Visakhapatnam

News April 11, 2026

విశాఖ: ఏప్రిల్ 15న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

image

జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన ఈనెల 15న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఈవో పి.నారాయణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వివిధ స్థాయీ సంఘాల సమావేశాలు వేర్వేరుగా జరుగుతాయన్నారు. సభ్యులు, అధికారులు ప్రగతి నివేదికలతో హాజరుకావాలని కోరారు.

News April 10, 2026

రేపు విశాఖ రానున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి

image

విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శనివారం విశాఖ రానున్నారు. ఆరోజు ఉదయం 10:30 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని నగరంలోకి వెళ్తారు. 11:30 నుంచి కలెక్టరేట్‌లో సింహాచలం చందనోత్సవంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా చేస్తారు. సాయంత్రం 6గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి గన్నవరం వెళ్తారు.

News April 10, 2026

బెట్టింగ్ యాప్ ప్రమోట్.. విశాఖలో ఇద్దరి అరెస్ట్

image

విశాఖలోని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఓ కళాశాల ఫుట్బాల్ కోచ్‌ గణేశ్‌తో పాటు అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. వీరిద్దరూ మధురవాడ భగవాన్ దాస్ కాలనీ ప్రాంతానికి చెందిన వారే. విశాలాక్షి నగర్‌లో యువకుడ్ని క్రికెట్ ప్రిడిక్షన్ అంటూ నమ్మించి బెట్టింగ్ యాప్‌ను ప్రోత్సహించారు. వీరి మాటలు నమ్మిన యువకుడు రూ.12.50 లక్షలు పోగొట్టుకున్నాడు.

News April 9, 2026

విశాఖ: ఇరాన్ విద్యార్థుల‌కు ఆర్థిక సాయం చేసిన క‌లెక్ట‌ర్

image

యుద్ధ నేప‌థ్యంలో ఏర్ప‌డిన క్లిష్ట ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూ ఆర్థిక సాయం కోరిన ఇరాన్ విద్యార్థుల‌కు క‌లెక్ట‌ర్ అభిషిక్త్ కిశోర్ రూ.ల‌క్ష ఆర్థిక సాయం అంద‌జేశారు. జిల్లా సంజీవ‌ని నిధి నుంచి రూ.50 వేలు విలువ గ‌ల చెక్కును, క‌న‌కమ‌హాల‌క్ష్మి దేవ‌స్థానం స‌మ‌కూర్చిన రూ.50 వేలు న‌గ‌దును క‌లెక్టర్ త‌న ఛాంబ‌ర్లో గురువారం అందించారు. ఏయూలో ఫార్మ‌సీ కోర్సు చ‌దువుతున్న జినాబ్, సోల్మాజ్ బుధవారం వినతి అందజేశారు.

News April 9, 2026

చందనోత్సవం.. ‘గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఏర్పాట్లు’

image

సింహాచలంలో ఈనెల 20న జరగనున్న చందనోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ అభిషేక్త్‌ కిషోర్ గురువారం పరిశీలించారు. చందనోత్సవ కార్యక్రమంలో లక్షల మంది భక్తులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో క్యూలైన్లు, పార్కింగ్, మౌలిక వసతుల ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు. ఈవో వెంకట్రావు జరుగుతున్న పనులు, చేపడుతున్న భద్రతా చర్యలను కలెక్టర్‌కు వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

News April 9, 2026

కేజీహెచ్‌లో వార్డు బాయ్‌పై మేల్ నర్స్ దాడి..!

image

KGHలో బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్ట్‌ మేల్ నర్స్ పైడ్రాజు తనపై దాడి చేసినట్లు వార్డ్ బాయ్‌‌ అప్పలస్వామి ఆరోపించారు. తన మనవరాలు ప్రియాంక (పేషెంట్‌)ను ఆస్పత్రిలో చేర్చారు. సెలైన్ సరిగా పెట్టకపోవడంతో ఇబ్బంది పడినట్లు ప్రియాంక తన తాతకు చెప్పింది. దీంతో అక్కడే ఉన్న పైడ్రాజుని అడగ్గా తనపై దాడి చేసినట్లు అప్పలస్వామి చెప్పారు. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ప్రియాంక తెలిపారు.

News April 9, 2026

విశాఖలో ఒక్కరోజే 2,421 కేసులు నమోదు

image

విశాఖలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు బుధవారం కేసులు నమోదు చేశారు. హెల్మెట్ ధరించకపోవడంతో-1154, పిలియర్ రైడర్‌కి హెల్మెట్ లేకపోవడంతో-210, ట్రిపుల్ రైడింగ్-68, ఓవర్ స్పీడ్-290, సెల్ఫోన్ డ్రైవింగ్-19, లైసెన్స్ లేకుండా-8, రాంగ్ పార్కింగ్-253, డ్రంకెన్ డ్రైవ్-47, ఎంవీయాక్ట్ ఉల్లంఘనలో-485 చొప్పున మొత్తం మొత్తం 2,421 కేసులు నమోదు చేశామని సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు.

News April 9, 2026

లంకెలపాలెం వద్ద యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అనకాపల్లికి చెందిన పి.రమేశ్ (45) బుధవారం రాత్రి తన అత్త దేవితో కలిసి ద్విచక్ర వాహనంపై గాజువాక నుంచి అనకాపల్లి వస్తుండగా లంకెలపాలెం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందగా దేవి గాయపడింది. సీఐ మల్లికార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 8, 2026

కుటుంబ సభ్యుల సమాచారం తెలియక విలపించిన ఇరాన్ యువతులు

image

విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో డీఆర్వో విశ్వేశ్వరరావును ఇరాన్ యువతులు బుధవారం కలిసి తమ కుటుంబ సభ్యుల సమాచారం తెలియడం లేదని విలపించారు. ఇరాన్‌కు చెందిన కొంత మంది యువతులు ఆంధ్ర యూనివర్సిటీలో డీఫార్మసీ చదువుతున్నారు. యుద్ధం నేపథ్యంలో తమ తల్లిదండ్రుల సమాచారం అందడం లేదని డీఆర్వోకు తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు చెప్పి ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని వారికి డీఆర్వో తెలిపారు.

News April 8, 2026

విశాఖ: వేస్ట్ టు వండర్ పోటీలు.. ఏప్రిల్ 24 చివరి గడువు

image

స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో భాగంగా జీవీఎంసీ నిర్వహిస్తున్న ‘వేస్ట్ టు వండర్’ పోటీలను ఏప్రిల్ 24 చివరి తేదీగా నిర్ణయించినట్లు బుధవారం కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. స్క్రాప్‌తో 4-8 అడుగుల శిల్పాలు రూపొందించి సమర్పించాలన్నారు. అన్ని జోన్లలో పోటీలు నిర్వహించి మొత్తం రూ.22.5 లక్షల బహుమతులు ఇస్తామన్నారు. ఉత్తమ కళాఖండాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రతిష్ఠిస్తామని పేర్కొన్నారు.