీ లోగా డోనర్ రసీదుతో పాటుగా ఆధార్ కార్డుతో ఆలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో సూచించారు.
టెక్కలి హైవేపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దసాన గ్రామానికి చెందిన జి. అప్పారావు <<15148221 >>మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. ఈయన విశాఖలో కూలి పనులు చేస్తూ కుటుంబంతో జీవనం సాగించేవాడు. పండగకు సోదరిని పిలిచేందుకు ఆదివారం గ్రామానికి వచ్చాడు. తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా HYD వెళ్తున్న బస్సు ఢీకొంది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తిర్లంగిలో సోమవారం జరిగిన కొట్లాట ఘటనలో ఇరువర్గాలకు చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన జీ.చిట్టిబాబు, ఎస్.విశ్వనాథం మధ్య నెలకొన్న చిన్నపాటి వివాదం కొట్లాటకు దారి తీసింది. దీంతో వారు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ ఏ.విజయ్ కుమార్ తెలిపారు.
శ్రీకాకుళం పాత్రునివలసలోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థిని అదృశ్యమైంది. కళాశాలకు ఈ నెల 11 నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటికి వస్తానని చెప్పి రాలేదని తండ్రి శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై రాము తెలిపారు.
ఓకే గులాబి మొక్కకు మూడు రంగులు కలిగిన పువ్వులు పూయడంతో పలువురు ఈ మొక్కను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. శ్రీకాకుళంలోని నరసన్నపేట మండలం వీరన్నాయుడు కాలనీలో ఉన్న సూరపు భీమారావు ఇంట్లో ఇది కనువిందు చేసింది. గత కొద్దిరోజులుగా ఇటువంటి గులాబీ మొక్కలను ఆయన పెంచుతున్నాని చెప్పారు. దీనిపై ఉద్యానవన శాఖ అధికారి ఆమని వద్ద ప్రస్తావించగా మొక్కలకు అంటు పెట్టినప్పుడు ఇలా అరుదుగా పువ్వులు పూస్తుందన్నారు.
తెలుగు పండుగల్లో మొదటిదైనా భోగి తర్వాత మకర సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు. దీనికి ఆ పేరు రావడానికి కారణం చూస్తే సూర్యుడు ఏడాదిలో నెలకు ఒక్కొక్కటి చొప్పున 12 రాశుల్లో మారుతాడు. ఇలా మారడాన్ని సంక్రమణం అంటారు. ఈ క్రమంలో ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. భోగితో ధనుర్మాసం ముగుస్తుంది. అనంతరం వచ్చే మకరసంక్రాంతికి ఇంటిల్లపాది ఒక దగ్గరకు చేరి పితృదేవతలకు కొత్త దుస్తులు సమర్పిస్తారు.
ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తండ్రి పాలవలస రాజశేఖరం ఇటీవల అనారోగ్యంతో శ్రీకాకుళంలోని జేమ్స్ హాస్పిటల్ చేరారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 8 గంటలు తర్వాత తుదిశ్వాస విడిచారు. గతంలో రాజశేఖరం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, MLA, రాజ్యసభలో ఎంపీగా సేవలు అందించారు. 1970లో వీరఘట్టంలోని నీలానగరం సర్పంచ్‌గా గెలవడంతో రాజకీయం ప్రస్థానం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఈయన కుమార్తె.
టెక్కలి మండలం కె కొత్తూరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. టెక్కలి మండలం పెద్దసాన గ్రామానికి చెందిన బందాపు అప్పారావు గ్రామానికి వెళ్తున్న క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొంది. తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో ఉన్న ఆయనను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.