Srikakulam

News March 4, 2026

జనసేన ఆఫీసుపై దాడి.. శ్రీకాకుళం జిల్లా యువకుడి అరెస్ట్

image

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల 2 కార్లను ధ్వంసం చేయడంతో పాటు భద్రతా సిబ్బందిపై దాడిచేసిన వ్యక్తిని మంగళవారం రిమాండ్‌కి పంపినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పార్టీ కార్యాలయ భద్రతా సిబ్బంది RI పెంటారావు ఫిర్యాదు మేరకు కంచిలి మండలం బెలగాంకు చెందిన నీలాద్రిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు.

News March 4, 2026

శ్రీకాకుళం: పిల్లలు పుట్టలేదని వివాహిత ఆత్మహత్య

image

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో వివాహిత సాయి తేజ(23) ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ నర్సింగరావు మంగళవారం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరుకు చెందిన తేజ పిల్లలు పుట్టలేదని మనస్తాపంతో సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుందన్నారు. అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

News March 4, 2026

SKLM: పారిశుద్ధ్యం పనులను పరిశీలించిన జేసీ

image

శ్రీకాకుళం నగరంలో డయేరియా నేపథ్యంలో పారిశుద్ధ్య పనులను జిల్లా యంత్రాంగం ముమ్మరం చేసింది. జాయింట్ కలెక్టర్, ఇన్‌ఛార్జి నగరపాలక సంస్థ, ఇన్‌ఛార్జి కమిషనర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్ మంగళవారం పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సెవెన్ రోడ్డు జంక్షన్‌లో ఉన్న అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. అనంతరం కాజీపేటలో జరిగిన పారిశుద్ధ్యం పనులను పర్యవేక్షించారు.

News March 3, 2026

జర్మనీ వెళ్తూ దోహా ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న సిక్కోలు వాసి

image

శ్రీకాకుళం మండలం సింగుపురానికి చెందిన పుట్రేవు వెంకట సత్య గౌతమ్ ఖతర్‌లోని దోహా ఎయిర్ పోర్టులో చిక్కుకున్నాడు. ఇతను బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానని, కంపెనీ ఆదేశాల మేరకు జర్మనీ ఫ్లైట్లో వెళ్తుండగా యుద్ధం వాతావరణం నెలకొనడంతో దోహా ఎయిర్ పోర్టులో విమానాన్ని నిలిపివేశారు. దీంతో ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆయన కుటుంబీకులకు తెలిపాడు.

News March 3, 2026

సిక్కోలు: మరి కాసేపట్లో క్లోజ్

image

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మూతపడుతున్నాయి. ఈ విషయాన్ని ఆయా ఆలయాల ప్రధాన అర్చకులు తెలిపారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మూత పడుతున్న ప్రముఖ దేవాలయాల జాబితాలో అరసవల్లి సూర్య దేవాలయం, శ్రీకూర్మనాథ ఆలయం, నారాయణ తిరుమల, ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, శ్రీముఖలింగం తదితర దేవాలయాలు ఉన్నాయి. గ్రహణ త్యాగం అనంతరం ఆలయ సంప్రోక్షణ, భక్తులకు దర్శనాలు ఉంటాయన్నారు.

News March 3, 2026

బాణసంచా పేలి 21 మంది మృతి.. శ్రీకాకుళం కలెక్టర్ సీరియస్

image

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జిల్లాలో బాణసంచా తయారీ నిల్వ విక్రయ కేంద్రాల వద్ద అగ్నిప్రమాద నివారణ చర్యలను అత్యంత కట్టుదిట్టం చేయాలన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద పేలుడుతో 21 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.

News March 3, 2026

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు- కలెక్టర్

image

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జిల్లాలో బాణసంచా తయారీ నిల్వ విక్రయ కేంద్రాల వద్ద అగ్నిప్రమాద నివారణ చర్యలను అత్యంత కట్టుదిట్టం చేయాలన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద పేలుడుతో 21 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.

News March 2, 2026

వికసిత్ భారత్ లక్ష్యాలు ఇంటింటికీ చేరాలి: కలెక్టర్

image

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘వికసిత్ భారత్’ లక్ష్యాలు ప్రతి గడపకు చేరాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతనంగా చేపడుతున్న ‘వీబీజీ రాంజీ’ కార్యక్రమ గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు వంటి కీలక నిర్ణయాలను వివరించారు. ఈ లక్ష్యాల సాధనలో అధికారులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News March 2, 2026

శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 56 అర్జీలు

image

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 56 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.

News March 2, 2026

SKLM: ‘జాతీయ లోక్ అదాలత్ వినియోగించుకోవాలి’

image

మార్చి 14న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయంలో బ్యాంక్ అధికారులు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. అధికంగా రాజీలు చేయించేందుకు అధికారులు ప్రయత్నం చేయాలన్నారు.

↑