Visakhapatnam

News April 8, 2026

విశాఖ: రాష్ట్ర ఆదాయం గణాంకాలపై ఆల్ ఇండియా వర్క్‌షాప్

image

విశాఖలో నేటి నుంచి 10వ తేదీ వరకు జరగనున్న రాష్ట్ర ఆదాయం గణాంకాలపై ఆల్ ఇండియా వర్క్‌షాప్‌ను బుధవారం కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరబ్ గార్గ్ ప్రారంభించారు. నూతన ప్రామాణిక సంవత్సరం (2022-23) ఆధారంగా రాష్ట్ర ఆదాయం అంచనాలు, గణన విధానాలు, డేటా సమీకరణలో మార్పులు, సవరణలపై ఈ వర్క్‌షాప్‌లో సవివరంగా చర్చించనున్నారు.

News April 8, 2026

విశాఖ-పలాస, గుణుపూర్ మధ్య నిలిచిన రైలు సర్వీసులు

image

నౌపడ స్టేషన్‌లో ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా రైల్వే శాఖ ట్రాఫిక్ బ్లాక్ ప్రకటించింది. ఏప్రిల్ 9న ఈ పనులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ-గుణుపూర్ ప్యాసింజర్ (58506/05), విశాఖ-పలాస మెము (67289/90) రైళ్లను అధికారులు రద్దు చేశారు. భద్రత దృష్ట్యా చేపట్టిన ఈ పనుల వల్ల కలిగే అంతరాయానికి ప్రయాణికులు సహకరించాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. పవన్ కుమార్ కోరారు.

News April 8, 2026

విశాఖ: మొదటి నుంచి వివాదాలే..!

image

దేవదాయ శాఖ ఏసీ శాంతిని ACB అధికారులు అరెస్ట్ చేశారు. 2020లో విశాఖలో పోస్టింగ్ తర్వాత డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్‌పై ఇసుక, మట్టితో దాడి చేసి వార్తల్లో నిలిచారు. అనంతరం అధికార దుర్వినియోగం ఆరోపణలతో విజయవాడకు బదిలీ అయ్యారు. 2024లో ఆమె భర్త చేసిన ఫిర్యాదులపై విచారణ జరగ్గా సస్పెండ్ అయ్యారు. కోర్టు ఆదేశాలతో తిరిగి విధుల్లోకి వచ్చిన శాంతి తాజాగా ACB దాడుల్లో అరెస్టు కావడంతో కేసు మళ్లీ చర్చనీయాంశమైంది.

News April 7, 2026

విశాఖ: హైవేపై ప్రమాదం.. లారీ ఢీకొని వ్యక్తి మృతి

image

ఆనందపురం మండలంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో అంగుళూరు రాజు(36) మృతి చెందారు. గాజువాకలో ఓ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజు, వ్యాన్‌లో లోపం రావడంతో రోడ్డుపక్కన నిలిపి మరమ్మతు చేస్తుండగా ఓ లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, పోలీసులు మృతదేహాన్ని భీమిలి ఆసుపత్రికి తరలించారు. భార్య రామలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

News April 7, 2026

రేపు విశాఖకు డిప్యూటీ సీఎం

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖ రానున్నారు. విజయవాడ నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఆంధ్ర యూనివర్సిటీలో జరగనున్న శతాబ్ది ఉత్సవాలలో పాల్గొంటారు. తిరిగి రాత్రి 8:25కు విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారు. అధికారుల వీటికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు.

News April 7, 2026

రేపు విశాఖకు కేంద్ర కార్యదర్శి రాక

image

కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా. సౌరభ్ గార్గ్ బుధవారం విశాఖకు రానున్నారు. జాతీయ గణాంక ఉప ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించి, ఏప్రిల్ 2026లో ప్రారంభమయ్యే నేషనల్ హౌస్‌హోల్డ్ ఇన్‌కమ్ సర్వే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. సంబంధిత అధికారులతో సమావేశమై సూచనలు ఇస్తారు. ఆయనతో జేడీ రజత్, ఏడీ రాజశేఖర్ తదితరులు పాల్గొంటారు.

News April 6, 2026

విశాఖ: శ్రీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

గాజువాక సమీపంలోని శ్రీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో ఓ మహిళ మృతి చెందారు. సోమవారం సాయంత్రం శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన గురుబిల్లి శాంతమ్మను లారీ ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే కిందపడి మృతి చెందారు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 6, 2026

GVMCలో 79 గ్రామ పంచాయతీల విలీనం లేనట్టే..!

image

విశాఖ జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల 79 గ్రామ పంచాయతీలను GVMCలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే జిల్లాలో 89% పట్టణ, 11% గ్రామీణ ప్రాంతం ఉంది. ఈ 4 మండలాల్లో సుమారు 4-5 లక్షల జనాభా కలరు. 2027 జనాభా గణన తర్వాతే పునర్విభజనకు అవకాశం ఉండటంతో అప్పటివరకు విలీనం ప్రతిపాదనలు అటకెక్కినట్టే తెలుస్తోంది.

News April 5, 2026

క్రెడిట్ చోరీ కోసం వైసీపీ విశ్వ ప్రయత్నాలు: మంత్రి కొండపల్లి

image

భోగాపురం విమానాశ్రయ క్రెడిట్‌ను వైసీపీ తమదిగా చూపించుకునే ప్రయత్నం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కాలంలోనే శంకుస్థాపన జరిగి సుమారు 2,600 ఎకరాల భూసేకరణ పూర్తయిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం 300 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేశారని, ఆ నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం చేయలేదని ఆరోపించారు.

News April 5, 2026

ఏయూని సంద‌ర్శించిన స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ మ‌నుమ‌డు

image

భార‌త పూర్వ రాష్ట్ర‌ప‌తి స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ మ‌నుమ‌డు, పీఎంవోకు అక‌డ‌మిక్ అడ్వైజ‌ర్‌ డాక్ట‌ర్ జి.సుబ్ర‌హ్మ‌ణ్యం శ‌ర్మ ఆదివారం ఏయూని సంద‌ర్శించారు. వీసీ ఆచార్య జి.పి.రాజ‌శేఖ‌ర్‌తో మ‌ర్యాద‌పూర్వ‌కంగా భేటీ అయ్యారు. త‌న తాత‌గారు ఉప‌కుల‌ప‌తిగా సేవ‌లందించిన ఏయూ శ‌తాబ్ధి ఉత్స‌వాల‌ను జ‌రుపుకుంటున్న నేపథ్యంలో సంద‌ర్శించ‌డం త‌న‌కు ల‌భించిన గౌర‌వంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.