Srikakulam

News October 26, 2025

SKLM: పొట్ట దశలో పైర్లు.. వర్షం పొట్టన పెట్టుకోవద్దని వేడుకోలు!

image

జిల్లా వ్యాప్తంగా అన్నదాతల్లో మొంథా తుఫాన్ రాక గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నాలుగైదు రోజులు తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో పంటలపై ఎంతమేర ప్రభావం చూపుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పంట వేసిన నుంచి అనేక ఆటుపోట్లు, యూరియా పాట్లు ఎదుర్కొన్న అనంతరం వరి పైరు ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. ఇలాంటి సమయంలో ఏ నష్టం జరగొద్దని రైతన్నలు దేవుడికి మొక్కుకుంటున్నారు.

News October 26, 2025

పాతపట్నం: ‘గురుకుల పాఠశాలను సందర్శించిన సమన్వయ అధికారి’

image

10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలని, విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మీ అన్నారు. పాతపట్నం మండలంలోని ప్రహరాజపాలెంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను శనివారం సందర్శించారు. విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని, డార్మెటరీని, మరుగుదొడ్లను పరిశీలించారు.

News October 25, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

image

◈శ్రీకాకుళం జిల్లాలో భక్తిశ్రద్ధలతో నాగులచవితి వేడుకలు
◈శ్రీకాకుళం: పీజీ ప్రవేశాల ప్రక్రియ పూర్తి అయ్యేదెన్నడు..?
◈టెక్కలి: జిల్లాలో రవాణాశాఖ అధికారుల విస్తృత తనిఖీలు
◈మందస: అగ్నిప్రమాదంలో నాలుగు పూరిల్లు దగ్దం
◈ఆదిత్యుని సేవలో హై కోర్టు జస్టిస్
◈టెక్కలి: పశువైద్య మందుల కొరత తీర్చండి
◈గార: నాగులచవితి వేడుకలకు ఆ గ్రామం దూరం

News October 25, 2025

శ్రీకాకుళం: పీజీ ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేదెప్పుడో..?

image

పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఈఏడాది జూన్ 9-12 వరకు పీజీ సెట్ జరగగా..25న ఫలితాలొచ్చాయి. సెప్టెంబర్ 22న మొదట, అక్టోబర్ 12న రెండో కౌన్సిలింగ్ నిర్వహించినా.. ఇప్పటికీ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాక విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఈ ఏడాది కొన్ని కోర్సుల్లో జీరో అడ్మిషన్ల్ నమోదయ్యాయి.

News October 25, 2025

SKLM: ‘మొంథా’ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి

image

మొంథా’ తుపాను ముప్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ తుపాను జిల్లాపై అక్టోబర్ 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించిందని, జిల్లాలోని ఆయా శాఖల ఉన్నతాధికారులతో నేడు టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అత్యవసర సమయాల్లో 08942-240557 నంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు.

News October 25, 2025

గార: నాగుల చవితి జరుపుకోని గ్రామం ఇది!

image

దీపావళి అమావాస్య తర్వాత వచ్చే నాగుల చవితిని ప్రతి గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం కొనసాగుతోంది. అయితే జిల్లాలోని గార మండలం బూరవెల్లిలో నాగులచవితిని మాత్రం ఇవాళ జరుపుకోరు. ఏటా కార్తీక శుద్ధ షష్టి తిథి నాడే ఇక్కడ చవితిని జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని గ్రామానికి చెందిన వేద పండితులు ఆరవెల్లి సీతారామాచార్యులు తెలిపారు. ఇందుకు నిర్ధిష్ట కారణం ఏదీ లేదని.. షష్టి నాడు జరుపుకుంటామన్నారు.

News October 25, 2025

శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పిక్నిక్ ప్రదేశాలు ఇవే..

image

శ్రీకాకుళం జిల్లాలో కార్తీక వనభోజనాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నాలుగు ఆదివారాలు కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి పిక్నిక్‌లు జరుపుకోనున్నారు. మన జిల్లాలో వంశధారా, నాగావళి నదీ తీరాలు, కలింగపట్నం, బౌద్ధ శిల్పాలు, బారువా బీచ్, టెలినీలపురం, మణిభద్రపురం కొండప్రాంతాలు పిక్నిక్ జరుపుకొనే ప్రాంతాలుగా ప్రసిద్ధి పొందినవి. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.

News October 25, 2025

SKLM: ‘ఎలక్ట్రోరల్ రోల్స్ నమోదుపై సూచనలు ఇవ్వాలి’

image

ఎలక్ట్రోరల్ రోల్స్ నమోదుపై సూచనలు, సలహాలు ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను DRO ఎం. వెంకటేశ్వరరావు కోరారు. కలెక్టరేట్‌లో పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రోరల్ రోల్స్ నమోదు, తొలగింపుల పై సమాచారం అందించాలన్నారు. రాజకీయ పార్టీల సూచనలు, సలహాలు ఎంతో దోహదం చేస్తాయన్నాయని తెలియజేశారు. ఫారం-6, 7, 8ల సమాచారం ఇవ్వాలని కోరారు.

News October 25, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

★ఇంటి పన్నుల వసూళ్లపై దృష్టి సారించండి: అచ్చెన్న
★గార: నవంబర్ 2న కూర్మనాధుని తెప్పోత్సవం
★బూర్జ: రైతులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న డ్రోన్ సర్వేపై నిరసన
★హరిపురం PHCని తనిఖీ చేసిన ఎమ్మెల్యే శిరీష
★త్వరలో సీబీఎస్ఈ పాఠశాల ఏర్పాటు: శ్రీకాకుళం ఎమ్మెల్యే
★2029 నాటికి ప్రతీ ఇంటికీ ఒక ఉద్యోగం: పాతపట్నం ఎమ్మెల్యే
★ఆమదాలవలస: 20 కోట్లతో కన్నతల్లికి గుడి

News October 24, 2025

తిలారు: రైలు ఢీకొని ఒకరు మృతి

image

తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో డౌన్ లైన్‌లో రైలు ఢీకొని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ హెచ్‌సీ మధుసూదనరావు తెలిపారు. మృతుడికి 45 ఏళ్లు ఉంటాయాని, నీలం రంగు హాఫ్ హాండ్స్ షర్ట్, నలుపు రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని తెలియజేశారు. ఆచూకీ తెలిసినవారు 91103 05494 నంబర్‌ను సంప్రదించాలన్నారు.