India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్టు రైల్వే జీఎం పరమేశ్వర ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రయాణికుల భద్రత మేరకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులను సూచించారు.

నిరుద్యోగ మైనారిటీ యువతకు జర్మనీలో ఎలక్ట్రీషియన్ విభాగంలో ఉద్యోగ అవకాశాలు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి ఉరిటి సాయికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటిఐలో 2 సంవత్సరాలు, డిప్లోమాలో 3 సంవత్సరాలు అనుభవం ఉన్న యువకులు అర్హులన్నారు. నవంబర్ 2వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 99888 53335 నంబర్‌కు సంప్రదించాలని తెలియజేశారు.

మొంథా తుఫాను ప్రభావం పెరుగుతున్న దృష్ట్యా, జిల్లాలోని వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లా ప్రత్యేక అధికారి KVN చక్రధర బాబుతో కలిసి సోమవారం క్షేత్ర పర్యటన ముగించుకున్న అనంతరం, కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా డెలివరీ తేదీలు దగ్గర పడిన గర్భిణీలకు వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని ఆదేశించారు.

➫శ్రీకాకుళం జిల్లాపై మొంథా తుఫాన్ ప్రభావం
➫తుఫాన్ పై అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం
➫శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు
➫మెండపేట-రాళ్లపేట రహదారి గుంతలమయం
➫శ్రీకాకుళం:చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్
➫తుఫాన్ ప్రభావంపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
➫పొందూరు, ఎల్.ఎన్ పేటలో నేలమట్టం అయిన వరి పంట

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి క్రిష్ణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తుఫాను పరిస్థితులను పర్యవేక్షించేందుకు శ్రీకాకుళం, టెక్కలి డివిజన్లో 9490610045, 9490610050 హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిమనిన్నారు. విద్యుత్ లైన్లు తెగిపడినా.. స్తంభాలు పడిపోయిన తదితర సమస్యలు ఎదురైతే ఈ నంబర్లను సంప్రదించాలని కోరారు.

పోలాకి మండలం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ప్రత్యేక అధికారి చక్రధర బాబు సోమవారం పరిశీలించారు. డీఎల్ పురంలో గ్రామస్థులతో మాట్లాడారు. అధికారుల ఆదేశాలను తప్పనిసరిగా అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కెవీ మహేశ్వర రెడ్డి, రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర పౌర విమానాయన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడికి నామకరణం మహోత్సవం ఢిల్లీలో ఆదివారం నిర్వహించారు. రామ్మోహన్ కుమారుడికి శివన్ ఎర్రం నాయుడు అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, జీఎంఆర్ సంస్థల అధినేత, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు, ఎర్రం నాయుడు సోదరులు, కింజరాపు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఎచ్చెర్లలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి సోమ, మంగళవారం సెలవులు ప్రకటించారు. తుపాన్ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.బి.అడ్డయ్య వివరించారు. యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ప్రాణ నష్టం 0 లక్ష్యంగా పనిచేయాలని, అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్‌ను ఏ అధికారి వృథా చేయకుండా పనిచేయాలని శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక అధికారి KVN చక్రధరబాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ, ఇన్ఛార్జ్ కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించారు. మెంథా తుపాను ఈనెల 28న తీరం దాటే అవకాశం ఉందన్నారు. ప్రతి అధికారి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

ఈనెల 27న శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరగనున్న ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలోని అధికారులు పర్యవేక్షణలో ఉంటారని ఆయన తెలియజేశారు. మండలాల్లో సైతం నిర్వహించనున్న గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.