India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కచ్చితంగా పూర్తి చేయాలని విశాఖ కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన సమీక్షలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యటన ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

విశాఖలో బుధవారం, గురువారం రవాణాశాఖ అధికారులు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై 7 కేసులు నమోదు చేసినట్టు ఉప రవాణా కమిషనర్ ఆర్‌సీహెచ్.శ్రీనివాస్ గురువారం తెలిపారు. కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం వంటివి డ్రైవ్‌లో గుర్తించారు. నిబంధనలు ఉల్లంగించిన 7 బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది సంక్షేమంపై విశాఖ ఎంపీ శ్రీభరత్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రి కుమారస్వామిని కలిసి ఆరోగ్య బీమా ప్రీమియం పెంపును ఉపసంహరించుకోవాలని లేఖ అందజేశారు. పెండింగ్ జీతాలు, బకాయిల విడుదల సహా వేతన సవరణలను తక్షణమే చేపట్టాలని అందులో పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని కోరారు.

సీబీఎమ్ కాంపౌండ్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా నివాసం ఉంటున్న గొరుసు తరుణ్ శ్రీసాయి కిరణ్ రెడ్డి (23) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ ఎస్ఐ శకుంతల ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఎం.టెక్ ప్రాజెక్టులో ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

రైల్వే స్టేషన్ మార్గంగా గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టాలని విశాఖ సీపీ డా.శంఖబ్రత బాగ్చి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీఎఫ్, నగర పోలీసులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. స్టేషన్ పరిసరాల్లో భద్రత బలోపేతం, దొంగతనాల నివారణపై చర్యలు తీసుకోవాలని సూచించారు. స్కానింగ్ మిషన్లు, సీసీటీవీలు, లైటింగ్ ఏర్పాటుతో పాటు పొదలు తొలగించాలని చెప్పారు.

ఇరవై ఏళ్లుగా కనిపించని సత్యనారాయణను టూటౌన్ పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తిరుపతిలో తప్పిపోయిన ఆయనను నగరంలో గుర్తించిన పోలీసులు ముందుగా నిరాశ్రయ గృహానికి తరలించారు. అనంతరం వివరాలు సేకరించి కుటుంబ సభ్యులను సంప్రదించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం 11.40 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా జట్టీకి వెళ్లి ఓ నౌక ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తరువాత NSTLకి వెళ్లి అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నేరుగా ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని తిరుగుపయనం అవుతారు.
Sorry, no posts matched your criteria.