India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో షీ టీమ్స్ ద్వారా ‘ఈట్ రైట్ క్యాంపైన్’ కింద అన్ని జోన్లలో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, వీధి ఆహార విక్రేతల వద్ద విస్తృత తనిఖీలు జరుపుతున్నట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం తెలిపారు. ఇప్పటివరకు 76 చోట్ల తనిఖీలు చేసి, 71 చోట్ల నోటీసులు, 50 చోట్ల రూ.68,600 అపరాధ రుసుములు విధించామని వెల్లడించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన విశాఖ కలెక్టరేట్లో బుధవారం మాతృ మరణాలపై డిస్ట్రిక్ట్ మెటర్నిటీ డెత్ సర్వేలేన్స్, రెస్పాన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు జరిగిన మూడు మాతృ మరణాలపై సమీక్షించారు. మాతృమరణాలు సంభవించకుండా గర్భిణీకి అవసరమైన సేవలను గుర్తించి అందజేయాలని సూచించారు. ఇకముందు మాతృమరణాలు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో DMHO జగదీశ్వరరావు పాల్గొన్నారు.
విశాఖలో ప్రమాదవశాత్తు మేడ పైనుంచి కింద పడి ఓ యువతి మృతి చెందినట్లు ఫోర్త్ టౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. లోకో పైలెట్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు రైల్వే కాలనీలో ఉంటున్నాడు. ఇతని కుమార్తె వర్షిత బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. బుధవారం ఇంటి మేడ పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడడంతో తీవ్రంగా గాయపడింది. యువతిని కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
విశాఖ కేంద్రంగా ఈనెల 22, 23 తేదీల్లో కొమ్మాదిలో జరిగే జోనల్ స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులు ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్ లో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా అని ఏర్పాట్లు చేయాలని, క్రీడ విభాగం అధికారులతో పాటు ఆరోగ్య శాఖ, జీవీఎంసీ అధికారులను ఆదేశించారు.
విశాఖలోని అన్ని ఐవీఎఫ్ కేంద్రాలు ప్రభుత్వ నిబంధన మేరకు రిజిస్ట్రేషన్‌తో పాటు అనుమతులు పొందాలని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డా.పి.జగదీశ్వర్ ఆదేశించారు. రెండు రోజులుగా నగరంలోని పలు ఐవీఎఫ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాలకు అనుమతులు ఉన్నది లేనిది రికార్డులను పరిశీలించి పలు సూచన చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలందించాలని ఆదేశించారు.
ఏయూలో బీటెక్ విద్యార్థి తమ్మినేని కౌశిక్(22) రామాటాకీస్ సమీపంలోని లాడ్జిలో విగతజీవిగా కనిపించాడు. కాకినాడకు చెందిన కౌశిక్ ఈనెల 10న లాడ్జిలో దిగాడు. ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో అమెరికాలో ఉన్న అతని అన్నయ్య కౌశిక్ ఫ్రెండ్స్‌కి కాల్ చేశాడు. వాళ్లు లాడ్జికి వెళ్లి చూడగా మరణించి ఉన్నాడు. ఘటనా స్థలంలో పాయిజన్ తాగి మృతి చెందిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వినాయక చవితి భద్రతా మార్గదర్శకాలపై కోఆర్డినేషన్ మీటింగ్‌ను పోలీసు కమిషనర్ శంఖబ్రాత బాగ్చి మంగళవారం నిర్వహించారు. వినాయక మండపాల వద్ద విద్యుత్, అగ్నిప్రమాద నివారణ చర్యలు, సీసీ కెమెరాలు, వాలంటీర్ల నియామకం, నిమజ్జనానికి గుర్తించిన ప్రదేశాల వినియోగం తప్పనిసరి. డ్రోన్లతో నిఘా, డొనేషన్ల బలవంతం, DJ, మత్తుపదార్థాలపై నిషేధం తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇటీవల ఎన్నికైన జీవీఎంసీ స్థాయి సంఘం సభ్యులు మంగళవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కమిషనర్ సభ్యులను అభినందిస్తూ, నగరంలోని ప్రతి అభివృద్ధి పనిపై స్థాయి సంఘంలో సమగ్రంగా చర్చించి ఆమోదం తెలుపడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని అన్నారు. నగర అభివృద్ధిలో సంఘం కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఈనెల 30న విశాఖలోని మున్సిపల్ స్టేడియం వేదికగా జనసేన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం విశాఖలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యకర్తల సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని, ఈ సభనుంచి కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు.
విశాఖలోని న్యాయ స్థానాల్లో సిబ్బంది నియామకానికి ఈనెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులంతా ఈ పరీక్షలకు 15 నిమిషాల ముందుగానే హాజరు కావాలన్నారు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించి పరీక్షకు హాజరుకావాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.