India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నందిగాం మండలం దేవుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు కొండాల గోపాలంపై గురువారం మరో పొక్సో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 22న పాఠశాల విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా కేసు నమోదైనప్పటికి ఆయన రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా మరో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాలిక కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహమ్మద్ అలీ తెలిపారు.
టెక్కలి పట్టుమహాదేవి కోనేరు గట్టును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. టెక్కలి రెవెన్యూ, పంచాయతీ, ఇంజినీరింగ్, మండల పరిషత్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కోనేరు పర్యాటక అభివృద్ధి చేయనున్న దృష్ట్యా పలు అంశాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, ఎంపీడీఓ సీహెచ్.లక్ష్మీభాయి తదితరులున్నారు.
గ్రామాల వారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణం పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. గురువారం టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్‌కి చెందిన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రీసర్వే, పీజీఆర్ఎస్, పౌర సేవల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా DMHOగా డాక్టర్. బి.సుజాతకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు DMHOగా పనిచేసిన బాలమురళీకృష్ణ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. సుజాత ప్రస్తుతం విశాఖ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ముగ్గుల పోటీలలో నరసన్నపేటకు చెందిన మహిళ రూ.25 లక్షలు గెలుచుకున్నారు. ఆంధ్రా అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆన్‌లైన్ విధానంలో పోటీలు నిర్వహించారు. ఇందులో సునీత మొదటి బహుమతిని గెలుచుకున్నారు. లక్షల రూపాయలు గెలుచుకోవడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.
మండలంలోని జర్రిభద్ర గ్రామానికి చెందిన దుంపల సూర్యనారాయణ (82) మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి వైద్యం నిమిత్తం టెక్కలి ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందినట్లు బుధవారం ఎస్సై పి.రమేశ్ బాబు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెళియాపుట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామాల వారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డా.స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రీసర్వే పౌర సేవలపై రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టరు కార్యాలయం దగ్గరలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్స్ (న్యాక్) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఉంటుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్ బుధవారం తెలిపారు. ఎస్సీ యువతీ, యువకులకు ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్/డిగ్రీ చదివిన అర్హులుగా పేర్కొన్నారు. 2 నెలల పాటు శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు.
పర్యాటక రంగానికి ప్రభుత్వం పరిశ్రమ హోదాను ప్రకటించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం కోటబొమ్మాళిలో పర్యాటక శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టెక్కలిలో పట్టు మహాదేవ్ కోనేరు, భావనపాడు బీచ్ ఆధునీకరించాలన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు, మాధురి కలిసి బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనంతో అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
Sorry, no posts matched your criteria.