Srikakulam

News December 28, 2024

వీరఘట్టం: బాలికలపై లైంగిక దాడులకు పాల్పడింది ఇతనే

image

విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే ఆ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వీరఘట్టం మండలంలో సంచలనంగా మారింది. తమ పిల్లలపై వికృత చేష్టలకు పాల్పడిన ఆ గురువు తెర్లి సింహాచలంకు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ చిత్రంలో ఉన్న ఆ కామాంధుడు ఇతనే.. ఈ వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

News December 28, 2024

వీరఘట్టం: ప్రిన్సిపల్‌పై పోక్సో కేసు నమోదు

image

వీరఘట్టం మండలం నడుకూరు సమీపంలో ఉన్న గురుబ్రహ్మ పాఠశాల ప్రిన్సిపల్ తెర్లి సింహాచలంపై శుక్రవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి కళాధర్ తెలిపారు. పాఠశాలలో చదువుతున్న 4, 5,6వ తరగతి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News December 28, 2024

ఎచ్చెర్ల: దారుఢ్య పరీక్షలకు ముమ్మరం ఏర్పాట్లు

image

ఎచ్చెర్ల ఆర్మ్డ్ పోలీస్ రిజర్వ్ పరేడ్ మైదానాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు PMT,PET పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రవేశం,వెళ్లే మార్గాలను ఎస్పీ పరిశీలించి, ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు అవసరమైన కౌంటర్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు.

News December 27, 2024

రేపు అంబేడ్కర్ యూనివర్సిటీ సెలవు

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ శనివారం ఎచ్చర్ల డా.బీ.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి సెలవును ప్రకటిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు వివరాలు వెల్లడించారు. విశ్వవిద్యాలయంతో పాటు యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలకు కూడా సంతాప దినంగా శనివారం సెలవును ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.

News December 27, 2024

SKLM: నెమలి పింఛంపై కనకమహాలక్ష్మి దేవి చిత్రం

image

శ్రీకాకుళం నగరానికి చెందిన వాడాడ రాహుల్ పట్నాయక్ శుక్రవారం నెమలి పింఛంపై వేసిన కనకమహాలక్ష్మీ దేవి చిత్రం ఆకట్టుకుంది. రాహుల్ ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో చిత్రాలకు ఎన్నో పురస్కారాలు పొందారు. పక్షుల వెంట్రుకలపై శ్రీనివాస కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీకృష్ణ రాసలీల తదితర దేవతల చిత్రాలు వేశారు. పాఠశాలల గోడలపై ఎన్నో విద్యా సంబంధిత బొమ్మలు వేసి పలువురు ప్రశంసలు పొందారు.

News December 27, 2024

SKLM: మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించాలి

image

మానవ అక్రమ రవాణా ఎంతగానో వేధిస్తుంది దీని ద్వారా ఎంతోమంది అమాయకుల జీవితాలు బలి అవుతున్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు అన్నారు. శుక్రవారం న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో వీధి బాలల భిక్షాటన, మానవ అక్రమ రవాణా, పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులపై చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, మహిళా పోలీసులతో సమీక్ష నిర్వహించారు. 

News December 27, 2024

శ్రీకాకుళం: దోమల నివారణకు చర్యలు

image

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఫాగింగ్ మిషన్లను శుక్రవారం పంపిణీ చేశారు. జిల్లాకు 50 ఫాగింగ్ మిషన్లు వచ్చాయని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిల్లో వీటిని అందుబాటులో ఉంచుతామన్నారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల ద్వారా గ్రామాల్లో ఫాగింగ్ చేయించి దోమలను నివారిస్తామన్నారు.

News December 27, 2024

SKLM: ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జవవరి 1 తేదికి సంబంధించిన పింఛన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1 వ తేది సెలవు దినం కావడంతో డిసెంబర్ 31న (మంగళవారం) పెన్షన్లు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో 3,13,255 మంది లబ్ధిదారులకు రూ.128.56 కోట్లు అధికారులు ఖాతాలో జమ చేశారు. ఈ మేరకు నగదు పంపిణీకి సిబ్బందితో కలిసి క్షేత్రా స్థాయిలోఅధికారులు చర్యలు చేపట్టారు. 

News December 27, 2024

శ్రీకాకుళం: పాసింజర్ రైళ్లు రద్దు..తప్పని అవస్థలు

image

పలు పాసింజర్ రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో విశాఖ-పలాస పాసింజర్ రైళ్లను ఈనెల 27 నుంచి వచ్చే ఏడాది మార్చి 1 వరకు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. రైళ్ల రద్దుతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఈ మేరకు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సర్వీసులను నడపాలన్నారు.

News December 27, 2024

2024 సిక్కోలు రాజకీయ మధుర స్మృతులు

image

2024 సంత్సరం ముగింపు దశకు చేరింది. ఈ ఏడాది సిక్కోలు వాసులకు ఎన్నో మధుర జ్ఞాపకాలు మరెన్నో చెదు అనుభవాలను మిగిల్చింది. ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది మరింత ప్రాముఖ్యతను సంతరించకుంది. కూటమికి జిల్లా ప్రజలు పట్టం కట్టారు. వైసీపీ ఒక్క సీటు విజయం సాధించకపోవడంతో ఆ పార్టీ అభిమానులు నైరాశ్యంలో కురికుపొయారు. రాజకీయ ఉద్ధండులు సైతం ఓటమి చవిచుశారు. మరికొందరు కొత్తవారు అసెంబ్లీలో సమస్యలపై గళమెత్తారు.

error: Content is protected !!