Srikakulam

News November 12, 2024

నేడు స్వర్ణకాంతులతో ఆదిత్యుని దర్శనం 

image

ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో స్వామి వారి మూలవిరాట్ విగ్రహనికి మంగళవారం పూర్తిగా బంగారు ఆభరణాలతో అలంకరిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. నేడు కార్తీక శుద్ధ ఏకాదశి, రేపు ద్వాదశి కావడంతో ప్రత్యేక అలంకరణలో  దర్శన భాగ్యం కల్పిస్తామని ఆలయ డీసీ వై.భాద్రజీ వెల్లడించారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

News November 11, 2024

లావేరు: విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా

image

లావేరు మండలంలోని భీమునిపాలెంలో అదపాక రహదారిపై సోమవారం సాయంత్రం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో తామాడ మెడల్ స్కూల్లో ఇంటర్ చదువుతున్న కొత్తకోట గ్రామానికి చెందిన 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో కొందరికి కాళ్ళు, చేతులు విరిగిపోవడంతో పాటు శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులందరినీ స్థానికులు సహాయంతో 108లో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు.

News November 11, 2024

49 ఫిర్యాదులు స్వీకరించిన ఏఎస్పీ శ్రీనివాసరావు

image

ప్రజా ఫిర్యాదులకు చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని ఏఎస్పీ శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు స్వీకరణ, పరిష్కార కార్యక్రమంలో 49 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి వీలైనంత తొందరగా పరిష్కరించాలన్నారు. పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు.

News November 11, 2024

SKLM: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్

image

శ్రీకాకుళం జిల్లాలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 35 వేల మందికిపైగా చదువుతున్నారు. అక్టోబర్ 21 నుంచి చెల్లింపు మొదలవ్వగా వీరంతా ఈ నెల 11వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఇంటర్ పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

News November 11, 2024

భోగాపురం ఎయిర్ పోర్టును 2026కి పూర్తి: కేంద్ర మంత్రి

image

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే భోగాపురం ఎయిర్ పోర్టు పనులను లక్ష్యం కంటే ముందుగానే 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెళ్లడించారు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆదివారం 6వ సారి ఆయన ఏర్పోర్టు పనులను పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

News November 10, 2024

శ్రీకాకుళం జిల్లాలో బెస్ట్ టీచర్ అవార్డులు వీరే..!

image

లావేరు మండలం గోవిందపురం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుంటముక్కల శ్రీనివాసరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే బూర్జ మండలంలోని ఓవీ పేట ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బొడ్డేపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కావడం గమనార్హం.

News November 10, 2024

శ్రీకాకుళం జిల్లా TODAY TOP NEWS

image

* శ్రీకాకుళం: కిసాన్ మేళాను ప్రారంభించిన మంత్రి అచ్చెన్న
* మెలకువలు పాటిస్తే కేసులను ఛేదించవచ్చు: SKLM SP
* శ్రీకాకుళం సుడా ఛైర్మన్‌గా రవికుమార్
* ఆమదాలవలస: 25ఏళ్లుగా ఇంట్లో పాము
* రాష్ట్రంలో నియంత పాలన: కృష్ణదాస్
* సోంపేట: పోస్ట్ ఆఫీస్‌లోనే ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్
* ఇచ్చాపురం: వైసీపీ సీనియర్ నేత మృతి
* సీతంపేటలో అగ్ని ప్రమాదం.. ఇళ్లు దగ్ధం

News November 9, 2024

శ్రీకాకుళం: మెలకువలు పాటిస్తే కేసులను చేధించవచ్చు: SP

image

సైబర్ నేరాల నియంత్రణ, నేరాలకు సంబంధించిన కేసులను చేధించడానికి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలోఆయన పాల్గొన్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో సరైన మెలకువలు పాటిస్తే కేసులను ఛేదించటం చాలా సులుభం అవుతుందని అన్నారు.

News November 9, 2024

శ్రీకాకుళంలో నామినేటెడ్ పదవులు దక్కింది వీరికే..

image

ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితాను కూటమి ప్రభుత్వం శనివారం ఉదయం విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 1. TDP నేత రోణంకి కృష్ణంనాయుడుని కళింగ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. 2.JSP నేత నుంచి పాలవలస యశస్విని తూర్పు కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్ పర్సన్‌గా, కోరికాన రవికుమార్‌ను శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా కూటమి ప్రభుత్వం నియమించింది.

News November 9, 2024

కంచిలి: బస్సు కిందపడి బాలుడి మృతి.. ఎలా జరిగిందటే

image

కంచిలి మం.ముండల గ్రామంలో శుక్రవారం ఉదయం బస్సు వెనుక చక్రం కిందపడి బాలుడు(3) దివ్యాంశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. నిన్న తల్లి పెద్ద కొడుకు శ్రీయాన్స్‌ను పాఠశాల పంపేందుకు బస్టాండ్‌ వచ్చి బస్సు ఎక్కించింది. ఇంతలో తానూ ఎక్కుతానంటూ దివ్యాంశ్ వచ్చాడు. గమనించని డ్రైవర్ ముందుకు తీయడంతో టైర్ల కిందపడి చనిపోయాడు. దీంతో తల్లి, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడి తండ్రి ఉపాధి కోసం వలస వెళ్లారు.