India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ఏప్రిల్ 17న గంధం అమావాస్యని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. 16వ తేదీ సాయంత్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి రాత్రి కొండదిగువన వరాహ పుష్కరిణి వద్ద, కొండపైన జాగరం చేసి అమావాస్య రోజు దర్శించుకోవడం ఆనవాయితిగా వస్తోంది. కావున ఏప్రిల్ 17న ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఈవో వెంకట్రావు శనివారం తెలిపారు.

విశాఖపట్నం-రాయ్‌పూర్ మధ్య ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సంబల్‌పూర్ డివిజన్‌లోని మునిగూడ-బిస్సాంకటక్ మధ్య వంతెన ఆధునీకరణ పనులు చేపట్టడమే దీనికి కారణం. ఏప్రిల్ 9, 11, 13, 20, 23, 25 తేదీల్లో రైలు నంబర్లు (58528/58527) రెండు వైపులా నడవవు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ కోరారు.

విశాఖలో గురువారం ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హెల్మెట్ ధరించనవి-1183, పిలియన్ రైడర్-242, ట్రిపుల్ రైడింగ్-66, ఆటోలపై కేసులు-3, ఓవర్ స్పీడ్-185, సెల్ఫోన్ డ్రైవింగ్-28, ఓవర్ స్పీడ్-185, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-95, రాంగ్ పార్కింగ్-209, డ్రంకెన్ డ్రైవ్-35, సీజ్ చేసిన వెహికల్స్-52, MVయాక్ట్ ఉల్లంఘన-441తో కలిపి మొత్తం 2,363 కేసులు నమోదయ్యాయి.

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా నేడు అత్యంత ఆసక్తికరమైన ‘అంగుళీయక అన్వేషణ’ ఉత్సవం జరిగింది. భక్తికి వినోదాన్ని జోడించి స్వామివారి లీలలను కళ్లకు కట్టేలా నిర్వహించారు. కళ్యాణ సమయంలో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బంగారు ఉంగరం కనిపించకుండా పోయిందనే నెపంతో ఈ సరదా ఉత్సవాన్ని నిర్వహించడం ఇక్కడి అనాదిగా వస్తున్న ఆచారం.

కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్నారు. విశాఖలో ఐఎన్ఎస్ డేగా వద్ద ఆయనకు ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, గణబాబు, కలెక్టర్, సీపీ స్వాగతం పలికారు. నావల్ డాక్‌యార్డ్‌లో ఐఎన్ఎస్ ‘తారాగిరి’ నౌక ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం నుంచి NSTLను సందర్శిస్తారు. సాయంత్రం 5:15 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి రాత్రి న్యూఢిల్లీకి వెళ్తారు.

విశాఖలోని గంభీరం వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIMV)కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యూకేకు చెందిన బిజినెస్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నుంచి ఐదేళ్ల అక్రిడిటేషన్ దక్కింది. వ్యాపార విద్యలో నాణ్యత, సామాజిక ప్రభావానికి ఈ గుర్తింపు లభించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో కొద్ది సంస్థలకే ఈ గౌరవం లభింస్తుందన్నారు.

ECoR కుర్దా రోడ్ డివిజన్లో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న 7 రైల్వే స్టేషన్లు SCoR విశాఖ డివిజన్‌కు బదిలీ కానున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్త చేశారు. 2019లో జోన్ ప్రకటించినప్పటి నుంచి ఈ డిమాండ్‌ను తీసుకెళ్లినట్లు తెలిపారు. పలాస, సుమ్మా దేవి, మందస రోడ్, బారువ, సోంపేట, జాడుపూడి, ఇచ్ఛాపురం స్టేషన్లు విశాఖ డివిజన్‌కు బదిలీ కానున్నాయని తెలిపారు.

కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది సముద్రంలో దూకి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని మహారాణిపేట పోలీసులు కాపాడారు. గురువారం రాత్రి 112కి అందిన సమాచారంతో సీఐ దివాకర్ యాదవ్ బృందం గోకుల్ పార్క్ బీచ్‌కు చేరుకుని ఆ వ్యక్తిని కాపాడారు. సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంతో వారి సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు.

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కచ్చితంగా పూర్తి చేయాలని విశాఖ కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన సమీక్షలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యటన ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కచ్చితంగా పూర్తి చేయాలని విశాఖ కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన సమీక్షలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యటన ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.