India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండియన్ రైల్వే ప్రత్యేక ఎయిర్ ప్యాకేజీలను ప్రారంభించినట్లు ఐఆర్‌సీటీసీ రీజనల్ మేనేజర్ డాక్టర్ క్రాంతి శనివారం తెలిపారు. థాయిలాండ్ టూర్ ఆరు రోజుల ప్యాకేజీ 7 సెప్టెంబరు నుంచి 12వ తేదీ వరకు, దక్షిణ దివ్య ఆలయ పర్యటన ప్యాకేజీ 6 రోజులకి 14 ఆగస్టు నుంచి 19వ తేదీ వరకు తక్కువ ధరలకు ప్యాకేజీ అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల ప్రయాణికులు 92810 30748 సంప్రదించాలన్నారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ స్పెషల్ క్యాంపులను నిర్వహించనున్నట్లు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆధార్ ప్రత్యేక డ్రైవ్ లో ఐదేళ్ల లోపు పిల్లలకు బాల ఆధార్ చేయుట, బయోమెట్రిక్ అప్డేట్స్, అలాగే ఆధార్ లో మార్పులు చేర్పులు వంటివి చేస్తారన్నారు. ఈ ఆధార్ స్పెషల్ క్యాంపులను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో సూరాడ లక్ష్మణ (40) శనివారం ఉదయం చేపల వేటకు వెళ్లగా అలల తాకిడికి దుర్మరణం చెందారు. అటుగా వెళ్లిన జాలర్లు మృతదేహాన్ని గుర్తించారు. ఆయనకు భార్య, ఒక కూతురు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన తహశీల్దార్లు సొంత జిల్లాకు రానున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్లిన 45మంది తహశీల్దార్లు ఒకటి లేదా 2రోజుల్లో తిరిగి రానున్నారు.
వర్షాలు పడుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగదారుల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ కృష్ణమూర్తి తెలిపారు. తుపాను ప్రభావం దృష్ట్యా ప్రజలు తమ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యల ఫిర్యాదు చేసేందుకు 9490612633 హెల్ప్ డెస్క్ నంబరును సంప్రదించాలని సూచించారు. విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1912కు విద్యుత్ సమస్య వస్తే కాల్ చేయాలన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి సాయి కాలనీ నివాసముంటున్న ఆర్ఎంపీ డాక్టర్ కుందు శ్రీను(47) శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు మేడ పైనుంచి కాలుజారి కిందపడి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేశారు. కుందు శ్రీనుకు భార్యతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించినట్లు డీఈవో వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. మరో సెలవు రోజున పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
వేటనిషేధ కాలంలో పరిహార భృతి అందించే ప్రక్రియలో అర్హులను సర్వే ద్వారా గుర్తించి, ఆ జాబితాను నవశకం పోర్టల్లో పొందుపరిచామని జిల్లా మత్స్యకార అధికారి పి.వి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది మేలో 15,375 మందిని గుర్తించి అందులో 12,952 మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. రీవెరిఫికేషన్‌లో ఇంకా అర్హులుంటే వారిని కూడా గుర్తించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అయ్యాయన్నారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ B.Tech కోర్సులకు సంబంధించి 4, 6 సెమిస్టర్ల పరీక్షల నోటిఫికేషన్ విడుదలయింది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కార్యాలయం నుంచి అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు ఈనెల 27వ తేదీలోగా పరీక్ష ఫీజు రూ.800, ప్రాక్టికల్ ఫీజు రూ.250 యూనివర్సిటీకి చెల్లించాలి. 4వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 31న, 6వ సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానున్నాయి.
శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూ నిర్వహించగా.. నిరుద్యోగ యువత 290 మంది హాజరయ్యారు. ఇందులో 53 మందిని ఎంపిక చేసి ఉపాధి కల్పించినట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధా తెలిపారు.
Sorry, no posts matched your criteria.