India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రథసప్తమి వేడుకల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ఠంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన అరసవల్లిలో పర్యటించారు. అనంతరం పోలీసులు, ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలో ముందుగా జిల్లా ఎస్పీ ఆలయ భౌగోళిక మ్యాప్, దేవస్థానం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ, డీఎస్పీ వివేకానంద ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో 107 రేషన్ డీలర్ల పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ మేరకు మండలాల వారీగా వివరాలను RDO కె. సాయి ప్రత్యూష శుక్రవారం ఆమె కార్యాలయం నుండి తెలియజేశారు. ఆమదాలవలస- 8, బూర్జ- 3, ఎచ్చెర్ల- 5, జి.సిగాడం- 5, జలుమూరు – 3, లావేరు – 15, నరసన్నపేట – 12, పోలాకి – 12, పొందూరు – 16, రణస్థలం – 10, సరుబుజ్జిలి – 4, శ్రీకాకుళం – 14 ఖాళీలు ఉన్నట్లు RDO స్పష్టం చేశారు.
ఏపీజేఏసీ అమరావతి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్లను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రెవెన్యూ శాఖ అధికారులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి కె.సాయి ప్రత్యూష, ఏపీజేఏసీ నేతలు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం రేపటి నుంచి అమలు కానుంది. జిల్లాలో 38 జూనియర్ కళాశాలలో 11028 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే వీరిలో 1787 మంది వసతి గృహల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదని డీవీఈఓ తవిటి నాయుడు శుక్రవారం తెలిపారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం అందిస్తామని ఆయన చెప్పారు.
జిల్లా స్థాయి దక్షిణ భారతదేశపు సైన్స్ ఫెస్ట్ 2024-25 శుక్రవారం శ్రీకాకుళంలోని బాలురు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ అహమ్మద్ ఖాన్ లాంఛనంగా ప్రారంభించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అధ్యక్షుడిగా పాల్గొన్నారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం కలిగి, దేశ పురోభివృద్ధికి పాటుపడాలని వక్తలు కోరారు. సైన్స్ ప్రాజెక్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
విశాఖపట్నం కృష్ణా కాలేజ్ గ్రౌండ్‌లో వాకింగ్ చేస్తూ పాలకొండకు చెందిన ఈట్ల రమేష్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈయన స్వస్థలం పాలకొండలోని పాత గ్యాస్ ఆఫీస్ వద్ద నివాసం అని స్థానికులు తెలిపారు. విశాఖపట్నంలో ఈయన మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన విశాఖపట్నం వెళ్లారు. ఒక్కసారిగా పాలకొండ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రైతులకు ప్రతేడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ఫసల్ బీమా యోజన పరిహారాన్ని రూ.6000 నుంచి రూ.10000లకు పెంచుతూ ఇటీవల ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న రెండు లక్షల 30 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. గతంలో నాలుగు విడతలుగా రూ.1500 జమచేయగా ప్రస్తుతం రూ.2500 జమ చేస్తామన్నారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 2,4 సెమిస్టర్లకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ఫలితాల కోసం https://jnanabhumi.ap.gov.in/ వెబ్‌సైట్ సందర్శించి ఫలితాలను చూడొచ్చని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.
ఆల్ ఆంధ్రప్రదేశ్ క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ శ్రీకాకుళం జిల్లా క్యాలెండర్‌ను జెసీ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ క్యాలెండర్‌ను విడుదల చేసి సభ్యులకు అందజేశారు. అనంతరం వారికి జెసీ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సీహెచ్ ఉమాశంకర్, సెక్రెటరీ పద్మ, రవిశంకర్, సీతారాం, సుబ్రహ్మణ్యం, నాగమణి కార్యవర్గ సభ్యులు ఉన్నారు.
ఖేల్‍రత్న అవార్డు గ్రహీతలను మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి గురువారం ప్రకటన విడుదల చేశారు. షూటింగ్‍లో ఒలింపిక్స్ పతక విజేత మనుబాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్‍కు, హాకీ క్రీడాకారుడు హర్మన్‍ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్ విభాగంలో ప్రవీణ్‍కుమార్‌లకు ఖేల్‍రత్న అవార్డులు ప్రకటించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు ఈ అవార్డులు అందుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.