India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత పూర్వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనుమడు, పీఎంవోకు అకడమిక్ అడ్వైజర్ డాక్టర్ జి.సుబ్రహ్మణ్యం శర్మ ఆదివారం ఏయూని సందర్శించారు. వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన తాతగారు ఉపకులపతిగా సేవలందించిన ఏయూ శతాబ్ధి ఉత్సవాలను జరుపుకుంటున్న నేపథ్యంలో సందర్శించడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఏపీలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (IAC) ఏర్పాటు సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం విశాఖలో ACIAM సదస్సులో ఆయన మాట్లాడురు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త, ప్రతి నియోజకవర్గానికి ఒక MSME పార్క్ లక్ష్యమన్నారు. ఎంఎస్‌ఎంఈలకు రుణ భరోసా, ODR ద్వారా వేగవంతమైన వివాద పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు సింహాచలం డిపోను ఆదివారం తనిఖీ చేశారు. ఈనెల 20న జరిగే చందనోత్సవానికి సుమారు 70 బస్సులు నడపాలని ఆయన ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాలను సిద్ధం చేసి, మెకానికల్ టీమ్‌తో నిరంతర తనిఖీలు చేయాలని సూచించారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక సర్వీసులు నడపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీవీఎంసీలో గత తొమ్మిదేళ్లలో వార్డుల సంఖ్య పెంపు మూడోసారి చేపడుతున్నారు. 2017కి ముందు 72 వార్డులు ఉండగా, 2017లో 81కు, 2020లో పరిసర గ్రామాల విలీనంతో 98కు పెరిగాయి. ప్రస్తుతం 98 నుంచి 120కు పైగా పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం ముందుగా 8 జోన్లుగా ఉన్న జీవీఎంసీని ఇప్పటికే 10 జోన్లుగా విభజించారు.

జీవీఎంసీలో వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగం అందుకుంది. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 120కు పైగా పెంచనున్నారు. 15 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో 120 వార్డులు తప్పనిసరి అని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం10 జోన్లుగా విస్తరించిన జీవీఎంసీ జనాభా 23-25 లక్షల వరకు చేరింది. రానున్న మున్సిపల్ ఎన్నికలు 120 వార్డుల ఆధారంగా నిర్వహించే అవకాశం ఉంది.

విశాఖలో జీవీఎంసీ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్ రోజుకు సుమారు 50 నీటి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది జనవరి 1న ప్రారంభమైన ఈ ల్యాబ్ రాష్ట్రంలో తొలి మొబైల్ సదుపాయం. రూ.40 లక్షలతో ఏర్పాటైన ఈ వాహనం 98 వార్డుల్లో తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి నీటి నాణ్యతను పరీక్షిస్తోంది. పీహెచ్, క్లోరిన్, టీడీఎస్, టర్బిడిటీ వంటి ప్రమాణాలను వెంటనే నిర్ధారిస్తున్నారు. ఇప్పటివరకు కాలుష్యం గుర్తించలేదని అధికారులు తెలిపారు.

సమాచార కమిషనర్ సుధారాణి రేలంగి ఈనెల 6, 7వ తేదీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 6న ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకోనున్నారు. 7న ఉదయం 10 గంటలకు DSNLUలో జరిగే దక్షిణ ప్రాంత లా రివ్యూ కన్సల్టేషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పర్యటనకు అధికారులు భద్రత, రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు.

Sorry, no posts matched your criteria.